TE/660415 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం నిలబడి ఉన్న ఈ ప్రపంచం, ఈ వేదిక, ఇది కూడా నిర్మూలించబడుతుంది. ఈ భౌతిక ప్రకృతి యొక్క చట్టం అది. ఏదీ జీవించదు. ఏదీ కొనసాగదు. అంతా నశించిపోతుంది. మన ఈ శరీరం లాగే నశించిపోతుంది. ఇప్పుడు నాకు ఈ అందమైన శరీరం లబించింది. డెబ్బై సంవత్సరాలు, నా వయస్సు అనుకోండి, డెబ్బై సంవత్సరాల ముందు, ఈ శరీరానికి ఉనికి లేదు, మరియు, ఐదు లేదా పది సంవత్సరాల తరువాత ఈ శరీరానికి ఉనికి ఉండదు అని అనుకుందాం, కాబట్టి డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఈ శరీరం వ్యక్తమగును. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఈ అభివ్యక్తం అవటం ఏమిటి, చాలా వస్తువులు వస్తున్నాయి. సముద్రంలో బుడగ లాగా."
660415 - ఉపన్యాసం BG 02.55-58 - న్యూయార్క్