TE/Prabhupada 0886 - వ్యక్తి భాగవతాన్ని లేదా పుస్తక భాగవతాన్ని, మీరు ఎల్లప్పుడూ సేవించండి: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0885 - Le plaisir spirituel ne termine pas. Il s'augmente|0885|FR/Prabhupada 0887 - Veda signifie la connaissance, et Anta signifie Dernière étape, ou Fin|0887}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0885 - ఆధ్యాత్మిక ఆనందానికి ముగింపు లేదు.అది పెరుగుతూ ఉంటుంది|0885|TE/Prabhupada 0887 - వేద అంటే జ్ఞానము మరియు అంత అంటే చివరి దశ, లేదా ముగింపు|0887}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|-kCVXt9nrqI|వ్యక్తి భాగవతాన్ని లేదా పుస్తక భాగవతాన్ని, మీరు ఎల్లప్పుడూ సేవించండి  <br />- Prabhupāda 0886}}
{{youtube_right|Onh3WHejKdA|వ్యక్తి భాగవతాన్ని లేదా పుస్తక భాగవతాన్ని, మీరు ఎల్లప్పుడూ సేవించండి  <br />- Prabhupāda 0886}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 20:42, 8 October 2018



730413 - Lecture SB 01.08.21 - New York


వ్యక్తి భాగవతాన్ని లేదా పుస్తక భాగవతాన్ని, మీరు ఎల్లప్పుడూ సేవించండి. అప్పుడు మీరు కృష్ణచైతన్యంలో స్థిరులవుతారు. ప్రభుపాద: కాబట్టి మనము ఈ కృష్ణచైతన్య ఉద్యమాన్ని శాస్త్రీయ ఆధారంతో స్వీకరించాలి. శ్రీ ... నీవు చక్కగా పనిచేస్తున్నందుకు, అర్చామూర్తులకు చక్కగా వస్త్రాలంకరణ సేవ చేస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మరింత మరింతగా, ఈ విధముగా కృష్ణునికి చక్కని ప్రసాదము, చక్కని ఆహార పదార్థాలు, మంచి దుస్తులు అర్పించండి. ఆలయాన్ని చాలా శుభ్రంగా ఉంచండి. శ్రీ -మందిర-మార్జనాదిషు. మార్జనం అంటే శుభ్రంచేయడం. మీరు కృష్ణుడి వస్త్రాలంకరణ చేసినా లేదా దేవాలయాన్ని శుభ్రపరచినా, ఒకటే ఫలితాన్ని పొందుతారు. ఇలా భావించవద్దు "నేను ఒక శుభ్రం చేసేవాన్ని ఆయన ఒక అలంకరణ చేసేవాడు అని అనుకోవద్దు." లేదు. అలంకరణ చేసేవాడు మరియు శుభ్రం చేసేవాడు ఇద్దరిదీ ఒకే స్థాయి. కృష్ణుడు పరిపూర్ణుడు. ఏదో విధముగా, కృష్ణుడి సేవలో నిమగ్నమవ్వండి. మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము.

కాబట్టి కుంతీదేవి యొక్క కరుణ ద్వారా మనము కృష్ణున్ని,దేవాదిదేవుడైన వాసుదేవున్ని అర్థం చేసుకోగలం. వాసుదేవ... వాసుదేవ యొక్క ఇంకొక అర్థం ఏమిటంటే మీరు వసుదేవ యొక్క స్థాయికి వచ్చినప్పుడు. Sattvaṁ viśuddhaṁ vasudeva-śabditam. సత్వం. సత్వ, సత్వ గుణము. అన్నింటిలో మొదటిది, మనం సత్వగుణ స్థితికి రావాలి. కానీ ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, సత్వ గుణము కొన్నిసార్లు ఇతర క్రింది స్థాయి గుణాలైన, రజో గుణము మరియు తమోగుణములచే కలుషితమౌతుంది. కాబట్టి కృష్ణుడి గురించి శ్రవణం చేయడం ద్వారా, śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ puṇya-śravaṇa-kīrtanaḥ ( SB 1.2.17) మీరు కృష్ణుడి గురించి వింటున్నట్లుగానే. అదేవిధముగా, కృష్ణుడి గురించి ఎప్పుడూ శ్రవణము చేయడానికి ప్రయత్నించండి, కృష్ణుడిని ఇరవై నాలుగు గంటలు కీర్తించండి. ఈ విధముగా, మనలోని కాలుష్యాలు తొలగించబడతాయి. Naṣṭa-prāyeṣv abhadreṣu nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) నిత్యం అంటే ఎల్లప్పుడూ. కేవలం భాగవత-సప్తాహంలో, ప్రత్యేక సందర్భంలో అని కాదు. లేదు, అలా కాదు. అది మరొక తప్పుడు అభిప్రాయం. భాగవతములో ఇలా చెప్పబడింది, నిత్యం భాగవత-సేవయా. నిత్యం అంటే రోజూ, ఇరవై నాలుగు గంటలూ. మీరు శ్రీమద్-భాగవతం చదవడమో లేదా మీ ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనను పాటించడమో చేయండి. ఇది కూడా ఆదేశమే, భాగవతము అనేది ఆధ్యాత్మిక గురువు. వైష్ణవుడు, ఆయన కూడా భాగవతమే. ఆచార్యులు, భాగవతులు. గ్రంథ-భాగవతము మరియు వ్యక్తి భాగవతము. కాబట్టి వ్యక్తి భాగవతాన్ని లేదా పుస్తక భాగవతాన్ని, మీరు ఎల్లప్పుడూ సేవించండి. Nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) Bhagavaty uttama-śloke bhaktir bhavati naiṣṭhikī. అప్పుడు మీరు స్థిరులవుతారు. నైష్ఠికీ. ఎవరూ మిమ్మల్ని విచలితుల్ని చేయలేరు. భగవతీ ఉత్తమ-శ్లోకే, ఆ భగవంతుని పట్ల.

ఈ విధముగా, మీరు కృష్ణచైతన్య ఉద్యమం యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి, ఆదేశించిన పద్ధతి ప్రకారం, ప్రజలకు కృష్ణచైతన్నాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది ప్రపంచంలో కెల్లా గొప్ప సంక్షేమ కార్యక్రమము. నిద్రాణంలో వున్న కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడం, అది, వాస్తవానికి, నాలుగు లేదా ఐదు సంవత్సరాల క్రితం మీరు చూడగలరు, మీలో ఎవరూ కూడా కృష్ణ చైతన్యములో లేరు, కానీ అది జాగృతం చేయబడింది. ఇప్పుడు మీరు కృష్ణచైతన్యవంతులు. కాబట్టి ఇతరులను కూడా జాగృతం చేయవచ్చు. ఇందులో ఇబ్బంది లేదు. పద్ధతి మాత్రం ఒకటే. కాబట్టి కుంతీమహారాణి వంటి భక్తుల అడుగుజాడలను అనుసరించడం ద్వారా, ఆమె తెలుపుతున్న విషయాలను మనము అర్థం చేసుకోగలుగుతాము: kṛṣṇāya vāsudevāya devakī-nandanāya ca, nanda-gopa-kumārāya ( SB 1.8.21) ఇది కృష్ణుడి గుర్తింపు. ఎలాగంటే మనము ఒక వ్యక్తిని గుర్తించే విధముగానే: "మీ తండ్రిగారి పేరు ఏమిటి?" అలానే ఇక్కడ మనము భగవంతున్ని ఆయన తండ్రి పేరు, ఆయన తల్లి పేరు, ఆయన చిరునామాతో తెలియజేస్తున్నాము. మనము నిరాకారవాదులము కాము, ఎలాంటి అస్పష్టమైన ఆలోచనా లేదు. లేదు. ప్రతిదీ సంపూర్ణంగా వుంది, పరిపూర్ణంగా, ఆ భగవంతుని గుర్తింపు. మీరు కృష్ణ చైతన్యము యొక్క ఈ ప్రచార కార్యక్రమాన్ని వినియోగించుకుంటే, అప్పుడు మీరు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద