TE/Prabhupada 0448 - మనము దేవుడు గురించి పాఠాలను శాస్త్రము నుండి, గురువు నుండి , సాధువు నుండి తీసుకోవాలి

Revision as of 16:55, 30 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0448 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.3 -- Mayapur, February 17, 1977


ప్రద్యుమ్న: అనువాదం - "ఆ తరువాత బ్రహ్మదేవుడు ప్రహ్లాద మహారాజాని అభ్యర్ధించారు, ఎవరైతే తనకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నారో నా ప్రియ కుమారుడా, భగవంతుడు నరసింహ స్వామి, నీ రాక్షస తండ్రి మీద చాలా కోపంగా ఉన్నాడు. దయచేసి ముందుకు వెళ్ళి, భగవంతుడిని శాంత పరుచు."

ప్రభుపాద:

prahrādaṁ preṣayām āsa
brahmāvasthitam antike
tāta praśamayopehi
sva-pitre kupitaṁ prabhum
(SB 7.9.3)

కాబట్టి నరసింహ స్వామి చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నాస్తిక తరగతి వ్యక్తులు, దేవాదిదేవుడి యొక్క స్వభావం ఏమీ తెలియని వారు, వారు అంటారు "దేవుడు ఎందుకు కోపముగా ఉండాలి?". కాబట్టి దేవుడు, ఎందుకు ఆయన కోపంగా ఉండకూడదు? దేవుడు ప్రతిదీ తప్పక కలిగి ఉండాలి; ఆయన ఎలా పరిపూర్ణముగా ఉంటాడు? Pūrṇam. కోపం కూడా జీవించి ఉన్నవారి యొక్క మరొక లక్షణము. రాయికి కోపము రాదు ఎందుకంటే అది రాయి. కాని ప్రాణము ఉన్న ఏ జీవికి అయినా, ఆయనకు కోపం వస్తుంది. అది ఒక లక్షణము. ఎందుకు దేవుడు కోపంగా ఉండకూడదు? వారు దేవుణ్ణి ఊహించుకుంటారు; వారికి దేవుడు పట్ల వాస్తవమైన భావన ఉండటము వలన కాదు. వారు "దేవుడు ఇలా ఉండాలి, దేవుడు అహింసా వాది అయి ఉండాలి, దేవుడు చాలా శాంతముగా ఉండాలి." ఎందుకు? కోపం ఎక్కడ నుండి వస్తుంది? ఇది దేవుడు నుండి వస్తుంది. లేకపోతే కోపమునకు ఉనికి లేదు. ప్రతిదీ ఉంది. Janmādy asya yataḥ ( SB 1.1.1) అది బ్రహ్మణ్ యొక్క నిర్వచనం. మన అనుభవంలో ఉన్నది ఏమైనా, మరియు మన అనుభవంలో లేనిది ఏమైనా... మన అనుభవంలో ప్రతిదీ లేదు. నరసింహ స్వామి గురించి లక్ష్మీకి కూడా అనుభవం లేదు, భగవంతుడు సగం సింహం, సగం మనిషి అయ్యారు అని. లక్ష్మీ కూడా, ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి? లక్ష్మీ, ఆమె భగవంతుడు యొక్క నిరంతర సహచారి. కాబట్టి ఇది అశ్రుత అని చెప్పబడింది. అది ఏమిటి? Adṛṣṭa. Adṛṣṭa aṣruta pūrvatvāt ఆమె భయపడ్డారు ఎందుకంటే ఆమె కూడా ఎప్పుడూ చూడలేదు, అటువoటి అతి గొప్ప రూపం, సగం సింహం, సగం మనిషి. దేవుడికి చాలా రూపాలు ఉన్నాయి: advaita acyuta anādi ananta-rūpam (Bs. 5.33). Ananta-rūpam; ఇప్పటికీ, అద్వైత. కాబట్టి భాగవతము చెబుతున్నది దేవుడు అవతారాలు సరిగ్గా నది లేదా సముద్ర అలల వలె ఉంటాయి. ఎవరూ లెక్కించలేరు. మీరు అలల సంఖ్యను లెక్కించాలనుకుంటే మీరు అలసి పోతారు. అది అసాధ్యం. కాబట్టి దేవుడు అవతారాలు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని అలలు ఉన్నాయో అన్ని. కాబట్టి మీరు అలలను లెక్కించలేరు; కాబట్టి మీరు అర్థం చేసుకోలేరు, ఆయనకు ఎన్ని అవతారాలు ఉన్నాయి. లక్ష్మీ కూడా, అనంతదేవా కూడా, వారికి కూడా తెలియదు. కావున మన అనుభవం - చాలా పరిమితం. మనము ఎందుకు చెప్పాలి? "దేవుడు ఇది కలిగి ఉండకూడదు, దేవుడు ఇది కలిగి ఉండకూడదు ..." అలాంటిది? ఇది నాస్తికత్వము. వారు విభాగం తయారు చేస్తారు. వాళ్ళు చెప్తారు... మన వేద ఆర్య-సమాజము అని పిలవబడే దానిలో కూడా, దేవుడు అవతారము చేయలేడని వారు వక్కాణించి వాదిస్తారు. ఎందుకు? దేవుడు సర్వశక్తిమంతుడైతే, అతడు ఎందుకు అవతారములు కలిగి ఉండకూడదు?

అందువల్ల మనము ఈ మూర్ఖుల నుండి దేవుడు గురించి పాఠాలను తీసుకోకూడదు. మనము దేవుడు గురించి పాఠాలను శాస్త్రము నుండి, గురువు నుండి , సాధువు నుండి తీసుకోవాలి - దేవుణ్ణి చూసిన వ్యక్తి, tattva-darśina. Tad viddhi praṇipātena paripraśnena sevayā, upadekṣyanti tad jñānam ( BG 4.34) Tad jñānam అంటే ఆధ్యాత్మిక జ్ఞానం.

tad-vijñānartham sa gurum evābhigacchet
samit-pāṇiḥ śrotriyaṁ brahma-niṣṭham
(MU 1.2.12)

కావున tad-vijñānam, మీరు ఊహించుకోలేరు, అది సాధ్యం కాదు. మీరు దేవుణ్ణి చూసిన "తత్వదర్శిన అనే వ్యక్తి నుండి నేర్చుకోవాలి. చూడటం ద్వారా, మీ వల్ల కాదు... ఉదాహరణకు లక్ష్మీదేవి వలె, ఆమె ప్రతి క్షణం చూస్తూoది, నిరంతరం. ఆమెకు కూడా తెలియదు. Asruta-purva. Adrstāsruta-purva.. కాబట్టి మనం చూస్తున్నది లేదా మనం చూడనిది, ప్రతిదీ ఉంది. Ahaṁ sarvasya prabhavaḥ ( BG 10.8) కృష్ణుడు చెపుతాడు, మీరు చూసేది ఏదైనా, మీరు అనుభవించేది ఏదైనా, నేను ప్రతి దాని యొక్క మూలం. కాబట్టి కోపం ఉండాలి. "దేవుడు కోపంగా ఉండరాదు" అని మీరు ఎలా చెప్పుతారు. దేవుడు ఇలా ఉండకూడదు. దేవుడు ఇలా ఉండకూడదు... "లేదు, అది వాస్తవం కాదు. ఇది మన అనుభవము లేకపోవటము