TE/Prabhupada 0972 - అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి 'నేను ఏ విధమైన దేహాన్ని తరువాత పొందబోతున్నాను'

Revision as of 09:43, 5 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0972 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730400 - Lecture BG 02.13 - New York


అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి 'నేను ఏ విధమైన దేహాన్ని తరువాత పొందబోతున్నాను?' కాబట్టి, ఎంత కాలం వరకు ఒకరు జీవితం యొక్క శారీరక భావనలో ఉంటారో, ఆయన భ్రాంతి పెరుగుతుంది. ఇది ఎప్పటికీ తగ్గదు. అందువలన అర్జునుడికి కృష్ణుడి యొక్క మొదటి ఆదేశం... ఎందుకంటే అర్జునుడు భ్రాంతిని కలిగి ఉండకపోయినా, అది నేను ఈ శరీరం, ఇతర వైపు, నా సోదరుడు, నా తాత, నా మేనల్లుళ్ళు, వారంతా నా బంధువులు. నేను ఎలా చంపగలను? "ఇది భ్రమ. అందువలన ఈ భ్రమను, చీకటిని తొలగించడానికి, కృష్ణుడు ప్రారంభించిన మొదటి పాఠం "మీరు ఈ శరీరము కాదు." Dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā tathā dehāntara-prāptih ( BG 2.13) మీరు ఇప్పటికే మారినట్లు మీరు ఈ శరీరాన్ని మార్చుకోవాలి. మీరు ఇప్పటికే మార్చారు. మీరు శిశువుగా ఉన్నారు. మీరు మీ శరీరాన్ని పిల్లవానిగా మార్చుకున్నారు. మీరు బాల్య దశ లోకి మీ శరీరాన్ని మార్చుకున్నారు. మీరు యవ్వనములోకి మీ శరీరాన్ని మార్చుకున్నారు. మీరు వృద్ధునిగా మీ శరీరాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు, మార్పు తర్వాత ... మీరు ఇప్పటికే చాలా సార్లు మార్చినట్లుగా, అదేవిధముగా, మరొక మార్పు ఉంటుంది. మీరు మరొక శరీరాన్ని అంగీకరించాలి. చాలా సరళమైన తర్కం. మీరు ఇప్పటికే మార్చారు.

కాబట్టి tathā dehāntara-prāptir dhīras tatra na muhyati ( BG 2.13) ఎందుకంటే వారు జీవితం యొక్క శరీర భావనలో ఉన్నారు, "నేను ఈ శరీరం శరీరానికి మార్పు లేదు." శరీరం మారుతుంది. ఆయన వాస్తవానికి ఈ జీవితంలోనే చూస్తున్నాడు. అయినప్పటికీ అతను "ఈ శరీరాన్ని మార్చిన తర్వాత, నేను మరొక శరీరాన్ని పొందుతాను" అని నమ్మరు. ఇది చాలా తార్కికం. Dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā tathā dehāntara-prāptih ( BG 2.13) సరిగ్గా అదే విధముగా, మనము చాలా సార్లు ఈ శరీరాన్ని మార్చినట్లుగా, నేను మార్చాల్సి ఉంటుంది. అందువలన, తెలివైనవాడు, ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అది నేను ఏ విధమైన శరీరాన్ని తరువాత పొందబోతున్నాను? ఇది బుద్ధి అంటే. కాబట్టి అది కూడా భగవద్గీతలో వివరించబడింది, మీరు ఏ విధమైన శరీరాన్ని పొందవచ్చు.

yānti deva-vratā devān
pitṟn yānti pitṛ-vratāḥ
bhūtāni yānti bhūtejyā
yānti mad-yājino 'pi mām
(BG 9.25)

మీరు దేవతలు నివసించే ఉన్నత లోకములకు వెళ్లాలనుకుంటే వందల వేలాది లక్షల సంవత్సరాలు... బ్రహ్మ వలె. బ్రహ్మ యొక్క ఒక రోజును మీరు లెక్కించలేరు. కాబట్టి ఉన్నత లోకముల వ్యవస్థలో, మీరు వేల మరియు వేలాది రెట్లు మెరుగైన సౌకర్యాలను పొందుతారు ఇంద్రియ తృప్తి మరియు జీవిత కాల వ్యవధి కోసం. ప్రతిదీ. లేకపోతే, ఎందుకు కర్మిలు, వారు స్వర్గలోకానికి వెళ్లాలని కోరుకుంటారు? కాబట్టి yānti deva-vratā devān ( BG 9.25) మీరు ఉన్నత లోకముల వ్యవస్థకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే, మీరు వెళ్ళవచ్చు. కృష్ణుడు చెప్తాడు. పద్ధతి ఉంది. ఉదాహరణకు చంద్ర లోకము వెళ్ళుటకు, ఒకరు, కర్మ- కాండలో పవిత్ర కార్యక్రమాలలో, ఫలాపేక్ష కార్యక్రమాలలో చాలా నిపుణుడై ఉండాలి. కర్మ-కాండ ద్వారా, మీరు మీ పవిత్ర కార్యక్రమాలకు ఫలితంగా, మీరు చంద్ర గ్రహానికి వెళ్ళవచ్చు. ఇది శ్రీమద్-భాగవతం లో చెప్పబడింది. కానీ మీరు చంద్ర లోకములో ప్రవేశించలేరు, మీ ఈ పద్ధతి: శక్తి ద్వారా మనము ఈ విమానం జెట్లతో స్పుత్నిక్లతో వెళ్తాము. ఓహ్... నేను అమెరికాలో ఒక చక్కని మోటారువాహనం పొందినాను అనుకుందాం. నేను మరొక దేశంలోకి బలవంతంగా ప్రవేశించాలనుకుంటే, అది సాధ్యమా? కాదు. మీరు పాస్ పోర్ట్ మరియు వీసాను కలిగి వుడాలి. మీరు ప్రభుత్వము నుండి అనుమతి పొందాలి. అప్పుడు మీరు ప్రవేశించ గలరు అంతే కాని , మీరు ఒక గొప్ప కారును కలిగి ఉన్నారు కనుక మీరు అనుమతించ బడరు మనము బలవంతముగా.. ఇది పిచ్చి ప్రయత్నము, చిన్న పిల్లల ప్రయత్నము వారు వెళ్ళ లేరు. అందువలన ఈ రోజులలో వారు ఆపినారు. వారు దాని గురించి మాట్లాడరు వారు వారి వైఫల్యమును గుర్తించినారు. ఈ విధముగా మీరు చేయ లేరు. కానీ సాధ్య పడుతుంది మీరు వెళ్ళగలరు మీరు వాస్తవ పద్ధతిని తీసుకుంటే.మీరు అక్కడకు ఉద్దరించ బడతారు అదే విధముగా మీరు పితృలోకములకు వెళ్ళ వచ్చు శ్రద్ధ మరియు పిండములను అర్పించిన తరువాత,మీరు పితృలోకమునకు వెళ్ళవచ్చు అదే విధముగా మీరు ఈ లోకములోనే ఉండవచ్చు. Bhūtejyā అదే విధముగా మీరు తిరిగి వెళ్ళవచ్చు, తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్ళ వచ్చు