TE/710803 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఎవరైనా ఈ ప్రక్రియను తీసుకుంటే, అతను శుద్ధి అవుతాడు. అది మా ప్రచారం. మేము అతని గత కర్మలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కలియుగంలో ప్రతి ఒక్కరి గత కర్మలు చాలా సంతోషంగా ఉండవు. కాబట్టి మేము గత కర్మల గురించి ఆలోచించము. మీరు కృష్ణుని చైతన్యంను తీసుకో మేము కేవలం అభ్యర్థిస్తున్నాము మరియు కృష్ణుడు కూడా ఇలా చెప్పాడు,
సర్వ ధర్మాన్ పరిత్యజ్య
మామ్ ఏకం శరణం వ్రజ
అహం త్వాం సర్వ-పాపేభ్యో...
(భగవద్గీత 18.66)

నా గత జన్మలో నేను చాలా పాపం చేసి ఉండవచ్చు, కానీ నేను కృష్ణుడికి లొంగిపోయినప్పుడు, అతను నాకు ఆశ్రయం ఇస్తాడు మరియు నేను స్వేచ్ఛగా ఉన్నాను. అది మన ప్రక్రియ. మేము గత కార్యాలను పరిగణనలోకి తీసుకోము. ప్రతి ఒక్కరూ తన గత కర్మలలో పాపులు కావచ్చు. అది పట్టింపు లేదు. కానీ కృష్ణుడు చెప్పినట్లుగా అతను కృష్ణుని ఆశ్రయానికి వెళితే, కృష్ణుడు మనకు రక్షణ ఇస్తాడు. అదే మా ప్రచారం."

710803 - ఉపన్యాసం SB 06.01.15 - లండన్