TE/Prabhupada 0993 - ఆయన ఆహారం లేకుండా పస్తులు ఉండకుండా ఉండేటట్లు చూడండి. ఇది ఆధ్యాత్మిక సామ్యవాదం: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0992 - Pour les opportunistes Il n'y a pas de conscience de Krishna|0992|FR/Prabhupada 0994 - Quelle est la différence entre Dieu et Nous|0994}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0992 - అవకాశవాదులకు కృష్ణ చైతన్యము లేదు|0992|TE/Prabhupada 0994 - భగవంతునికి మనకు మధ్య ఉన్న తేడా ఏమిటి|0994}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|FleLcQrdoig|ఆయన ఆహారం లేకుండా పస్తులు ఉండకుండా ఉండేటట్లు చూడండి. ఇది ఆధ్యాత్మిక సామ్యవాదం  <br/>- Prabhupāda 0993}}
{{youtube_right|Z3QvR5Gf6hg|ఆయన ఆహారం లేకుండా పస్తులు ఉండకుండా ఉండేటట్లు చూడండి. ఇది ఆధ్యాత్మిక సామ్యవాదం  <br/>- Prabhupāda 0993}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



730407 - Lecture SB 01.14.43 - New York


ఆయన ఆహారం లేకుండా పస్తులు ఉండకుండా ఉండేటట్లు చూడండి. ఇది ఆధ్యాత్మిక సామ్యవాదం అనువాదము: "మీతో కలిసి భోజనం చేయడానికి అర్హులైన వృద్ధులు, మరియు పిల్లల గురించి మీరు శ్రద్ధ తీసుకోలేదా? మీరు వారిని వదలి వేసి మీరు మీ భోజనమును ఒక్కరే ఒంటరిగా తీసుకున్నారా? మీరు అసహ్యకరమైనదిగా భావిస్తున్న ఏదైనా క్షమించరాని తప్పును చేశారా? "

ప్రభుపాద: కావున, "నీతో కలిసి భోజనం చేయటానికి అర్హత పొందిన వృద్ధులను, పిల్లల పట్ల మీరు శ్రద్ధ తీసుకోలేదా?" ఇది వేదముల సంస్కృతి. పంపిణీ చేయటానికి ఆహార పదార్థాలు ఉన్నప్పుడు, మొదటి ప్రాధాన్యత పిల్లలకు ఇవ్వబడుతుంది. మాకు గుర్తు ఉంది. మకు ఇప్పుడు డెబ్భై ఎనిమిది సంవత్సరములు అయినా కూడా, మేము పిల్లలుగా ఉన్నప్పుడు, మేము నాలుగు, ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నాము. మాకు గుర్తు ఉంది మీలో కొందరు దానిని చూశారు, మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మీరు చూశారా. కాబట్టి, మొదటి విందు పిల్లలకు ఉంటుంది. కొన్నిసార్లు నేను కొద్దిగా మొండిగా ఉండేవాడిని, నేను క్రింద కూర్చోనే వాడిని కాదు, "లేదు, నేను మీతో తీసుకోను, పెద్ద వారితో." కానీ అది పద్ధతి. మొదట పిల్లలు అందరికీ బాగా తినిపించాలి, తరువాత బ్రాహ్మణులకు, మరియు పిల్లలకు మరియు వృద్ధులకు. కుటుంబంలో, పిల్లలకు మరియు వృద్ధులకు... ఉదాహరణకు మహారాజు యుధిష్ఠిరను తీసుకోండి ధృతరాష్ట్రుడిని శ్రద్ధ వహించడానికి ఎంత ఆత్రుతగా ఉన్నారో. ఆయన అలా వ్యవహరించినప్పటికీ, జీవితాంతము శత్రువుగా వ్యవహరించినప్పటికీ అయినప్పటికీ వృద్ధుల మీద శ్రద్ధ వహించడము కుటుంబ సభ్యుల బాధ్యత. తన తమ్ముడు విదురుడు నిందించిన తరువాత దృతరాష్ట్రుడు ఇంటిని వదలి వెళ్ళినప్పుడు, కాబట్టి, "నా ప్రియమైన సోదరా, నీవు ఇప్పటికీ కుటుంబ జీవితము పట్ల ఆసక్తితో ఉన్నావు, నీకు సిగ్గు లేదు. నీవు నీ శత్రువులుగా చూసిన వారి దగ్గరి నుండి నీవు ఆహారము తీసుకొనుచున్నావు నీవు వారిని మొదటి నుండి చంపాలని కోరుకున్నావు. నీవు వారి ఇంటికి నిప్పు పెటించావు. మీరు వారిని అడవిలోకి బహిష్కరించారు. నీవు వారి జీవితముపై కుట్ర పన్నావు, ఇప్పుడు ప్రతిదీ నాశనమైనది, నీ కుమారులు, మనవలు, అల్లుళ్ళు, సోదరులు, మరియు తండ్రులు, పినతండ్రులు అందరూ..., " నేను చెప్పేది ఏమిటంటే భీష్ముడు తన పిన తండ్రి అని చెప్తున్నాను. కుటుంబములో అందరూ. ఈ ఐదుగురు సోదరుల మినహా కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చంపబడ్డారు: యుధిష్టర, భీమా, అర్జున, నకుల, సహదేవా. మగవారు అందరూ చంపబడ్డారు. కాబట్టి, మిగిలిన వారసుడు మహారాజ పరీక్షిత్ మాత్రమే. ఆయన తన తల్లి గర్భంలో ఉన్నాడు. ఆయన తండ్రి అర్జునుని కుమారుడు, అభిమన్యుడు మరణించాడు. అతనికి పదహారు సంవత్సరాలు. అదృష్టవశాత్తూ ఆయన భార్య గర్భవతి. లేకపోతే కురు రాజవంశం నాశనమయ్యేది. కావున, ఆయన మందలించినాడు "నీవు ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నావు కేవలం కుక్క వలె ముద్ద ఆహారము కొరకు. నా ప్రియమైన సోదరా నీకు సిగ్గు లేదు."

అందువల్ల అతడు చాలా తీవ్రముగా తీసుకున్నాడు, "అవును, నా ప్రియమైన సోదరుడా, నీవు సరిగ్గా చెప్తున్నావు. కావున ఏమిటి, నీవు నన్ను ఏమి చేయాలని అంటున్నావు?

అయితే, వెంటనే బయటకు రండి. వెంటనే బయటకు రండి. మరియు అడవికి వెళ్ళండి. అతను అంగీకరించాడు, అక్కడికి వెళ్ళినాడు.

కాబట్టి మహారాజ యుధిష్టర ఉదయం పూట మొదట వచ్చేవారు స్నానం చేసిన తరువాత, ఆరాధన తరువాత, ఎందుకంటే వృద్ధులను వెళ్లి చూడటము మొదటి కర్తవ్యము: నా ప్రియమైన పెదనాన్న, మీకు అంతా సౌకర్యవంతముగా వుందా? అంతా సరైనదేనా? కొంత సేపు ఆయనతో మాట్లాడి ఆయనను సంతోష పెట్టేవాడు ఇది కుటుంబ సభ్యుల బాధ్యత, పిల్లలు మరియు వృద్ధుల మీద శ్రద్ధ వహించడము, ఇంటిలో ఉన్న ఒక బల్లి మీద కూడా శ్రద్ధ వహించడము, ఇంట్లో ఒక పాము ఉన్నా. ఇది శ్రీమద్-భాగవతములో ఉన్న ఉత్తర్వు, గృహస్తుని, ఆయన ఎంత బాధ్యతను కలిగి ఉన్నాడు. అక్కడ చెప్పబడింది, ఒక పాము ఉన్నా కూడా... ఎవరూ పాము మీద శ్రద్ధ వహించడానికి కోరుకోరు. అందరూ చంపాలని కోరుకుంటారు, మరియు ఒక పాము చంపడము వలన ఎవరూ బాధ పడరు. ప్రహ్లాద మహరాజు చెప్తున్నారు, modeta sādhur api vṛścika-sarpa-hatyā ( SB 7.9.14) అతను ఇలా చెప్పాడు, "నా తండ్రి ఒక పాము,vṛścika, తేలు వంటి వాడు. కాబట్టి ఒక పామును లేదా తేలును చంపడము వలన ఎవరూ బాధ పడరు కావున నా ప్రభు, మీరు కోపముగా ఉండవద్దు. ఇప్పుడు ప్రతిదీ పూర్తయింది, నా తండ్రి మరణించాడు. " కాబట్టి, అది. అయినప్పటికీ శాస్త్రము చెప్తుంది, మీ ఇంట్లో ఒక పాము ఉన్నా కూడా, దానికి ఆహారం లేకుండా పస్తు ఉండకుండా ఉండేటట్లు చూడండి. ఇది ఆధ్యాత్మిక సామ్యవాదం. వారు ఇప్పుడు సామ్యవాదం వెంట పడుతున్నారు, కానీ వారికి సామ్యవాదం అంటే ఏమిటో తెలియదు. ప్రతి ఒక్కరినీ జాగ్రత్త తీసుకుంటారు. ఇది సామ్యవాదం, వాస్తవమైన సామ్యవాద సిద్ధాంతం. ఎవరూ ఆకలితో ఉండకూడదు. రాష్ట్రములో ఎవరూ ఏ అవసరములతో ఉండ కూడదు. అది సమ సమాజ సిద్ధాంతం