TE/Prabhupada 0729 - ఒక సన్యాసి ఏదైనా చిన్న అపరాధమును చేస్తే అది వెయ్యి రెట్లు పెద్దదిగా చూపెట్టబడుతుంది

Revision as of 10:26, 6 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0729 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Ar...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Address -- London, March 8, 1975


ప్రభుపాద: భక్తివినోద ఠాకురా పాడారు, jay sakal bipod... (ప్రక్కన:) ఇది ఇప్పుడు జరుగుతోంది.

samāśritā ye pada-pallava-plavaṁ
mahat-padaṁ puṇya-yaśo murāreḥ
bhavāmbudhir vatsa-padaṁ paraṁ padaṁ
padaṁ padaṁ yad vipadāṁ na teṣām
(SB 10.14.58)

చైతన్య మహా ప్రభు యొక్క ఉపదేశము ప్రతి ఒక్కరిని హరే కృష్ణ లేదా రాధా-కృష్ణ కీర్తన చేయమని అభ్యర్ధించడము. కాబట్టి భక్తివినోద ఠాకురా చెప్తారు, "హరే కృష్ణ మంత్రమును మనం కీర్తన చేసేటప్పుడు, అప్పుడు అన్ని ప్రమాదాలు పోతాయి." కావున ఈ ప్రదేశము, ఈ భౌతిక ప్రపంచం, ఒక ప్రమాదకరమైన ప్రదేశం. పదం పదం యద్ విపదామ్. విపద అనగా ప్రమాదం, పదం పదం అంటే ప్రతి అడుగు. భౌతిక ప్రపంచంలో మీరు చాలా మృదువైన, ప్రశాంతమైన జీవితాన్ని ఆశించలేరు. అది సాధ్యం కాదు. పరిహారము కేవలము కమల పాదముల... ఆశ్రయం తీసుకోవడము మాత్రమే ఉంది... కేవలం మురారి. మురారి అంటే కృష్ణుడు. samāśritā ye pada-pallava-plavaṁ mahat-padaṁ puṇya-yaśo murāreḥ bhavāmbudhir vatsa-padaṁ paraṁ padaṁ padaṁ padaṁ yad vipadāṁ na teṣām ( SB 10.14.58) ఎల్లప్పుడూ ఉంది... మీరు చాలా మంచి పడవలో ఉంటే, అయినప్పటికీ, మీరు నీటిలో ఉన్నారు కనుక మీరు పడవ ఎప్పుడూ మృదువైనది ఏ ఇబ్బంది లేకుండా ఉంది అని అనుకోవడానికి లేదు. కాబట్టి భౌతిక ప్రపంచం ఎల్లప్పుడూ ఇబ్బందులతో నిండి ఉంది. కాబట్టి మనము ప్రామాణికమైన స్థితిలో ఉన్నట్లయితే, క్రమము తప్పకుండా హరే కృష్ణని కీర్తన చేస్తే, అప్పుడు ప్రమాదాలు ఆగిపోతాయి. ప్రమాదాలు, అవి శాశ్వతము కాదు. అవి కాలానుగుణ మార్పులలాగే వచ్చి పోతుంటాయి. కొన్నిసార్లు చాలా వేడిగా ఉంటుంది; కొన్నిసార్లు చాలా చల్లగా ఉంటుంది. అందువల్ల కృష్ణుడు సలహా ఇచ్చాడు āgamāpāyino 'nityās tāṁs titikṣasva bhārata ( BG 2.14) కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన, జపము చేయడము నుండి దృష్టిని మళ్ళించవద్దు, కొంత ప్రమాదం ఉంది ఎందుకంటే ప్రమాదం ఉంది కనుక (అస్పష్టముగా ఉంది) కృష్ణుడి యొక్క కమల పాదముల ఆశ్రయం తీసుకోండి, హరే కృష్ణ కీర్తన చేయండి , ప్రమాదాలు ఆగిపోతాయి.

కానీ అలాంటి స్థితిని సృష్టించకూడదు ప్రమాదకరమైనది. ఇది ఇప్పటికే ప్రమాదకరమైనది. ఎందుకంటే చైతన్య మహా ప్రభు ఆధ్యాత్మిక జీవితం గురించి చాలా జాగ్రత్తగా ఉండే వారు. Sannyāsīra alpa chidra bāhu kori mane. ఇతరులు చట్టాలు ఉల్లంఘించవచ్చు, వారు చాలా పాపపు కార్యక్రమాలను చేస్తుంటారు, కానీ ఎవరూ చాలా జాగ్రత్త తీసుకోరు కానీ ఒక మత సమూహం లేదా ఒక సన్యాసి ఏదైనా చిన్న అపరాధమును చేస్తే అది వెయ్యి రెట్లు పెద్దదిగా చూపెట్టబడుతుంది అందువలన మనం ఏమీ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అది ప్రజల కళ్ళకు పెద్దదిగా కనబడవచ్చు. మనము ప్రచారము చేస్తున్నాము కనుక. మనము ప్రచారము చేస్తున్నాము, రాక్షసుల పక్షము ఎప్పుడూ ఉంటుంది ఎవరైతే మనల్ని ఇబ్బందిలో పెడతారో. అది సహజమైనది. హిరణ్యకశిపుడు కూడా, ప్రహ్లాద మహా రాజు యొక్క తండ్రి అయినందున, ప్రహ్లాద మహా రాజును కూడా ఇబ్బంది పెట్టినాడు. మనము నిజాయితీగా ఉండి, కీర్తన, జపము చేయడము కొనసాగిస్తే, ఈ ప్రమాదాలు ఆగిపోతాయి. భయపడవద్దు. మీ రోజు వారి నియమ నిబంధనలను మరియు కార్యక్రమాలను ఆపవద్దు. దానితో కొనసాగండి. కృష్ణుడి మీద ఆధారపడండి, క్రమంగా ప్రతిదీ సరిగ్గా ఉంటుంది.

నేను భావిస్తున్నాను, మనం ఈ రోజుకు, ఇంతటితో ఆపుదాము. ఇప్పుడు సమయం ముగిసింది. అర్చాముర్తులకు విశ్రాంతి ఇవ్వాలి. మనము అలా ఉంచకూడదు. పర్వాలేదు.

హరే కృష్ణ. భక్తులు: జయ ప్రభుపాద