TE/Prabhupada 0776 - నేను కుక్కగా మారితే తప్పు ఏమిటి . ఇది విద్య యొక్క ఫలితం

Revision as of 05:34, 20 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0776 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.12 -- Los Angeles, June 25, 1975


అందువల్ల అది సిఫార్సు చేయబడింది అది adhayo vyādhayaḥ. మూడు రకాల బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి -ఒక నిర్దిష్టమైన వ్యక్తికి కాదు. Adhyātmika, adhibhautika, adhidaivika. మీరు ఈ భౌతిక శరీరాన్ని పొందిన వెంటనే, మీరు బాధపడతారు. కాబట్టి మీరు ఈ బాధను ఆపాలని కోరుకుంటే, మీరు క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి. తరువాతి శ్లోకములో క్రమబద్ధమైన జీవితము సిఫార్సు చేయబడింది:

tapasā brahmacaryeṇa
śamena ca damena ca
tyāgena satya-śaucābhyaṁ
yamena niyamena vā
(SB 6.1.13)

ఇవి మానవులకు నిర్దేసించిన విధులుగా సూచించబడ్డాయి. నిర్దేసించిన విధులు అనగా ఏమిటి? మొట్టమొదట ఇవ్వబడిన కర్తవ్యము తపసా: వారు తపస్సులను ఆచరించాలి. ఇది మానవ జీవితం. ప్రతిచోటా సిఫార్సు చేయబడింది. ఋషభదేవుడు సిఫార్సు చేసినాడు tapo divyaṁ putrakā yena śuddhyed sattva: నా ప్రియమైన అబ్బాయిలు, పిల్లులు మరియు కుక్కలు మరియు పందులు వలె జీవించ వద్దు, ఆయన సలహా ఇచ్చాడు. Nāyaṁ deho deha-bhājāṁ nṛloke kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye ( SB 5.5.1) నేను కష్టపడకపోతే, నా ఇంద్రియాలను ఎలా సంతృప్తి పరుచుకుంటాను? రాత్రి పూట నేను ఈ మత్తును కలిగి ఉండాలి, ఈ స్త్రీ, ఈ క్లబ్, ఈ... నేను తీవ్రంగా పని చేయకపోతే, నేను ఈ ఆనందాన్ని ఎలా పొందాలి? "

కాబట్టి ఋషభదేవుడు ఇలా అంటున్నాడు, "ఈ రకమైన ఆనందం పందులకు కూడా అందుబాటులో ఉంది. ఇది మంచి ఆనందము కాదు, ఇంద్రియ తృప్తి" Nāyaṁ deho deha-bhājāṁ nṛloke kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye. Viḍ-bhujām అంటే మలం తినేవాడు. కాబట్టి వారు మలం తినడం ద్వారా వారు ఆనందించేవారు, ఏ వివక్ష లేకుండా మైథున సుఖము కలిగి ఉండే వారు, తల్లి, సోదరి కోసం పట్టించుకోరు. అందువల్ల నాగరికత యొక్క ఈ రకమైన ఇంద్రియ నాగరికత కుక్కలు పందులు, కానీ మానవ జీవితం దాని కోసం కాదు. మానవ జీవితం తపస్యా, తపస్సు కోసము ఉంది కాబట్టి మానవ జీవితం మీ జన్మ మరియు మరణం యొక్క పునారావృతిని ఆపడానికి ఉంది నీ శాశ్వత జీవితానికి రావటానికి, జ్ఞానం యొక్క ఆనందకరమైన శాశ్వత జీవితాన్ని ఆస్వాదించడానికి. అది జీవితం యొక్క లక్ష్యం. కాదు "ఎప్పుడు పట్టించు కోవద్దు." విద్య ఏమిటంటే ఒక విశ్వవిద్యాలయ విద్యార్థి, ఆయన చెప్పినట్లయితే, ఆయనకు తెలిసి ఉంటే, "మీరు బాధ్యతా రహితంగా జీవిస్తే, మీరు తదుపరి జీవితములో కుక్క కావచ్చు," అయితే వారు చెప్తారు, "నేను కుక్కగా మారితే తప్పు ఏమిటి?" (నవ్వు) ఇది విద్య యొక్క ఫలితం. ఆయన పట్టించుకోడు. ఆయన ఆలోచిస్తున్నాడు, "నేను ఒక కుక్క జీవితాన్ని పొందితే, వీధిలో నా లైంగిక జీవితమునకు ఎటువంటి నియంత్రణను కలిగి ఉండను." అంతే. ఆయన అది అభివృద్ది అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నిషేధం ఉంటే, ఇప్పుడు ఆటంకము లేకుండా వీధిలో లైంగిక జీవితం పొందితే ... వారు క్రమంగా వస్తున్నారు, ఆ పురోగతి.

కాబట్టి ఇది పరిస్థితి. కాబట్టి వారికి తరువాతి జీవితము మీద నమ్మకం లేదు, పిల్లులు కుక్కల జీవితం గురించి ఏమి మాట్లాడాలి. పర్వాలేదు. అంతా చాలా చీకటిగా ఉంది. అందువల్ల, మనము కృష్ణ చైతన్య ఉద్యమమును తీసుకోకపోతే, మానవ నాగరికత నాశనము అవుతుంది. మానవ నాగరికత కాదు. మానవ నాగరికత యొక్క బాధ్యతాయుతమైన జీవితం. వాస్తవమునకు, మనము విద్యాభ్యాసం చేస్తున్నాము, మనము పాఠశాలకు వెళ్తాము, కళాశాలకు, బాధ్యతగల వ్యక్తిగా తయారు అవ్వడానికి. కాబట్టి ఈ బాధ్యత, "ఈ పునరావృతమవుతున్న జన్మను ఆపడము ఎలా." అనేక ప్రదేశాల్లో ఈ సలహా ఇవ్వబడినది ఇది మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యం.Punar-janma-jayāya