TE/Prabhupada 0609 - మీరు చాలా మంది హరేకృష్ణ మంత్రం జపం చేస్తున్నారు. ఇది నా విజయం

Revision as of 16:54, 7 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0609 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Lecture -- Los Angeles, May 18, 1972


నా ప్రియమైన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఆరు సంవత్సరాల క్రితం నేను మీ దేశం వచ్చాను, ఒక్కడినే, జత కరతాళములతో . ఇప్పుడు మీరు చాలా మంది హరేకృష్ణ  మంత్రం జపం చేస్తున్నారు. ఇది నా విజయం. ఇది భగవంతుడైన  చైతన్య మహాప్రభు యొక్క అంచనా:

pṛthivīte āche yata nagarādi grāma
sarvatra pracāra hoibe mora nāma
(CB Antya-khaṇḍa 4.126)

భగవంతుడైన చైతన్య కోరుకున్నారు "అన్ని పట్టణాలలో , ప్రపంచంలోని ఉపరితలంపై ఉన్న అనేక పట్టణాలు మరియు గ్రామాలలో నా పేరు ప్రసారం చేయబడుతుంది. " అతను కృష్ణుడు, స్వయం కృష్ణ , కృష్ణచైతన్య నామినే , కేవలం అతని పేరును కృష్ణ  చైతన్యగా మార్చుకున్నాడు. కాబట్టి ఆయన అంచనా ఎప్పటికైనా వ్యర్థంగా పోదు. ఇది సత్యము. కాబట్టి నా ప్రణాళిక ఏమిటంటే, "నేను అమెరికాకు వెళ్తాను అమెరికా ప్రపంచంలోని ప్రముఖ దేశం. అమెరికాలో ఉన్న యువతరాన్ని నేను ఒప్పించగలిగితే , వాళ్లు తీసుకుంటారు, నేను వృద్ధుడను. నేను డెబ్భై సంవత్సరాల వయస్సులో ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు నాకు డెబ్బై ఆరు. నాకు హెచ్చరిక ఇప్పటికే ఉంది. పందొమ్మిది వందల డెబ్భై ఒకటిలో, నాకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మీ అందరికీ తెలుసు. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క  ఉద్యమం మీ  చేతుల్లోనే ఉంది. మీరు అమెరికన్ అబ్బాయిలు మరియు బాలికలు, చాలా తెలివైనవారు మరియు కృష్ణుని దయ పొందినవారు . మీరు పేదరికంలో లేరు. మీకు తగినంత వనరులు, గౌరవం ఉన్నాయి. మీరు భౌతికముగా కూడా అన్నీ బాగా అమర్చుకున్నారు. మీరు ఈ కృష్ణచైతన్య ఉద్యమాన్ని తీవ్రముగా తీసుకుంటే, మీ దేశం కాపాడబడుతుంది, మరియు మొత్తం ప్రపంచం కాపాడబడుతుంది.