TE/661208 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భౌతికవాదికి సంబంధించినంత వరకు, నమిలినదే వారు మళ్ళీ నములుతున్నారు. “పునః పునస్ చర్విత-చర్వనానం” (శ్రీమద్-భాగవతం 7.5.30). ముందు రోజు నేను మీకు ఇచ్చిన ఉదాహరణ, ఒక వ్యక్తి చెరకుగడ నమిలి రసమును త్రాగి పిప్పిని భూమిపై పారవేశారు, మరియు అది మళ్ళీ ఎవరో నమలడం జరుగుతుంది, కాని అందులో రసము లేదు. కాబట్టి మనం అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ (పునరావృతం) చేస్తున్నాము. ఈ జీవిత ప్రక్రియ మనకు ఆనందాన్ని ఇవ్వగలదా అని మనం ప్రశ్నించము. కానీ మనం మళ్ళీ మళ్ళీ అదే ప్రయ త్నిస్తూన్నాము. ఇంద్రియ తృప్తి యొక్క పరమ లక్ష్యము మరియు సర్వోచ్చమైన భావన మైథున జీవితం. కాబట్టి మనం ప్రయత్నిస్తున్నాము, నమలడం, విడిచిపెట్టడం, (చూడండి) సంగ్రహిస్తున్నారు. కానీ అది ఆనందం యొక్క ప్రక్రియ కాదు. ఆనందం అనేది వేరు. “సుఖం ఆత్యంతికమ్ యత్ తద్ అతిన్ద్రియ-గ్రాహ్యం” (భగవద్గీత 6.21). నిజమైన ఆనందం దివ్యమైనది. మరియు అ దివ్యమైనది అంటే నా స్థానం ఏమిటి మరియు నా జీవిత ప్రక్రియ ఏమిటో, నేను అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ కృష్ణ చైతన్యం మీకు నేర్పుతుంది."
661208 - ఉపన్యాసం BG 09.22-23 - న్యూయార్క్