TE/Prabhupada 0779 - దుఃఖముల కోసం ఉద్దేశించిన ప్రదేశంలో మీరు సంతోషంగా ఉండలేరు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0779 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Denver]]
[[Category:TE-Quotes - in USA, Denver]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0778 - La plus grande contribution à la société humaine est la connaissance|0778|FR/Prabhupada 0780 - On peut avoir un aperçu de la connaissance de la Vérité Absolue|0780}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0778 - మానవ సమాజానికి గొప్ప సహయము చేయడము అంటే జ్ఞానము ఇవ్వడము|0778|TE/Prabhupada 0780 - కానీ పరమ సత్యము గురించి కొంచము తెలుసుకొనవచ్చు|0780}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|LtX-HOwL1lY|దుఃఖముల కోసం ఉద్దేశించిన ప్రదేశంలో మీరు సంతోషంగా ఉండలేరు.  <br/>- Prabhupāda 0779}}
{{youtube_right|tWpSFUR8Q6o|దుఃఖముల కోసం ఉద్దేశించిన ప్రదేశంలో మీరు సంతోషంగా ఉండలేరు.  <br/>- Prabhupāda 0779}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Lecture on SB 6.1.19 -- Denver, July 2, 1975


కాబట్టి ఇది కృష్ణ చైతన్య వ్యక్తి యొక్క లాభం. కృష్ణుడు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. ఎవరైనా ఒక్కసారి మాత్రమే కృష్ణుడి గురించి ఆలోచించడానికి మరియు శరాణగతి పొందటానికి మనస్సుతో ఒక్కసారి ప్రయత్నిస్తే అప్పుడు ఆయన వెంటనే ఈ భౌతిక జీవితం యొక్క అన్ని బాధాకరమైన పరిస్థితుల నుండి రక్షించబడతాడు. కాబట్టి అది మన జీవితపు పరిపూర్ణము. ఎలాగో ఒకలాగా మనము కృష్ణుడి యొక్క కమల పాదములకు శరణాగతి పొందాము. కాబట్టి ఇక్కడ నొక్కిచెప్పడం, sakṛt. sakṛt అంటే "ఒకే ఒక్కసారి మాత్రమే." కావున కేవలం ఒకసారి కృష్ణుడి గురించి ఆలోచిస్తేనే చాలా లాభం ఉంటే, అప్పుడు మనము ఊహించవచ్చు, ఎల్లప్పుడూ నియుక్తమై ఉన్నవారు హరే కృష్ణ మంత్రాన్ని జపించటం ద్వారా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండే వారి పరిస్థితి ఏమిటి?

వారు చాలా సురక్షితం ఉంటారు, ఎంతగా అంటే అది చెప్పబడింది, na te yamaṁ pāśa-bhṛtaś ca tad-bhaṭān svapne 'pi paśyanti ( SB 6.1.19) స్వప్నా అంటే స్వప్నం, కల. కలలు కనడము తప్పు, యమదూతలు లేదా మరణం యొక్క పర్యవేక్షకుడైన యమరాజు.. యొక్క ఆజ్ఞాపాలకులు చూడడానికి, ముఖాముఖి చూస్తే... మరణం సమయంలో, ఒక పాపత్ముడు మరణిస్తున్నప్పుడు, ఆయన యమరాజు లేదా యమరాజు యొక్క ఆజ్ఞాపాలకులను చూస్తాడు. వారు చాలా భయంకరంగా ఉంటారు. కొన్నిసార్లు మరణశయ్యపై ఉన్న వ్యక్తి చాలా భయపడతారు, ఏడుస్తూ, "నన్ను రక్షించండి, నన్ను రక్షించండి." ఇది కూడా అజామిళునికి జరిగింది. ఆ కథను తర్వాత మనము తరువాత చెప్పుకుందాము. కానీ ఆయన రక్షింపబడ్డాడు. కృష్ణ చైతన్యంలో తన గత కార్యక్రమాల వలన ఆయన రక్షింపబడ్డాడు. ఆ కథ మనము తరువాత చెప్పుకుందాము.

కాబట్టి ఇది సురక్షితమైన పరిస్థితి. లేకపోతే, ఈ భౌతిక ప్రపంచం పూర్తిగా ప్రమాదములతో నిండి ఉంది. ఇది ప్రమాదకరమైన ప్రదేశం. భగవద్గీతలో, ఇది దుఃఖాలయం చెప్పబడింది. ఇది దుఃఖాల యొక్క ప్రదేశం. దుఃఖం కోసం ఉద్దేశించిన ప్రదేశంలో మీరు సంతోషంగా ఉండలేరు. అది మనము అర్థం చేసుకోవాలి. మహోన్నతమైన వ్యక్తి ,కృష్ణుడు చెప్పినది, దుఃఖాలయం అశాశ్వతం ( BG 8.15) ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం దుర్భర పరిస్థితులు ఉన్న ప్రదేశము. అంతే కాక అశాశ్వతం కూడా, శాశ్వతం కాదు. మీరు ఇక్కడే ఉండలేరు. మీరు ఒక రాజీ చేసుకున్నప్పటికీ "అయినప్పటికీ ఇది దుఃఖాలయమే. నేను సర్దుబాటు చేసుకుంటాను నేను ఇక్కడే ఉంటాను..."

ప్రజలు ఈ భౌతిక ప్రపంచంలో చాలా అనుబంధము కలిగి ఉన్నారు. ఉదాహరణకు నాకు ఆచరణాత్మక అనుభవం ఉంది. 1958 లేదా '57 లో, నేను మొదట ఈ పుస్తకం ప్రచురించినప్పుడు, ఇతర గ్రహాలకు సులభ ప్రయాణం, నేను ఒక పెద్దమనిషిని కలుసుకున్నాను. ఆయన చాలా ఉత్సాహభరితంగా ఉన్నాడు, కాబట్టి మనము ఇతర గ్రహానికి వెళ్లగలమా? మీరు అటువంటి సమాచారం ఇస్తున్నారు? "అవును." మీరు వెళ్ళితే, మీరు తిరిగి రాలేరు. లేదు, లేదు, అప్పుడే నేను వెళ్ళడానికి ఇష్టపడను. (నవ్వు) ఆయన చెప్పాడు మొత్తం ఆలోచన ఏమిటంటే మనము మరొక లోకమునకు వెళ్ళాలి, ఉదాహరణకు వారు ఆట పట్టిస్తున్నారు. వారు చంద్రుని గ్రహానికి వెళ్ళుతున్నారు. కానీ వారు అక్కడే ఉండలేకపోతున్నారు. వారు తిరిగి వస్తున్నారు. అది శాస్త్రీయ పురోగతి. మీరు అక్కడికి వెళ్ళి ఉంటే, మీరు అక్కడే ఎందుకు ఉండడం లేదు? నేను వార్తాపత్రికలో చదివాను రష్యన్ వైమానికులు వెళ్ళినప్పుడు, వారు క్రిందకు చూస్తున్నారట, మాస్కో ఎక్కడ ఉన్నదని? (నవ్వు)