TE/Prabhupada 0073 - వైకుంఠ అంటే చింతన లేదు అని అర్థం

Revision as of 10:28, 11 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0073 - in all Languages Category:TE-Quotes - 1967 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 10.2-3 -- New York, January 1, 1967

ఈ సాంగత్యములోనే మీరు దీన్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ కళను నేర్చుకోవచ్చు, మరియు మీరు దాన్ని మీ ఇంటిలో ప్రయత్నము చేయవచ్చును మీరు మీ ఇంటి వద్ద మంచి ఆహారము, సిద్ధం చేయవచ్చు, కృష్ణుడికి ఆరగింపు చేయవచ్చును. ఇది కష్టం కాదు. మనము కృష్ణుడికి ప్రతి రోజు ఆహారము సిద్ధం చేసి, మంత్రము చదివి ఆరగింపు చేస్తాము


namo brahmaṇya-devāya
go-brāhmaṇa-hitāya ca
jagad-dhitāya kṛṣṇāya
govindāya namo namaḥ

అంతే. ఇది కష్టం కాదు. ప్రతి ఒక్కరూ ఆహారాన్ని సిద్ధం చేసి, కృష్ణుడికి అర్పించి దానిని తీసుకొనవలెను, ఆపై కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మీరు కూర్చోవచ్చు మరియు కృష్ణుని చిత్రం ముందు శ్లోకం చదువుతూ,

Hare Kṛṣṇa Hare Kṛṣṇa Kṛṣṇa Kṛṣṇa Hare Hare
Hare Rāma Hare Rāma Rāma Rāma Hare Hare

మరియు ఒక స్వచ్ఛమైన జీవనం కలిగివుండండి. ఫలితాన్ని చూడవచ్చును. ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి, కృష్ణుడిని అర్థం చేసుకోనే ఈ సిద్ధాంతాన్ని తీసుకుంటే, అది అవుతుంది ... మొత్తం ప్రపంచం వైకుంఠ అవుతుంది. వైకుంఠ అంటే చింతన లేదు అని అర్థం. వైకుంఠ. వాయ్ అంటే లేకుండా, మరియు కుంఠ అంటే ఆందోళన. ఈ ప్రపంచం ఆందోళనతో నిండి ఉంది samudvigna dhiyam-అసద్-grahāt (SB 7.5.5). మనము ఈ తాత్కాలిక భౌతిక జీవితమును అంగీకరించాము కనుక అందువల్ల మనము ఎల్లప్పుడూ ఆందోళనతో నిండిపోయి వున్నాము. ఆధ్యాత్మిక ప్రపంచంము, దీనికి పూర్తిగా వ్యతిరేకముగా ఉంది, అక్కడ గ్రహాలను వైకుంఠ అని పిలుస్తారు. వైకుంఠ అంటే ఆందోళన లేకుండా. మనము ఆందోళనల నుండి విముక్తి పొందాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఆందోళనల నుండి స్వతంత్రాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, అయితే ఈ ఆందోళనల నుoడి ఎలా బయటపడాలో అతనికి తెలియదు. మత్తును ఆశ్రయం తీసుకోవడం అనేది ఆందోళనలు నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడదు. ఇది ఒక వ్యసనం ఉంది. మతిమరపు ఉంటుంది. కొన్నిసార్లు మనము ప్రతిదీ మర్చిపోతాము, కానీ మీరు చైతన్యములోనికి వచ్చినప్పుడు మళ్ళీ అవే ఆందోళనలు మరియు అదే విషయం ఉన్నది కాబట్టి ఇది మీకు సహాకరించదు. మీరు ఆందోళనల నుండి విముక్తి పొందాలని కోరుకుంటే మరియు మీరు నిజంగానే కావాలనుకుంటే ఆనందం మరియు జ్ఞానం తో కూడిన శాశ్వతమైన జీవితం, అప్పుడు ఇది పద్ధతి ఇది పద్ధతి. మీరు కృష్ణుని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. na me viduḥ sura-gaṇāḥ (BG 10.2). ఎవరికి అర్థం కాను. కానీ ఒక మార్గం ఉంది. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ (Brs. 1.2.234). ఇది ఒక పద్ధతి. శ్రీమద్-భాగావతం లో అనేక సందర్భాలలో ఈ పద్ధతిని వేరువేరు విధాలుగా వివరించారు. ఒకే చోట, ఇలా పేర్కొన్నారు.

jñāne prayāsam udapāsya namanta eva
jīvanti san-mukharitāṁ bhavadīya-vārtām
sthāne sthitāḥ śruti-gatāṁ tanu-vāṅ-manobhir
ye prāyaśo 'jita jito 'py asi tais tri-lokyām
(SB 10.14.3)

ఇది చాలా అందమైన శ్లోకము. అజిత, ఎవరికీ తెలియదు. దేవునికి మరో పేరు అజిత. అజిత అంటే ఎవరూ జయించలేరు. ఎవరూ ఆయనను చేరుకోలేరు. అందువలన అయిన పేరు అజిత. కావున జయింపబడనివాడు జయింపబడతాడు. Ajita jito 'py asi. దేవుని గురించి మనకు పూర్తిగా తెలియనప్పటికీ, భగవంతుడు జయింప శక్యము కానీ వాడు అయినప్పటికీ, అయినను జయించారు. ఎలా? Sthāne sthitāḥ.