TE/Prabhupada 0875 - మీరు మీకు తెలిసిన భగవంతుని నామాన్ని కీర్తించండి.అభ్యంతరం ఎక్కడవుంది

Revision as of 07:26, 19 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0875 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750519 - Lecture SB - Melbourne


మీరు మీకు తెలిసిన భగవంతుని నామాన్ని కీర్తించండి.అభ్యంతరం ఎక్కడవుంది. అయితే భగవంతుని యొక్క దివ్యనామాన్ని మాత్రం కీర్తించండి. మనo భగవంతున్ని చూడలేము. మనము చూడవచ్చును, కానీ వెంటనే కాదు. మనము పురోగమించినప్పుడు మనము భగవంతున్ని చూడగలము, ఆయనతో మాట్లాడగలం. కానీ మనము ఇప్పుడు సమర్థవoతులము కాము, కాబట్టి మనకు ఈ విషయం తెలిస్తే ఇది భగవంతుని నామము, మనము దానిని కీర్తిద్దాము. అంతే. ఇది అంత కష్టమైన పనా?ఎవరైనా ఇది చాలా కష్టమైన పని అని అంటారా? భగవంతుని నామాన్ని,దివ్య నామాన్ని కీర్తించండి. అప్పుడు ఏమి జరుగుతుంది? Ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) మీరు,ఒకవేళ మీరు భగవంతుని పవిత్ర నామమును కీర్తించినట్లయితే, అప్పుడు మీ హృదయం, ఏదైతే అద్దంతో పోల్చబడిందో ... ఎలాగైతే మీరు అద్దంలో మీ ముఖాన్ని చూస్తున్నట్లే, అదేవిధముగాా, మీరు హృదయదర్పనంలో, హృదయాంతరాలంలో మీరు మీ యొక్క స్వరూపాన్ని దర్శించగలరు. మీరు చూడగలరు. దానిని ధ్యానం అంటారు.

కాబట్టి ప్రస్తుత స్థితిలో మనహృదయం భౌతిక భావన అనే దుమ్ము చే కప్పబడి ఉంది: నేను భారతీయుడిని, "నేను అమెరికన్," " నేను ఇది," "నేను అది," "నేను అది." ఇదంతా దుమ్ము. మీరు దీన్ని శుభ్రపరచాలి. ఎలాగైతే అద్దం మీద ఒక ధూళి పొర ఉన్నట్లయితే,మీరు దాన్ని శుభ్రపరుస్తారు. అప్పుడు మీరు మీ వాస్తవమైన ముఖం చూస్తారు. కాబట్టి చైతన్య మహాప్రభు చెబుతున్నారు, ceto-darpaṇa-mārjanam: భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని జపించడం ద్వారా, మీరు క్రమంగా మీ హృదయము యొక్క అంతరాలలో వున్న దూళిని ప్రక్షాలనచేసుకోగలరు. చాలా సులభమైన పధ్ధతి. కేవలం భగవన్నామాన్ని జపిస్తూవుండండి. అప్పుడు పరిస్థితి ఏలా మారుతుంది? Bhava-mahā-dāvāgni-nirvāpaṇam: భౌతిక జీవితపు ఆందోళనలతో కూడిన దావాగ్ని వెంటనే ముగుస్తుంది. కేవలం ఈ పద్ధతి ద్వారా, కీర్తన, జపము చేయడము ద్వారా. మీకు ఏదైనా భగవన్నామము తెలిసివుంటే, ఒకవేళ మీకు హరే కృష్ణ మంత్రాన్ని జపించడానికి అభ్యంతరం వుంటే, అటువంటప్పుడు మీకు తెలిసిన భగవంతుని నామాన్ని, మీరు జపించండి. ఇది మన ఉద్యమం. మీరు కచ్చితంగా ఇలానే అని మేము చెప్పము ... కానీ ఇది చైతన్య మహాప్రభుచే అంగీకరించబడింది, అదే హరి నామము ( (CC Adi 17.21) మీకు ఎటువంటి అభ్యంతరమూ లేకపోతే, మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు. మరియు "హరే కృష్ణ మంత్రం భారతదేశం నుండి దిగుమతి అయ్యింది.మేము జపించము" అని మీరు భావించినట్లయితే, సరే,మీరు మీ స్వంత భగవంతుని నామాన్ని కీర్తించవచ్చు. అభ్యంతరం ఎక్కడ ఉంది? కానీ భగవంతుని యొక్క నామాన్ని,పవిత్ర నామాన్ని కీర్తించండి.అదే మా ప్రచార ఉద్యమం .

Ceto-darpaṇa-mārjanam bhava-mahā-dāvāgni-nirvāpaṇam ( CC Antya 20.12) ఎప్పుడైతే మీ హృదయం పరిశుద్ధం అయిన వెంటనే, అప్పుడు ఆందోళన ... Na śocati na kāṅkṣati ( BG 12.17) అప్పుడు క్రమముగా మీరే పెంచుతారు. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు "నేను అమెరికన్ కాదు,భారతీయున్ని కాదు, పిల్లిని కాను, లేదా కుక్కను కాను, కానీ నేను భగవంతుని యొక్క విభిన్నాంశను." అప్పుడు,ఎప్పుడైతే మీరు నేను దేవదేవుని యొక్క అంశను అని గ్రహిస్తారో,అప్పుడు మీరు మీ కార్యక్రమాలను అర్థం చేసుకుంటారు. ఎలాగైతే మీ శరీరంలో మీరు చాలా భాగాలను కలిగి ఉన్నారు. మీరు చేతులు కలిగివున్నారు, మీరు కాళ్ళు కలిగివున్నారు, మీరు తల కలిగివున్నారు. మీకు వేళ్లు వున్నాయి, మీకు చెవులు వున్నాయి, మీరు ముక్కు కలిగివున్నారు. చాలా భాగాలను పొందారు. అయితే మీ శరీరం యొక్క అన్ని భాగాల కర్తవ్యము ఏమిటి? శరీరం యొక్క భాగాల కర్తవ్యము:శరీరాన్ని సరిగా నిర్వహించడం, శరీరాన్ని సేవించడం. ఎలాగంటే ఈ వేలు ఉంది. నేను కొంత అసౌకర్యాన్ని పొందుతున్నాను. వెంటనే నా వేలు వచ్చి రక్షణ కలిగిస్తుంది, సహజముగా పనిచేస్తుంది. అందువల్ల,భగవంతుని అంశ యొక్క కర్తవ్యము భగవంతున్ని సేవించడం. అదే ఏకైక కర్తవ్యం, సహజ కర్తవ్యం. కాబట్టి మీరు భగవంతుని సేవలో నియుక్తమైనప్పుడు, ఎందుకంటే మీరు ఈ విషయాన్ని అర్థంచేసుకున్నారు - భగవంతుని యొక్క పవిత్రనామాలను జపించడం ద్వారా మీరు భగవంతుడంటే ఎవరో గ్రహించగలరు. మరియు ఆయన సలహా ఏమిటి, ఆయన ఏమి కోరుకుంటున్నారు, నా నుండి సేవ - అప్పుడు మీరు ఆ సేవలో నియుక్తమవుతారు. ఇది మీ జీవితం యొక్క పరిపూర్ణత. ఇదే కృష్ణ చైతన్య ఉద్యమము. Ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-dāvāgni-nirvāpaṇaṁ śreyaḥ-kairava-candrikā-vitaraṇam. మరియు ఎప్పుడైతే మీరు సకల కాలుష్యాల నుండి పరిశుద్ధులైన వెంటనే, అప్పుడు మీ జీవిత వాస్తవ పురోగతి ప్రారంభమవుతుంది.