TE/Prabhupada 0044 - సేవ అనగా గురువు ఆజ్ఞను పాటించడం

Revision as of 10:47, 16 April 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0044 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 4.1 -- Montreal, August 24, 1968

అంటే, అతను శ్రీకృష్ణ పరమాత్మ నిర్దేశించిన మార్గంలోనే పయననిస్తున్నాడన్నమాట. అతను శ్రీకృష్ణ పరమాత్మునికి శతృవైనను అన్యధా భావించడు. ఇదే అతని ముఖ్య ఉద్దేశ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకవేళ " నువ్వు నాకు శత్రువుగా ఉండు" అంటే, నేను అతనికి శతృవవుతాను. ఇదే భక్తీ యోగం. అవును, నేను శ్రీకృష్ణ పరమాత్ముడిని తృప్తిపరచాలి. ఎలాగైతే యజమాని తన సేవకుడిని "నీవు ఇక్కడ నన్ను కొట్టుము", అని ఆదేశించగా , సేవకుడు తన యజమానిని తన ఆదేశానుసారం కొట్టును, అదే అతని సేవ. అది చూసి కొందరు , " అరె!! ఆ సేవకుడు తన యజమానిని కొడుతున్నాడు మరియు ఆ సేవకుడు నేను నా యజమానికి సేవచేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కాని అతడు తన యజమానిని కొడుతున్నాడే !!?? " అని అనుకుంటారు. కాని ఆ యజమానే తన సేవకుడు తనని కొట్టాలని కోరుకుంటున్నాడు. ఏది ఏమైనప్పటికినీ నీవు నీ యజమాని ఆదేశాన్ని పాటించాలి అదే అసలైన సేవకు అర్థం. ఏది ఏమైనప్పటికినీ!! దీనికి ఒక చక్కని ఉదాహరణ , శ్రీ చైతన్య మహాప్రభు జీవితంలో తనకి మరియు తన ఒక శిష్యుడైన గోవిన్డుడికి మధ్య జరిగిన ఒకానొక సంఘటన. గోవిందుడు ఎల్లప్పుడూ, శ్రీ చైతన్య మహాప్రభు ప్రసాదం తీసున్న పిదపనే (తరువాతనే), ఆతను తన ప్రసాదాన్ని తీసుకునేవాడు. ఒక రోజు శ్రీ చైతన్య మహాప్రభు తన ప్రసాదం స్వీకరించిన తరువాత, గడప దగ్గర కొద్దిగా విశ్రమించెను. గడప దగ్గర ?? అనగా మార్గ మధ్యంలో గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి వచ్చాడు. గోవిందుడు ప్రతి రోజు మహా ప్రభువు విశ్రమించిన పిదప , తన పదాలని మర్దన చేసేవాడు. అందుకే గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి ప్రవేశించి ప్రభువు పాదాలని మర్దన చేయసాగెను. అరగంట తరువాత, మహాప్రభువు నిద్ర లేచెను. లేవగానే గోవిందుడిని చూసి, "నీవు ఇంకా ప్రసాదము స్వీకరించాలేదా?" అని అడిగెను. "లేదు మహాప్రభు, ఇంకా తీసుకోలేదు" , "ఎందుకు ???" అని మహాప్రభువు అడుగగా, "మీరు మార్గ మధ్యలో పడుకున్నారు, నేను మిమ్ములను దాటి లోనికి రాలేను" అని గోవిందుడు బదులిచ్చాడు. "అలాగైతే మరి నీవెట్లా లోనికి వచ్చావు ?". "నేను దాటి లోనికి వచ్చాను". "ఎలా నన్ను దాటి లోనికి వచ్చావు, తిరిగి మళ్లి ఎందుకు దాటకూడదు??" "నేను మీకు సేవ చేయడానికి మాత్రమె ఇలా మిమ్ములను దాటి వచ్చాను. కాని నేను ప్రసాదం స్వీకరించుట కొరకు మిమ్ములను దాటలేను". ఇలా చేయడం నా సేవా ధర్మం కాదు, మీ సేవ చేయడమే నా కర్తవ్యం. కనుక, శ్రీకృష్ణుడి ఆనందం కొరకు, నీవు అతనికి విరోధిగా కాని, మితృడిగా కాని, మరి ఇంకేదైనా కాని అవ్వొచ్చు. ఇదే భక్తి యోగం. ఎందుకంటే , నీ లక్ష్యం ఎల్లప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మున్ని ఆనందపరచడం. ఎప్పుడైతే నీవు నీ ఇంద్రియ సుఖాలకై పరితపిస్తావో, అప్పుడు నీవు వెంటనే ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తావు. కృష్ణ బహిర్ముఖానుభోగ వాంఛాకారే నికటాస్థ మాయాతారే జాపత్యాదారే (ప్రేమ వివర్త ) ఎప్పుడైతే మనం శ్రీకృష్ణున్ని మరచి, మన భౌతిక ఇంద్రియ సుఖాలకై పరిగెడుతామ, దీనినే "మాయా" అని అంటారు. ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియ సుఖాలను విడిచిపెడతామో మరియు మన ప్రతి కార్యము శ్రీకృష్ణ పరమాత్మ ఆనందానికై చేస్తామో, అదియే విముక్తి.