TE/Prabhupada 0006 - ప్రతి ఒక్కరూ భగవంతులే - అవివేకుని స్వర్గం



Lecture on SB 1.15.49 -- Los Angeles, December 26, 1973

అందరూ, "నాకు తెలుసు, నాకు అంతా తెలుసు అని గర్వముగా ఉన్నారు. కాబట్టి ఒక గురువు దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు." అనుకుంటారు కానీ ఇది ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళే పద్ధతి: శరణాగతి పొందండి ఈ విధంగా, "నాకు పనికిరాని చాలా చెత్త విషయాలు తెలుసు. ఇప్పుడు దయచేసి నాకు నేర్పించండి." దీన్ని శరణాగతి అని అంటారు అర్జునుడు చెప్పిన విధంగా, śiṣyas te 'haṁ śādhi māṁ prapannam ( Bg. 2.7) అర్జునుడు మరియు కృష్ణుడు మధ్య వాదన ఉన్నప్పుడు, మరియు విషయం పరిష్కరించబడనప్పుడు, అర్జునుడు కృష్ణునికి శరణాగతి పొందినాడు నా ప్రియమైన కృష్ణా, ఇప్పుడు మనము స్నేహితులుగా మాట్లాడుకుంటున్నాం. ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం వద్దు. నేను మిమ్మల్ని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరిస్తాను. దయచేసి నా విధి ఏమిటో నేర్పండి." అదే భగవద్గీత.

కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తద్-విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ [MU 1.2.12]. ఇది వేదం యొక్క ఆదేశం, అదేంటంటే, ఈ జీవితం యొక్క విలువ ఏంటి? అది ఎలా మార్పు చెందుతోంది? ఒక దేహాన్ని వదలి మరో దేహానికి ఎలా వెళ్తున్నాం? నేను ఏమిటి? నేను ఈ శరీరం మాత్రమేనా లేదా మించి, ఇంకేమైనానా? ఈ విషయాలను విచారణ చెయ్యాలి. అది మానవ జీవితం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ విచారణ చేయాలి. కాబట్టి ఈ కలియుగంలో, ఎటువంటి జ్ఞానము, ఎటువంటి విచారణ లేకుండా, ఏ గురువు లేకుండా, ఏ పుస్తకం లేకుండా, ప్రతి ఒక్కరూ భగవంతుడు. అంతే. అది జరుగుతూ వుంది, పిచ్చివాళ్ళ స్వర్గం. కాబట్టి ఇది సహాయపడదు. ఇక్కడ, విదుర గురించి... ఆయన కూడా...

viduro 'pi parityajya
prabhāse deham ātmanaḥ
kṛṣṇāveśena tac-cittaḥ
pitṛbhiḥ sva-kṣayaṁ yayau
(SB 1.15.49)

అతను... నేను విదుర గురించి మాట్లాడుతున్నా. విదురుడు యమరాజు. ఒక సాధువుని యమరాజు ముందుకు శిక్ష కోసం తీసుకువచ్చారు. ఆ సాధువు యమరాజు చేత విచారింపబడినప్పుడు, అది "నేను... నేను నా జీవితంలో ఏ పాపం చేసినట్లు నాకు గుర్తు లేదు. నన్ను తీర్పు కోసం ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? అప్పుడు యమరాజు అన్నాడు "నీకు ఏమి గుర్తులేదు. మీ బాల్యంలో మీరు ఒక సూదితో ఒక చీమ పురీషనాళమును పొడిచినారు, మరియు అది మరణించింది. అందువలన మీరు శిక్షించబడాలి." చూడండి. అతను బాల్యంలో, అజ్ఞానంతో, పాపము చేసాడు కాబట్టి అతను శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. మరియు మనము "నీవు చంపకూడదు" అన్న ధర్మ సూత్రాన్ని ఇష్టపూర్వకంగా ఆచరించడము లేదు మనము చాలా వేల కబేళాలను తెరిచాము, జంతువులకు ఏ ఆత్మ కలిగిలేదని అర్థంలేని సిద్ధాంతం ఇస్తూ. ఎంత పరిహాసమో చూడండి . మరియు ఇది కొనసాగుతోంది. మరియు మనము శాంతిగా ఉండాలనుకుంటున్నాము