TE/Prabhupada 0970 - దేవాదిదేవుడును కీర్తించడానికి నాలుకను ఎల్లప్పుడూ ఉపయోగించాలి

Revision as of 09:15, 5 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0970 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730400 - Lecture BG 02.13 - New York


దేవాదిదేవుడును కీర్తించడానికి నాలుకను ఎల్లప్పుడూ ఉపయోగించాలి. కాబట్టి ఇది మన పరిస్థితి, మన మానసిక కల్పన, పరిమిత ఇంద్రియాల ద్వారా కృష్ణుని మనము అర్థం చేసుకోలేము. అది సాధ్యం కాదు. మనము నిమగ్నం చేయవలసి ఉంటుంది - సేవోన్ముఖి జిహ్వాదౌ - జిహ్వ, నాలుక నుండి ప్రారంభమౌతుంది. నాలుక గొప్ప శత్రువు, అది గొప్ప స్నేహితుడు కూడా. మీరు నాలుకను దానికి నచ్చినదానిని చేయమని అనుమతిస్తే, ధూమపానం, త్రాగటం, మాంసం తినటం, దీనిని మరియు దానిని, అప్పుడు అది మీ గొప్ప శత్రువు. నాలుకను మీరు అనుమతించకపోతే, మీరు నాలుకను నియంత్రించ వచ్చు, అప్పుడు మీరు, అన్ని ఇంద్రియాలను నియంత్రించవచ్చు. సహజముగా.

tā'ra madhye jihvā ati lobhamoy sudurmati
tā'ke jetā kaṭhina saṁsāre
kṛṣṇa baro doyāmoy koribāre jihvā jay
swa-prasād-anna dilo bhāi
sei annāmṛta pāo rādhā-kṛṣṇa-guṇa gāo
preme ḍāko caitanya-nitāi
(భక్తివినోద ఠాకురా)


కాబట్టి భగవంతుడిని కీర్తించడానికి నాలుకను ఎల్లప్పుడూ ఉపయోగించాలి. అది నాలుకతో మన కర్తవ్యము. నాలుకకు కృష్ణ -ప్రసాదం తప్ప ఏదైనా తినడానికి అనుమతించబడకూడదు. అప్పుడు మీరు విడుదల పొందుతారు, కేవలం నాలుకను నియంత్రించడము ద్వారా. నాలుకను ఏమైనా చేయటానికి మీరు అనుమతిస్తే, అప్పుడు అది చాలా కష్టము. కాబట్టి ఆధ్యాత్మిక విద్య, కృష్ణుడు చెప్పినట్లు, నేను ఈ శరీరము కాదని మీరు సాక్షాత్కారము పొందినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ ఇంద్రియాలను సంతృప్తిపరచడం నా కర్తవ్యము కాదు, ఎందుకంటే నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఈ శరీరాన్ని కాకపోతే, శరీరమును మాత్రమే సంతృప్తి పరచడానికి నేను ఎందుకు ఆలోచించాలి? శరీరం అంటే ఇంద్రియాలు అని అర్థం. ఇది మొదటి సూచన.

కాబట్టి కర్మిలు, జ్ఞానులు, యోగులు, వారు అన్ని శరీరం కోరికలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్మిలు ప్రత్యక్షంగా అది చేస్తున్నారు. తినండి, తాగండి, ఉల్లాసంగా ఉండండి, ఆనందించండి. అది వారి తత్వము. జ్ఞాని, ఆయన కూడా కేవలం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు "నేను ఈ శరీరం కాదు." నేతి నేతి నేతి నేతి : "ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు ..." యోగులు కూడా, వారు హఠ-యోగ శరీర వ్యాయామముతో ఇంద్రియాలను నియంత్రించటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కేంద్రం శరీరం. కార్యక్రమాల యొక్క కేంద్రం శరీరం. మన తత్వము ప్రారంభమవుతుంది, "మీరు ఈ శరీరం కాదు." మీరు చూడండి? వారు ఈ శరీరం చదువును అధ్యయనం చేయటానికి వారు M.A. పరీక్షను పాస్ అయినప్పుడు, అప్పుడు వారు వారు చేయవలసిన పనిని అర్థం చేసుకోగలుగుతారు. కానీ మన తత్వము మొదలవుతుంది "నీవు ఈ శరీరం కాదు." పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు. "మీరు ఈ శరీరం కాదు." అది కృష్ణుడి ఆదేశం. భారతదేశంలో చాలా గొప్ప, గొప్ప రాజకీయ నాయకులు, మేధావులను మనం చూస్తాము. వారు భగవద్గీత మీద వ్యాఖ్యానాలు వ్రాస్తారు, కానీ వారు ఈ జీవితం యొక్క శరీర భావన గురించి వ్రాస్తారు. మా దేశంలో గొప్ప నాయకుడు, మహాత్మా గాంధీని చూసాము, ఆయన ఫోటో భగవద్గీతతో ఉంది. కానీ తన జీవితమంతా ఆయన ఏమి చేసాడు? శరీర భావన : "నేను భారతీయుడు, నేను భారతీయుడు." జాతీయవాదం అంటే జీవితం యొక్క శరీర భావన. నేను భారతీయుడిని. "నేను అమెరికన్ ని." "నేను కెనడియన్." కానీ మనము ఈ శరీరం కాదు. అప్పుడు "నేను భారతీయుడిని," "నేను అమెరికన్," "నేను కెనడియన్" అనే ప్రశ్న ఎక్కడుంది? కాబట్టి వారికి , ఈ జ్ఞానం లేదు, జీవితం యొక్క శరీర భావనలో, వారు మునిగి ఉన్నారు, ఇంకా వారు భగవద్గీతకు ప్రామాణికులు. వినోదమును చూడండి. ప్రారంభంలో భగవద్గీత బోధిస్తుంది "మీరు ఈ శరీరం కాదు." వారు జీవితంలో శరీర భావనలో ఉన్నారు. అప్పుడు వారి స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారు భగవద్గీతను ఏమి అర్థం చేసుకోగలరు? ఒకవేళ ఒకరు అనుకుంటే "నేను ఈ దేశానికి చెందినవాడిని, ఈ కుటుంబానికి చెందినవాడిని, నేను ఈ సమాజానికి చెందుతాను, నేను ఈ ఆచారంకి చెందినవాడిని, నేను దీనికి చెందిన, నేను ఈ మతానికి చెందినవాడిని..." అంతా జీవితములో శరీర భావనలో ఉన్నది.