TE/Prabhupada 1049 - గురువు అంటే భగవంతుని యొక్క విశ్వసనీయ సేవకుడు అని అర్థం. ఇది గురువు అంటే

Revision as of 07:22, 18 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1049 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia


గురువు అంటే భగవంతుని యొక్క విశ్వసనీయ సేవకుడు అని అర్థం. ఇది గురువు అంటే రాజకీయవేత్తలు లేదా, నాయకులు అని పిలువబడే వారు, ఆహా, వారు మీకు హామీ ఇస్తారు "మీరు ఈ విధముగా సంతోషంగా ఉంటారు. నీవు నాకు ఓటు వేయండి, నేను నీ కోసం స్వర్గం తీసుకొస్తాను, నన్ను మంత్రి కానివ్వండి. అంటే... మీరు కేవలం వేచి ఉండండి, నేను ఒక మంత్రిని లేదా అధ్యక్షుడిని అయినప్పుడు, నేను మీకు అటువంటి ప్రయోజనమును ఇస్తాను. " కాబట్టి మిస్టర్ నిక్సన్ ని ఎంచుకోండి, మళ్ళీ మీరు నిరాశ చెందుతారు. అప్పుడు మనము, "మిస్టర్ నిక్సన్, మీరు మాకు వద్దు," అని అభ్యర్థిస్తున్నాము మనము మరొక మూర్ఖుడను అంగీకరిస్తాము. ఇది జరుగుతోంది. ఇది జరుగుతోంది... కానీ మీరు ఆ విధముగా సరైన సమాచారం పొందలేరని శాస్త్రం చెబుతోంది. ఈ మూర్ఖులైన వ్యక్తులు, వారు మీకు హామీ ఇస్తారు, ఆయన మిమ్మల్ని సంతోష పెట్ట లేరు. మీరు మళ్ళీ నిరాశ చెందుతారు, మళ్ళీ విచారం. అప్పుడు నేను ఎక్కడ నుండి సరైన సమాచారం పొందుతాను? అది వేదాలు చెప్తుంది, tad-vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12): మీరు సరైన సమాచారం కావాలనుకుంటే మీరు గురువు దగ్గరకు వెళ్ళండి. ఎవరు గురువు? అది చైతన్య మహా ప్రభు వివరిస్తూన్నారు, āmāra ājñāya guru hañā tāra' ei deśa ( CC Madhya 7.128) ఆయన చెప్పాడు, "మీరు నా ఆజ్ఞ మీద గురువు అవ్వండి." గురువు అంటే కృష్ణుని యొక్క ఆజ్ఞను పాటించే వ్యక్తి. చైతన్య మహాప్రభు కృష్ణుడు. లేదా ఎవరైతే కృష్ణుని సేవకుడో . వారు గురువు. భగవంతుని యొక్క ఉత్తర్వును పాటించకపోతే ఎవరూ గురువు కాలేరు. అందువలన మీరు కనుగొంటారు... మనలో ప్రతి ఒక్కరు గాడిద కనుక, మనకు మన స్వీయ ఆసక్తి ఏమిటో మనకు తెలియదు, ఎవరో వచ్చి, "నేను గురువుని" "మీరు గురువు ఎలా అవుతారు?" లేదు, నేను సంపూర్ణంగా ఉన్నాను. నేను ఏ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ఆశీర్వదించటానికి వచ్చాను. (నవ్వు) వెర్రి మూర్ఖులు, వారికి తెలియదు, "మీరు గురువు ఎలా కావచ్చు ?" ఆయన శాస్త్రమును లేదా మహోన్నతమైన ప్రామాణికాన్ని కృష్ణుని అనుసరించకపోతే, ఆయన ఎలా తయారవుతాడు? కానీ వారు గురువుని అంగీకరించారు.

కావున ఈ రకమైన గురువులు ఉన్నారు. భగవంతుని యొక్క ఆజ్ఞను ఎవరు పాటిస్తారో మీకు తెలుసు. వారు గురువు. ఏదో ఆలోచనలు తయారు చేసే మూర్ఖులు గురువు కాదు. వెనువెంటనే అతన్ని తన్ని వేయండి, వెంటనే, అతడు ఒక దుష్టుడు, అతను గురువు కాదు. గురువు ఇక్కడ ఉన్నారు, చైతన్య మహా ప్రభు చెప్పినట్లు, āmāra ājñāya guru hañā ( CC Madhya 7.128) గురువు అంటే భగవంతుని నమ్మకమైన సేవకుడు. అది గురువు. కాబట్టి మీరు మొదట పరీక్ష చేయాలి "నీవు భగవంతుని యొక్క నమ్మకమైన సేవకునిగా ఉన్నావా?" ఆయన చెప్పినట్టతే, "లేదు, నేను భగవంతుణ్ణి," ఓ, వెంటనే ఆయన ముఖం మీద తన్నండి (నవ్వు) వెంటనే ఆయనని తన్నండి, "నీవు మూర్ఖుడవు. నీవు నన్ను మోసగించడానికి వచ్చావు." పరీక్ష ఉంది ఎందుకంటే, అది గురువు అంటే భగవంతుని యొక్క నమ్మకమైన సేవకుడు అని అర్థం, సరళముగా మీకు గురువు అంటే గొప్ప నిర్వచనం అవసరం లేదు. వేదముల జ్ఞానం మీకు సూచిస్తుంది అది tad-vijñānārtham. మీరు ఆధ్యాత్మిక జీవితం యొక్క శాస్త్రాన్ని తెలుసుకోవాలనుకుంటే, tad-vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12), మీరు గురువు దగ్గరకు వెళ్ళాలి. ఎవరు గురువు? గురువు అంటే భగవంతుని యొక్క విశ్వసనీయ సేవకుడు. చాలా సులభమైన విషయము