TE/Prabhupada 1014 - ఒక కృత్రిమ భగవంతుడు శిష్యుడికి బోధిస్తున్నాడు విద్యుత్ షాక్స్ అనుభూతి చెందుతున్నాడు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1013 - Nous devrions essayer vite avant que la prochaine mort vienne|1013|FR/Prabhupada 1015 - Sauf s'il y a une force vivante derrière la matière, rien ne peut être crée|1015}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1013 - మరణము వచ్చే ముందే మనము చాలా వేగంగా ప్రయత్నించాలి|1013|TE/Prabhupada 1015 - దాని వెనుక జీవశక్తి లేనట్లయితే అక్కడ ఏదీ కూడా సృష్టించబడదు|1015}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Z1Hc-3sHs28|ఒక కృత్రిమ భగవంతుడు శిష్యుడికి బోధిస్తున్నాడు విద్యుత్ షాక్స్ అనుభూతి చెందుతున్నాడు  <br/>- Prabhupāda 1014}}
{{youtube_right|lkIGX9rHTyk|ఒక కృత్రిమ భగవంతుడు శిష్యుడికి బోధిస్తున్నాడు విద్యుత్ షాక్స్ అనుభూతి చెందుతున్నాడు  <br/>- Prabhupāda 1014}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



750626 - Lecture SB 06.01.13-14 - Los Angeles


ఒక కృత్రిమ భగవంతుడు తన శిష్యుడికి బోధిస్తున్నాడు ఆయన విద్యుత్ షాక్స్ అనుభూతి చెందుతున్నాడు. కాబట్టి మీరు రెండు మిలియన్ల డాలర్లు కలిగి ఉండవచ్చు; నాకు పది మిలియన్ల డాలర్లు ఉండవచ్చు; మీరు 100 డాలర్లు కలిగి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికి కొంత ధనం ఉంది. అది ఒప్పుకొనబడింది. కానీ ఎవరూ చెప్పలేరు “నేను అన్ని సంపదలు కలిగి ఉన్నాను.” అది సాధ్యం కాదు. ఎవరైనా “నేను అన్ని సంపదలు కలిగి ఉన్నాను,” అని అంటే అతడు భగవంతుడు. అది కృష్ణుడుచే చెప్పబడింది. ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చెప్పలేదు. కృష్ణుడు చెప్పాడు, భోక్తారాం యజ్ఞ - తపసాం సర్వ - లోక - మహేశ్వరం ( BG. 5.29) : ప్రతి ఒక్కటి ఆనందించేది నేనే, నేను విశ్వమంతటికీ యజమానిని. ఎవరు చెప్పగలరు? అది భగవంతుడు. ఐశ్వర్యస్య సమగ్ర సమగ్రస్య , సమగ్ర అంటే మొత్తం, అది పాక్షికమైనది కాదు, “నేను చాలా కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను పంచిపెట్టాను.” నేను పేరుతో చెప్పాలని కోరుకోవటం లేదు - ఒక కృత్రిమ దేవుడు, ఆయన తన శిష్యునికి బోధిస్తున్నాడు శిష్యుడు విద్యుత్ షాకులు అనుభూతి చెందుతున్నాడు. కాబట్టి దురదృష్టవశాత్తు, నేను మీకు విద్యుత్ షాక్ లు ఇవ్వలేను. (నవ్వు) మీరు చూడండి? విద్యుత్తు షాక్ లు, ఆయన విద్యుత్ షాక్ ద్వారా మూర్ఛపోయాడు. ఇవి బహిరంగంగా వ్రాయబడ్డాయి, మూర్ఖులు అంగీకరిస్తున్నారు. గురువులు ఎందుకు విద్యుత్ షాక్ ఇవ్వాలి? శాస్త్రంలో అది ఎక్కడ పేర్కొనబడింది? (నవ్వు) కానీ ఈ విషయాలు, కల్పిత విషయాలు పేర్కొన్నారు. విద్యుత్ షాక్. అతడు మూర్ఛ పోయినప్పుడు, అప్పుడు భగవంతుడు కూర్చున్నాడు, అతడికి తెలివి వచ్చినపుడు, అప్పుడు శిష్యుడు భగవంతుని అడిగాడు, “అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారు?”. ఇప్పుడు నేను ప్రతీది పూర్తి చేశాను. నేను నీకు ప్రతీది ఇచ్చాను. చూడండి. ఒక గురువు తన శిష్యుడికి బోధిస్తూ మొత్తం పూర్తి చేయగలడా? ఈ విషయాలు జరుగుతున్నాయి. అందువల్ల కృష్ణుడు ఆ రకమైన భగవంతుడు కాదు, “నేను అన్నింటినీ పూర్తి చేశాను.” పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమ్ ఏవవశిష్యతే ( ISO Invocation) ఇది భగవంతుడి నిర్వచనం. భగవంతుడు చాలా పరిపూర్ణము మీరు తన ఐశ్వర్యాలన్నీ తీసుకుపోయినప్పటికీ ఇంకా, ఆయన ఇంకా పూర్ణము. అది భగవంతుడు. అలా కాదు “నా సరుకు అయిపోయింది.”

కాబట్టి తెలివైన వ్యక్తి వైదిక సమాచారం నుండి భగవంతుడు అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. భగవంతుడిని తయారు చేయవద్దు. తయారీ, మనము ఎలా భగవంతుని ఉత్పత్తి చేయవచ్చు? అది సాధ్యం కాదు. కాబట్టి అది మనో - ధర్మ అని పిలవబడుతుంది. మానసిక కల్పన ద్వారా, మానసిక కల్పన, మనము భగవంతుని సృష్టించలేము. ఇది భగవంతుని నిర్వచనం, ఈశావాశ్యమ్ ఇదమ్ సర్వం యత్ కించిత్ జగత్యమ్ జగత్ ( ISO 1) ఇదమ్ సర్వం . సర్వం అంటే మీరు చూసేది. మీరు గొప్ప పసిఫిక్ మహా సముద్రాన్ని చూస్తారు.అది భగవంతునిచే సృష్టించబడింది. ఆయన ఒక పసిఫిక్ మహాసముద్రం సృష్టించాడు, అందువలన ఆయన అన్ని రసాయనాలు, హైడ్రోజన్, ఆక్సిజన్, పూర్తి అయ్యాయి అంతే కాదు. కాదు. ఆకాశంలో తేలియాడే మిలియన్ల ట్రిలియన్ల పసిఫిక్ సముద్రాలు ఉన్నాయి. అది భగవంతుని సృష్టి. ఆకాశంలో మిలియన్ల ట్రిలియన్ల గ్రహాలు తేలియాడుతున్నాయి. ఇంకో మిలియన్ల ట్రిలియన్ల జీవులు వున్నాయి, సముద్రాలు పర్వతాలు ప్రతీది ఉన్నాయి, కానీ ఏ కొరత లేదు. ఈ విశ్వం మాత్రమే కాదు; మిలియన్ల ట్రిలియన్ల విశ్వాలు వున్నాయి. మనము వేదాల నుండి ఈ సమాచారాన్ని పొందుతున్నాము.....

యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి
కోటిష్వశేష విభూతి భిన్నమ్
తద్ బ్రహ్మ నిష్కలమనంతమశేషభూతం
గోవిందమాదిపురుషం తమహం భజామి
(BS 5.40)....

భగవంతుని ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.