TE/681014 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సీటెల్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
ప్రభుపాద: అది ఏమిటి?

విష్ణుజన: ఐస్ క్రీం ట్రక్.

ప్రభుపాద: ఓహ్, ఐస్ క్రీం. (నవ్వు) మీరు ఐస్ క్రీం తీసుకుంటున్నారా? హుహ్?

విష్ణుజన: లేదు. వీధిలో ఎక్కి దిగుతున్నారు.

ప్రభుపాద: కాన్వాసింగ్?

తమల కృష్ణుడు: అవును.

ప్రభుపాద: ఐస్ క్రీం తీసుకోవద్దు. ఇది మాయ. (నవ్వు) 'రండి, రండి, నన్ను ఆనందించండి. రండి, రండి, నన్ను ఆస్వాదించండి.' (నవ్వుతూ) మీరు ఆనందించిన వెంటనే, మీరు చిక్కుకుపోతారు. అంతే. ఫిషింగ్ టాకిల్ లాగా. వారు టాకిల్ విసిరి, చేపలను ఆహ్వానిస్తారు, 'రండి, రండి, నన్ను ఆనందించండి.రండి, రండి, నన్ను ఆస్వాదించండి'. వెంటనే-! (నవ్వు) పూర్తయింది. అప్పుడు, (చేపను అనుకరిస్తూ) 'మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? నా సంచిలో రండి. అవును, నిన్ను చక్కగా వేయించుకుంటాను'. నువ్వు చూడు? కాబట్టి ఇవన్నీ శ్రీమద్-భాగవతంలో వివరించబడ్డాయి. చేప తినడం వల్ల, నాలుక వల్ల ప్రాణాలు కోల్పోతోంది.

681014 - ఉపన్యాసం BG 02.19-25 - సీటెల్