TE/Prabhupada 0072 - సేవకుని ధర్మము శరణాగతి పొందుట

Revision as of 18:30, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on CC Madhya-lila 20.108-109 -- New York, July 15, 1976


కాబట్టి ఎవరూ యజమాని కాలేరు. అది సాధ్యం కాదు. మీరు ఈ క్రింది ప్రకటనలో దానిని చూస్తారు: ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సబ భృత్య ( CC Adi 5.142) కృష్ణుడు మాత్రమే యజమాని, ప్రతి ఒక్కరూ సేవకులు. ఇది మన పరిస్థితి, వాస్తవమైనది. కానీ కృత్రిమంగా మనము యజమాని కావాలని ప్రయత్నిస్తున్నాము. ఇది జీవనము కోసం పోరాటం. మనము కానీ దాని కోసం మనము ప్రయత్నిస్తున్నాము. ఈ పదం మనకు తెలుసు, "జీవనము కోసం పోరాటం," "బలమైన వాటి యొక్క మనుగడ." కాబట్టి ఇది పోరాటం. మనము యజమాని కాదు; ఇప్పటికీ, మనము యజమాని అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. మాయావాదా తత్వము, వారు కూడా తీవ్రముగా తపస్సు చేస్తారు కానీ ఆలోచన ఏమిటి? ఆలోచన ఏమిటంటే "నేను భగవంతునితో ఒకటిగా అవుతాను." అదే తప్పు. అదే తప్పు. ఆయన భగవంతుడు కాదు, కానీ ఆయన భగవంతుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన చాలా తీవ్రముగా తపస్సులను చేసినప్పటికీ, వైరాగ్యం ప్రతిదీ... కొన్నిసార్లు వారు భౌతిక ఆనందములను అన్నిటినీ విడిచిపెట్టి, అడవికి వెళ్లి, తీవ్రముగా తపస్సు చేస్తారు. ఆలోచన ఏమిటి? "ఇప్పుడు నేను భగవంతుడుతో సమానము అవుతాను." అదే తప్పు.

మాయ చాలా బలంగా ఉన్నది, అందువలన మనము ఆధ్యాత్మికము అని పిలుచుకునే దాంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికి ఈ లోపాలు కొనసాగుతాయి. అందుకే చైతన్య మహాప్రభు అయిన సూచనలతో వెంటనే ముఖ్య విషయమును చెప్తారు. ఇది చైతన్య మహాప్రభు తత్వము కృష్ణుడు భగవద్గీతలో చివ్వరిగా సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకమ్ శరణం వ్రజ ( BG 18.66) కృష్ణుడు తాను భగవంతుడు అని తన స్థానమును తెలియచేస్తునాడు కృష్ణుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు మూర్ఖుడివి, అంతా విడిచిపెట్టి, నాకు శరణాగతి పొందండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు." భగవద్గీతలో శ్రీకృష్ణుడి చివరి ఉపదేశము ఇది చైతన్య మహాప్రభువే, కృష్ణుడు, కానీ కృష్ణుడి భక్తుడుగా వుంటూ అందువలన ఆయన కృష్ణుడు చెప్పిన విషయమే చెప్తూ, "మీరు శరణాగతి పొందండి," చైతన్య మహాప్రభు చెప్తారు "ప్రతి జీవుడు కృష్ణుడి యొక్క సేవకుడు" అని చెప్పారు. అంటే ఆయన శరణాగతి పొందాలి. సేవకుడు యొక్క ధర్మము శరణు తీసుకోవటము. యజమానితో వాదించకూడదు "నేను మీతో సమానంగా ఉన్నాను" అని వాదించకూడదు. ఇది అంతా మూఢభక్తి, పిచ్చి ప్రతిపాదన.

పిశాచి పాయిలే యేన మతిచ్ఛన్న హయ
మాయా-గ్రస్త జీవేర సే దాస ఉపజయ

దాసుడు యజమాని కాలేడు. అది సాధ్యం కాదు. ఎప్పుడైతే ఎంతకాలము జీవితములో మనము ఈ తప్పుడు భావనలో ఉంటామో, నేను సేవకుడిని కాదు, నేను యజమానిని అప్పుడు ఆయన దుఃఖిస్తాడు. మాయ ఆయనకి బాధ ఇస్తుంది. దైవీహ్యేషా. నేరస్థులు, ద్రోహులు దొంగల వలె వారు ప్రభుత్వ ఉత్తర్వును తిరస్కరిస్తారు: "నేను ప్రభుత్వం గురించి పట్టించుకోను." కానీ దాని అర్థము ఏమిటంటే ఆయన స్వచ్ఛందంగా బాధను అంగీకరించారు. ఇది ప్రభుత్వ చట్టాలను గౌరవించాలని. ఆయన సామాన్యంగా శ్రద్ధ తీసుకోకపోతే, అతడిని జైలులో ఉంచుతారు శక్తి ద్వారా, కొట్టడము ద్వారా, శిక్ష ద్వారా, ఆయన అంగీకరించాలి: "అవును, అవును, నేను అంగీకరిస్తున్నాను."

కాబట్టి ఇది మాయ. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ( BG 7.14) మనము మాయ యొక్క అధికారము క్రింద ఉన్నాము. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వషః ( BG 3.27) ఎందుకు? మనము యజమానిగా ప్రకటించుకుంటున్నాము. సేవకుడు యజమానిగా ప్రకటించుకుంటున్నాడు. కాబట్టి బాధ. సాధ్యమైనంత త్వరలో మనము ఒప్పుకుంటే "నేను యజమాని కాదు, నేను సేవకునిగా ఉంటాను" అప్పుడు బాధ ఉండదు చాలా సాధారణ తత్వము. అది ముక్తి. ముక్తి అంటే కేవలం సరైన స్థితిపైకి రావడము. అది ముక్తి. ముక్తిని శ్రీమద్-భాగవతములో నిర్వచించారు. ముక్తిర్ హిత్వాఽన్యథా రూప స్వరూపేణ అవస్థితః. ( SB 2.10.6) ముక్తి అంటే ఈ అర్థంలేని పద్ధతులను విడిచిపెట్టడము అన్యథా ఆయన సేవకుడు, కానీ ఆయన యజమాని అని ఆలోచిస్తున్నాడు. ఇది పూర్తి వ్యతిరేకము అందువలన ఆయన జీవితము యొక్క ఈ వ్యతిరేక భావనను వదలివేసినప్పుడు, అప్పుడు అది ముక్తి అవుతుంది. ఆయన వెంటనే విముక్తి పొందుతాడు. మీరు తీవ్రముగా తప్పసులను చేయవలసిన అవసరం లేదు. ముక్తి ఎక్కువ సమయం తీసుకోదు అరణ్యంలోనికి వెళ్లి హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి ముక్కు అనేక విషయాలను అణచిపెట్టుకోవలసిన అవసరము లేదు దీనికి చాలా విషయాలు అవసరం లేదు. కేవలం మీరు సాధారణమైన విషయమును అర్థం చేసుకోండి నేను కృష్ణుడి యొక్క సేవకుడుని - మీరు తక్షణమే ముక్తి పొందారు. ఇది శ్రీమద్-భాగవతంలో ముక్తికి ఇవ్వబడిన నిర్వచనం. ముక్తిర్ హిత్వాఽన్యథా రూప స్వరూపేణ అవస్థితః. జైలులో వుండే ఒక నేరస్తుడు వలె, ఆయన విధేయతతో వుండి. ఇప్పుడు, నేను చట్టాన్ని గౌరవిస్తాను అని పాటిస్తూ వుంటే నేను విధేయతతో ప్రభుత్వం చట్టాలకు కట్టుబడి ఉంటాను " అని ఆయన హామీ ఇవ్వడం వలన ఆయనని ముందే విడుదల చేస్తారు. కాబట్టి మనము ఈ భౌతిక జీవనపు జైలు నుండి వెంటనే విడుదల అవ్వవచ్చు మనము చైతన్య మహా ప్రభు యొక్క ఈ ఉపదేశమును అంగీకరించినట్లయితే, జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్య దాస ( CC 20.108-109)