TE/Prabhupada 0844 - కేవలము రాజును తృప్తి పరిస్తే మీరు సర్వశక్తిమంతుడైన తండ్రి భగవంతుడిని ఆనంద పరుస్తారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0844 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0843 - Le tout début de la vie est une erreur. Ils pensent que ce corps est le moi|0843|FR/Prabhupada 0845 - Même le chien sait comment utiliser la vie sexuelle. Cela ne demande pas une philosophie de Freud|0845}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0843 - వారి జీవిత ప్రారంభమే పొరపాటుగా ఉంది. వారు ఈ శరీరమే నేను అని అనుకుంటున్నారు|0843|TE/Prabhupada 0845 - కుక్కకు కూడా మైథునజీవితము ఎలా ఉపయోగించాలో తెలుసు దానికి ఫ్రూడ్ తత్వము అవసరం లేదు|0845}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|9pAj1P-1Rm4|కేవలము రాజును తృప్తి పరిస్తే మీరు సర్వశక్తిమంతుడైన తండ్రిని భగవంతుడిని ఆనంద పరుస్తారు  <br/>- Prabhupāda 0844}}
{{youtube_right|wAnzZSkbPBw|కేవలము రాజును తృప్తి పరిస్తే మీరు సర్వశక్తిమంతుడైన తండ్రిని భగవంతుడిని ఆనంద పరుస్తారు  <br/>- Prabhupāda 0844}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 20:36, 8 October 2018



731216 - Lecture SB 01.15.38 - Los Angeles


గతంలో, మొత్తము లోకము, భరతవర్షం... ఇది భరతవర్షం అని నామము పెట్టారు. ఇది ఒక చక్రవర్తి చేత పాలించబడింది. అందువలన ఇక్కడ చెప్పబడింది, స్వరాట్. స్వరాట్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం. మహారాజు యుధిష్టరుడు ఏ ఇతర రాజు లేదా ఇతర రాష్ట్రాల మీద ఆధారపడలేదు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు. ఆయన ఏది కోరితే, అది చేయగలడు. అది రాజు అది చక్రవర్తి . రాజు లేదా అధ్యక్షుడు అని పిలవబడే వారు ఎవరో మూర్ఖపు ఓటర్ల ఓట్లపై ఆధారపడి వుంటే, ఆయన ఏ రకమైన స్వరాట్? ప్రస్తుత క్షణంలో, అధ్యక్షుడు అని పిలవబడే అతడు కొంతమంది మూర్ఖుల ఓట్లపై ఆధారపడి ఉన్నాడు అంతే. మూర్ఖులు, వీరికి తెలియదు ఎవరికి ఓటు వెయ్యాలో, అందుచేత మరో మూర్ఖుడు ఎన్నికయ్యాడు. ఆయన బాగా చేయనపుడు, వారు బాధపడతారు. మీరే ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే వారు మూర్ఖులు. వారికి తెలియదు. కాబట్టి ఇది జరుగుతోంది. కానీ, నిజానికి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రంగా ఉండాలి, పూర్తిగా స్వతంత్రంగా. ప్రజల ఓట్లపై కాదు. అయన కృష్ణునిపై మాత్రమే ఆధారపడి ఉంటారు, యుధిష్టర మహారాజు వలె. పాండవులు అందరూ, వారు కృష్ణుని ఆజ్ఞ కింద ఉన్నారు.

కాబట్టి రాజు లేదా చక్రవర్తి, కృష్ణుని ప్రతినిధి. అందువలన అతడు గౌరవింపబడతాడు, నరదేవ. రాజు మరొక నామము నరదేవుడు, "భగవంతుడు, మానవునిగా వచ్చారు." మానవుడిగా భగవంతుడు వచ్చారు, రాజు అలా గౌరవింపబడతాడు. ఎందుకంటే అతడు కృష్ణుని ప్రతినిధి. ఏ కృష్ణుని ప్రతినిధి అయినా... కేవలము రాజు(గా)... ప్రస్తుత రాజు లేదా అధ్యక్షుడు కాదు, ఇది సరైనది. అందువలన ఆయన చాలా ఖచ్చితమైన ప్రతినిధి అయి ఉండాలి... విశ్వనాథ చక్రవర్తి ఠాకూరా చెప్పినట్లు, Yasya prasadad bhagavat-prasadah. రాజు వాస్తవమైన ప్రతినిధిగా ఉంటే, అపుడు కేవలము రాజును సంతోషింప చేయటం ద్వారా, మీరు సర్వశక్తిమంతుడైన తండ్రిని, భగవంతుడిని ఆనంద పరుస్తారు. ఇది... అందువల్ల కృష్ణుడు మహారాజు యుధిష్టరుడ్ని చక్రవర్తిని చేయడానికి కురుక్షేత్ర యుద్ధాన్ని కోరుకున్నారు? ఎందుకంటే ఆయనకు తెలుసు "అతడు నా నిజమైన ప్రతినిధి, దుర్యోధనుడు కాదు. అందువల్ల పోరాటం జరగాలి, ఈ దుర్యోధనుడ్ని అతడి పరివారమును ముగించాలి., యుధిష్టరుని ప్రతిష్టించాలి.

కాబట్టి ఎంపిక... ఇది పరంపర. కాబట్టి యుధిష్టరుని బాధ్యత తదుపరి రాజు ... ఆయన పదవీ విరమణ చేయబోతున్నాడు. తదుపరి చక్రవర్తి, ఆయన కూడా నాతో సమానమైన అర్హత కలిగి ఉండాలి. అందువల్ల ఇలా చెప్పబడింది, సుసమం గుణైః సుసమం," సరిగ్గా నా ప్రతినిధి. ఆయన కలిగి ఉన్నారు... నా మనువడు, పరీక్షిత్తు, ఆయనకు సమాన అర్హత ఉంది. అందువల్ల అతడిని రాజును చేయాలి. పోకిరిని కాదు. కాదు. అది చేయ కూడదు. పరీక్షిత్తు మహారాజు జన్మించినపుడు, మొత్తం కురువంశంలో ఆయన ఏకైక సంతానం. మిగతావారంతా యుద్ధంలో చంపబడ్డారు. కాదు. అతడు కూడా మరణం నుండి బయటపడ్డ పిల్లవాడు. ఆతడు తన తల్లి గర్భం లో ఉన్నాడు. తల్లి గర్భవతి. ఆయన తండ్రికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే, అభిమన్యుడు, అర్జునుని కుమారుడు, యుద్ధంలో పోరాడటానికి వెళ్ళాడు. ఆయన చాలా గొప్ప యోధుడు. అందువల్ల అతడిని చంపడానికి ఏడుగురు యోధులు అవసరం అయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, ఇలా అందరూ కలిసి. వారికి దయ లేదు. ఈ అభిమన్యుడు మనవడు, చంపడానికి అతడిని చుట్టుచేరిన నాయకులకు అతను మునిమనవడు. చాలా ప్రియమైన మనవడు లేదా ముని మనవడు భీష్ముడి మునిమనవడు, దుర్యోధనుని మనవడు. కానీ అది పోరాటం, క్షత్రియ. మీరు పోరాడటానికి వచ్చినప్పుడు, మీరు వ్యతిరేక పక్షమును చంపాలి. ఆయన నా ప్రియమైన కుమారుడా లేదా మనవడా లేదా మునిమనవడా అని పట్టింపు లేదు. ఇది కర్తవ్యము