TE/Prabhupada 0577 - తత్వవేత్తలు శాస్త్రవేత్తలు అని పిలవబడేవారు అందరు అందువల్ల వారు పిచ్చి వారు మూర్ఖులు

Revision as of 02:38, 23 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0577 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.19 -- London, August 25, 1973


కృష్ణుడు sac-cid-ānanda-vigrahaḥ (Bs. 5.1) వలె, ఆయన రూపము, ఆధ్యాత్మిక రూపము, పూర్తి జ్ఞానము కలిగినది, శాశ్వతమైన రూపం, పూర్తిగా ఆనందము కలిగినది, అదేవిధముగా మనము కూడా, కణము అయినప్పటికీ , అదే లక్షణము. అందువలన అది చెప్పబడింది, న జాయతే. ఈ సమస్య, ఈ మూర్ఖపు నాగరికత, వారు అర్థము చేసుకోలేరు - నేను శాశ్వతమైన వాడిని అని, నేను జన్మ మరియు మరణం యొక్క ఈ స్థితిలో ఉన్నాను. ఏ మూర్ఖుడు అర్థము చేసుకోడు. తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, అని పిలవబడేవారు, అందరు అందువల్ల వారు పిచ్చి వారు, మూర్ఖులు. వారిని తిరస్కరించండి. వెంటనే వారిని తిరస్కరించండి. ఆ కష్టపడి కృషి చేయడము. ఇదే: nūnaṁ pramattaḥ kurute vikarma ( SB 5.5.4) పిచ్చివాడు పనిచేస్తున్నట్లుగానే. పిచ్చివాడి పని యొక్క విలువ ఏమిటి? ఆయన పగలు రాత్రి తీరిక లేకుండా ఉంటే, నేను చాలా తీరిక లేకుండా ఉన్నాను. కావున మీరు ఏమిటి అయ్యా? మీరు పిచ్చివారు. మీ మెదడుకు పగులు ఏర్పడినది, వెర్రి. మీ పని యొక్క విలువ ఏమిటి? కానీ ఇది జరగుతుంది

కాబట్టి కృష్ణ చైతన్యము, మీరు ఊహించుకోండి ఎంత ముఖ్యమైన ఉద్యమమో ఇది అని. ఇది మానవ సమాజంలో ఉత్తమ సంక్షేమ కార్యక్రమాలు. వారు అందరు దుష్టులు మరియు మూర్ఖులు, వారికి వారి స్వరూప పరిస్థితి తెలియదు, వారికి జ్ఞానము లేదు, వారు అనవసరంగా కష్టపడి పగలు రాత్రి పని చేస్తున్నారు. అందువల్ల వారిని మూఢ అని అన్నారు. మూఢ అంటే గాడిద. గాడిద చిన్న గడ్డి కోసం చాకలి వానికి పగలు రాత్రి పని చేస్తుంది. గడ్డి ప్రతిచోటా అందుబాటులో ఉంది, కానీ ఆయన, ఇప్పటికీ, ఆయన అనుకుంటాడు "నేను చాకలి వానికి పని చేయకపోతే, చాలా కష్టము, నేను ఈ గడ్డిని పొందలేను. "దీనిని గాడిద అంటారు. అందువల్ల జ్ఞానం పెంపొందించుకున్న తరువాత , ఒకరు మేధస్సును పొందుతారు.. ఒకరు క్రమముగా తెలివైన వారు అవుతారు. మొట్ట మొదట బ్రహ్మచారి. తరువాత, ఒకరు బ్రహ్మచారిగా ఉండలేకుంటే, సరే, ఒక భార్యను చేపట్టండి, గృహస్త . తరువాత విడచిపెట్టండి వానప్రస్త. తరువాత సన్యాసము తీసుకోండి. ఇది పద్ధతి. mūḍha, వారు పగలు మరియు రాత్రి పని చేస్తారు ఇంద్రియాల తృప్తి కోసము. అందువల్ల, ఒక నిర్దిష్ట కాలం నాటికి, ఆ మూర్ఖత్వమును వదలివేయాలి మరియు సన్యాసమును తీసుకోవాలి. లేదు, పూర్తయింది. అది సన్యాసము. ఇప్పుడు జీవితం యొక్క ఈ భాగం పూర్తిగా కృష్ణుడి సేవ కోసం ఉండాలి. అది వాస్తవమైన సన్యాస. Anāśritaḥ karma-phalaṁ kāryaṁ karma karoti yaḥ ( BG 6.1) కృష్ణుడిని సేవించాలనేది నా బాధ్యత, నేను నిత్య సేవకుడుని... కార్యం. నేను చేయాలి, నేను కృష్ణుడికి తప్పక సేవ చేయాలి. ఇది నా పరిస్థితి. అది సన్యాసము. Anāśritaḥ karma-phalaṁ kāryam karma karoti yaḥ. కర్మిలు, వారు ఇంద్రియ తృప్తి కోసం కొన్ని మంచి ఫలితాలను ఆశిస్తున్నారు. అది కర్మ. సన్యాసము అంటే... వారు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, కానీ ఇంద్రియ తృప్తి కోసం కాదు. కృష్ణుడి సంతృప్తి కోసం. అది సన్యాసము. ఇది సన్యాసము మరియు కర్మి. కర్మి కూడా చాలా కష్టపడతాడు, మరింత కష్టపడతాడు, మరింత మరింత కష్టపడతాడు, కానీ ఇదంతా āmiṣa-mada-sevā కోసము āmiṣa-mada-sevā. Vyavāya, కేవలము మైథునజీవితం కోసం మాత్రమే, మాంసం తినడము, మత్తు. అలాగే భక్తుడు అదే విధముగా కష్టపడి పనిచేస్తాడు, కానీ కృష్ణుడి సంతృప్తి కొరకు. ఈ తేడా ఉంది. ఒకవేళ మీరు ఒక జీవితాన్ని అంకితం చేస్తే, కేవలం కృష్ణుని కోసం, ఇంద్రియ తృప్తి ఇక ఏ మాత్రము వద్దు, అప్పుడు మీరు ఈ స్థానానికి వస్తారు, na jāyate, ఇక మరణం, ఇక జన్మ ఉండదు. మీ పరిస్థితి na jāyate na... ఎందుకంటే... ఇది మీ వాస్తవమైన పరిస్థితి. కానీ మీరు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి, pramattaḥ, మీరు పిచ్చివారు అయినారు, మీరు వెర్రి వారు అయినారు; అందువల్ల మీరు ఈ ఇంద్రియ తృప్తి పద్దతిని తీసుకున్నారు. కాబట్టి మీరు ఒక భౌతిక శరీరం లో చిక్కుకున్నారు, శరీరం మారుతుంది. దానిని జన్మ మరియు మరణం అని పిలుస్తారు