TE/Prabhupada 0920 - కీలకమైన శక్తి, ఆత్మ ఉంది కనుక, మొత్తం శరీరం పని చేస్తుంది

Revision as of 06:07, 28 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0920 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730422 - Lecture SB 01.08.30 - Los Angeles


ఎందుకంటే కీలకమైన శక్తి, ఆత్మ ఉంది కనుక, మొత్తం శరీరం పని చేస్తుంది అనువాదము: "ఓ విశ్వము యొక్క ఆత్మ, ఇది ఆశ్చర్యముగా ఉన్నది, మీరు పని చేయకపోయినను, మీరు పని చేస్తున్నట్లుగా ఉండుట మీరు జన్మ తీసుకుంటున్నారు, మీరు కీలకమైన శక్తి మరియు మీరు జన్మించని వారు అయినప్పటికీ. మీకు మీరుగా జంతువుల, వ్యక్తుల, ఋషులు జలచరాలలో మధ్య అవతరిస్తారు. నిజానికి ఇది చాలా ఆశ్చర్యము కలిగిస్తుంది. " ప్రభుపాద: కావున కృష్ణుడు ఇక్కడ విస్వాత్మన్ గా పిలువ బడ్డారు విశ్వం యొక్క ముఖ్యమైన శక్తి. ఉదాహరణకు నా శరీరం లో, మీ శరీరం లో, ఒక ముఖ్యమైన శక్తి ఉంది. ప్రాణాధార శక్తి అత్మ, జీవి లేదా ఆత్మ. ప్రాణ శక్తి ఉన్నందున, ఆత్మ అక్కడ ఉంది, మొత్తం శరీరం పని చేస్తుంది.

అదేవిధముగా మహోన్నతమైన కీలక శక్తి ఉంది. మహోన్నతమైన కీలక శక్తి కృష్ణుడు లేదా మహోన్నతమైన వ్యక్తి అయిన భగవంతుడు. అందువల్ల ఆయన జన్మించడము, అవతరించడము మరియు అంతర్ధానము అవ్వటము అనే ప్రశ్న ఎక్కడ ఉంది? భగవద్గీతలో ఇది చెప్పబడింది: janma karma ca me divyam ( BG 4.9) దివ్యం అంటే ఆధ్యాత్మికం. Ajo 'pi sann avyayātmā. అజా అంటే జన్మించక పోవడము Avyayātmā, అవ్యయాత్మ , ఏ విధ్వంసం లేకుండా. కృష్ణుడు ఉన్నారు. కాబట్టి ఈ శ్లోకము ప్రారంభంలో... కుంతీదేవి కృష్ణుడిని సంభోదిస్తుంది: "నీవు లోపల ఉన్నావు, నీవు వెలుపల ఉన్నావు - అయినప్పటికీ కనిపించవు." కృష్ణుడు లోపల ఉన్నారు, వెలుపల ఉన్నారు. దీనిని మనము వివరించాము. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭati ( BG 18.61) Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ ( BG 15.15) అందరి హృదయములో కృష్ణుడు ఉన్నాడు. అందువలన ఆయన ప్రతి దాని లోపల ఉన్నాడు. Aṇḍāntara-stha-paramāṇu-cayāntara-stham (BS 5.35). ఆయన, ఆయన కూడా అణువు లోపల ఉన్నాడు. లేకుండా కూడా ఉన్నాడు.

విశ్వరూప, కృష్ణుడు చూపించినట్లుగా విశ్వరూపము, బాహ్య లక్షణం ఈ అతిగొప్ప విశ్వము యొక్క వ్యక్తీకరణం. ఇది కృష్ణుడి యొక్క బాహ్య శరీరం. వీటిని శ్రీమద్-భాగవతములో వివరించారు. కొండలు, పర్వతాలు, అవి ఎముకలుగా వర్ణించబడ్డాయి. మన శరీరంలో ఎముకలు ద్వారా కొన్ని భాగములు పెరిగిన్నట్లుగా, అదేవిధముగా ఈ గొప్ప, గొప్ప పర్వతాలు కొండలు, అవి ఎముకలుగా వర్ణించబడ్డాయి. గొప్ప, గొప్ప మహా సముద్రాలు అవి శరీరంలో వివిధ రంధ్రాలుగా వర్ణించబడ్డాయి, క్రింద మరియు పైన. అదేవిధముగా బ్రహ్మలోకము పుర్రె, పైన పుర్రె.

కాబట్టి భగవంతుణ్ణి చూడలేనివాడు, వారు చాలా విధాలుగా భగవంతుణ్ణి చూడాలని సూచించబడ్డారు. ఇవి వేదముల సాహిత్యంలో ఉపదేశములు. మీరు కేవలం భగవంతుడిని సులభముగా గ్రహించవచ్చు, గొప్పవాడు... ఆయన గొప్పతనం... ఆయన ఎంత గొప్పవాడో కూడా మీకు తెలియదు. మీ భావనలో గొప్పతనము అంటే... చాలా పెద్ద పర్వతాలు, ఆకాశం, గొప్ప, గొప్ప లోకము వలె. వివరణ ఉంది. మీరు ఆలోచించవచ్చు. అది కూడా కృష్ణ చైతన్యము. మీరు అలా అనుకుంటే, "ఈ పర్వతం కృష్ణుడి యొక్క ఎముక," అది కూడా కృష్ణ చైతన్యమే. ఇది వాస్తవము. ఈ గొప్ప పసిఫిక్ మహా సముద్రం కృష్ణుడి నాభి అని మీరు అనుకుంటే. ఈ గొప్ప, గొప్ప చెట్లు, మొక్కలు, అవి కృష్ణుడి శరీరంలో వెంట్రుకలు. అప్పుడు తల, కృష్ణుడి పుర్రె, బ్రహ్మలోకము. అరికాలు పాతాళలోకాము. అదేవిధముగా... ఇది మహాతో మహియాన్. కృష్ణుడిని గొప్ప వారిలో గొప్ప వానిగా భావించినప్పుడు, మీరు ఇలా అనుకోవచ్చు. మీరు కృష్ణుడిని ఇలాగా కూడా అనుకొంటే, అతి చిన్నవాని కంటే చిన్నవాడు. ఇది కూడా గొప్పతనం. ఇది కూడా గొప్పతనం. కృష్ణుడు ఈ అతిగొప్ప విశ్వము యొక్క వ్యక్తీకరణం తయారు చేయగలడు, ఆయన పాయింట్ కంటే చిన్న చిన్న కీటకాలు కూడా తయారు చేయగలడు.

మీరు కొన్నిసార్లు ఒక పురుగు పుస్తకంలో వెళ్తూ ఉండటము మీరు చూశారు. పుల్ స్టాప్ కంటే దాని ఆకారం తక్కువగా ఉంటుంది. ఇది కృష్ణుడి నైపుణ్యం. Aṇor aṇīyān mahato mahīyān. ఆయన అతిగొప్ప దాని కంటే గొప్ప వాటిని చిన్నవాటి కంటే చిన్నవాటిని సృష్టించగలడు. ఇప్పుడు మానవుడు వారి భావన ప్రకారం, వారు చాలా గొప్పదిగా భావించే, 747 విమానం తయారు చేశారు. అయితే సరే. మీ చైతన్యము ప్రకారం, మీరు ఏదో గొప్ప దానిని ఉత్పత్తి చేశారు. కానీ మీరు పురుగుల వలె ఎగురుతూ ఉన్న చిన్న విమానం తయారు చేయగలరా? అది సాధ్యం కాదు. కాబట్టి గొప్పతనము అంటే అర్థం ఎవరైతే గొప్పవాని కంటే గొప్పవారు కాగలరో, మరియు చిన్నదాని కంటే చిన్నవాడిగా అవ్వగలరో. అది గొప్పతనం.