TE/Prabhupada 1050 - మీరు దీన్ని చేయండి మరియు నాకు డబ్బు ఇవ్వండి, మీరు సంతోషంగా ఉంటారు - ఇది గురువు కాదు

Revision as of 08:06, 18 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1050 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia


మీరు దీన్ని చేయండి మరియు నాకు డబ్బు ఇవ్వండి, మీరు సంతోషంగా ఉంటారు '- ఇది గురువు కాదు కాబట్టి ఇది స్థితి. గురువు లేకుండా, ఆయన తన జీవన విధానాన్ని తయారు చేసుకుంటూ ఉంటే, అతడు మూర్ఖుడు, మూర్ఖుడు. అందువల్ల మూర్ఖడు అని అంటారు. ఆయన ఆలోచిస్తున్నాడు, "నేను ఎంతో అభిమానంతో ఉన్న తండ్రిని, నేను నా కొడుకు, చిన్నవాడిని జాగ్రత్తగా చూసుకుంటాను. అన్ని విషయాల్లో - నేను వాడికి తినటానికి ఇస్తున్నాను, నేను వాడిని ఎంతో ప్రేమగా చుస్తున్నాను, చాలా విషయాలు నేను... నేను చాలా నమ్మకమైన మరియు చాలా నిజాయితీ గల తండ్రిని. " కానీ శాస్త్రం ఇలా చెబుతోంది, "ఇక్కడ ఒక మూర్ఖుడు ఉన్నాడు, మూర్ఖుడు." మీరు ఇక్కడ చూడండి. ఇది చెప్తుంది, bhojayan pāyayan mūḍhaḥ. ఎందుకు ఆయన మూర్ఖుడు? Na vedāgatam antakam. ఆయన చూడడు, ఆయనకు తెలియదు, "నా వెనుక, మరణం ఎదురుచూస్తోంది, ఆయన నన్ను తీసుకుపోవడానికి వచ్చాడు." ఇప్పుడు, "మీ కొడుకు , సమాజం, కుటుంబం ,జాతి అని పిలివబడేవి మీ ప్రేమను మీ నుండి ఎలా రక్షించగలవు? ఇక్కడ మరణము ఉంది." ఆయన సమాధానం చెప్పలేడు. ఆయన చెప్పవచ్చు..., మరణం ఉంది అని సమాధానం చెప్పలేడు.

కావున మనం సిద్ధపడదాము. అది మానవ జీవితం. నాకు వెనుక మరణం ఉంది. అని మనము ఎల్లప్పుడూ తెలుసుకోవాలి ఎప్పుడైనా ఆయన నా మెడను పట్టుకుని దానిని తీసుకు పోవచ్చు. "ఇది వాస్తవం. మీరు వంద సంవత్సరాలు నివసించగలరని ఏమైన హామీ ఉందా? లేదు కొన్ని సెకన్ల తరువాత అయినా కూడా, మీరు వీధిలోకి వెళ్లినట్లయితే, మీరు వెంటనే మరణమును కలువవచ్చు. హృదయము వైఫల్యం ఉండవచ్చు. మోటారు ప్రమాదం ఉండవచ్చు. ఏదైనా, ఏదైనా ఉండవచ్చు. కాబట్టి జీవించడము అనేది అద్భుతమైనది. చనిపోవడము అనేది అద్భుతమైనది కాదు. ఎందుకంటే మీరు మరణం కోసం ఉద్దేశించబడినారు. మీరు జన్మించిన వెంటనే, వెంటనే మీరు చనిపోవడము ప్రారంభమవుతుంది. తక్షణమే. మీరు విచారణ చేస్తే, "ఓ, పిల్ల వాడు జన్మించినప్పుడు?" మీరు చెప్తారు, "ఒక వారం అయినది." అంటే వాడు ఒక వారం మరణించాడు. వాడు ఒక వారము జీవించాడని మనము భావిస్తున్నాము, కానీ వాస్తవానికి వాడు ఒక వారం చనిపోయాడు. అది అద్భుతము, ఆయన ఇంకా జీవిస్తున్నాడు, ఆయన చనిపోలేదు. కాబట్టి మరణం అద్భుతమైనది కాదు, ఎందుకంటే ఇది పరిపూర్ణంగా ఉంది. అది వస్తుంది- ఒక వారము తరువాత లేదా వంద సంవత్సరాల తర్వాత. ఇది అద్భుతమైనది కాదు. మీరు బ్రతికున్నంత కాలం, అది అద్భుతమైనది.

మనం జీవితం యొక్క పరిష్కారం చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి మనం పదేపదే చనిపోతున్నాం మరియు మళ్ళీ మరొక శరీరాన్ని అంగీకరిస్తున్నాము. వారు సరైన గురువు దగ్గరకు రాకపోతే వారు ఎలా అర్థం చేసుకోగలరు? అందువల్ల శాస్త్రము చెప్తుంది, tad-vijñānārtham: మీరు మీ జీవితము యొక్క వాస్తవమైన సమస్యను తెలుసుకోవాలనుకుంటే, మీరు కృష్ణ చైతన్య వంతులు ఎలా అవ్వాలో తెలుసుకోవాలంటే, ఎలా శాశ్వతమైన వారిగా మారాలను కుంటే, భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, భగవంతుని దగ్గరకు తిరిగి, అప్పుడు మీరు గురువును చేరుకోవాలి. " ఎవరు గురువు? చాలా సరళమైన విషయము. అది వివరించబడినది. గురువు ఎప్పుడూ ఎటువంటి ఆలోచనను తయారు చేయడు నీవు దీన్ని చేసి, నాకు డబ్బు ఇవ్వు, నీవు సంతోషంగా ఉంటావు అని . ఇది గురువు కాదు. ఇది డబ్బు సంపాదించడానికి మరొక పద్ధతి. ఇక్కడ చెప్పబడింది, మూర్ఖుడు, కేవలం మూర్ఖుల యొక్క స్వర్గం లో ప్రతి ఒక్కరూ నివసిస్తున్నారు అజామిళుని వలె తన స్వంత ఆలోచనలను తయారు చేసుకుంటూ... ఎవరో తీసుకున్నారు, "ఇది నా కర్తవ్యము," ఎవరో... ఆయన ఒక అవివేకి. గురువు నుండి మీ కర్తవ్యము ఏమిటో నీవు తెలుసుకోవాలి. మీరు ప్రతిరోజూ పాటలు పాడుతున్నారు, guru-mukha-padma-vākya, cittete koriyā aikya, ār nā koriho mane āśā. ఇదీ జీవితం. ఇదీ జీవితం. గురు-ముఖ-పద్మ... మీరు ప్రామాణికమైన గురువును అంగీకరించండి, ఆయన మిమ్మల్ని ఏది ఆజ్ఞాపిస్తున్నారో, దానిని ఆచరించండి. అప్పుడు మీ జీవితం విజయవంతమవ్వుతుంది. Ār nā koriho mane āśā. మీరు మూర్ఖులు, మీరు ఏదీ కోరుకోవద్దు