TE/Prabhupada 0010 - కృష్ణుని అనుకరించడానికి ప్రయత్నించవద్దు



Lecture on SB 7.9.9 -- Mayapur, February 16, 1976

కృష్ణుడు..పదహారు వేల మంది భార్యలు, వాళ్ళు భార్యలు ఎలా అయ్యారు? మీకు ఆ కథ తెలుసా, అంత మంది అందమైన, ఆ అందమైన పదహారు వేల మంది, నేను చెబుతున్న దాని అర్థం, రాజ కుమార్తెలు అసురుని చేత అపహరణకు గురి అయ్యారు. ఆ అసురుడి పేరు ఏమిటి? భౌమాసుర, కాదా? అవును. కావున వాళ్ళు కృష్ణుడిని ప్రార్థించారు "మేము బాధపడుతున్నాం, ఈ దుష్టుడు చేత అపహరణకు గురి అయ్యి, దయచేసి మమ్మల్ని రక్షించు." కాబట్టి వారిని రక్షించుటకు కృష్ణుడు వచ్చాడు, మరియు భౌమాసురుడిని కృష్ణుడు చంపి అమ్మాయిలందరికి స్వేఛ్చ కల్పించాడు. కానీ స్వేచ్చ వచ్చిన తరువాత కూడా వాళ్ళు అక్కడే నుంచుని ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, "మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళండి." వారు అప్పుడు చెప్పారు "మేము అపహరణకు గురి అయ్యాం, మరియు మేము పెళ్లి చేసుకోలేం." భారతదేశంలో ఇప్పటికీ ఆ నియమం ఉంది. ఒక అమ్మాయి, యువతి, ఒక రోజు లేదా రెండు రోజులు ఇంటి నుండి బయటకు వెళ్తే, ఎవరూ ఆమెను వివాహం చేసుకోరు. ఎవరూ ఆమెను వివాహం చేసుకోరు. ఆమె పతితురాలైన స్త్రీగా పరిగణించబడుతుంది. ఇది ఇప్పటికీ భారతీయ విధానం. వారు, చాలా రోజులు లేదా చాలా సంవత్సరాలు అపహరణకు గురి అయ్యారు. కావున వారు కృష్ణుడికి ఇలా విజ్ఞప్తి చేసారు "మమ్మల్ని మా తండ్రి కూడా అంగీకరించరు, మరియు ఎవరూ వివాహానికి అంగీకరించరు." అప్పుడు కృష్ణుడు వారి పరిస్థితి చాలా క్లిష్టమైనదిగా అర్థం చేసుకున్నాడు. వారు విడుదలైనప్పటికీ, వారు ఎక్కడికీ వెళ్ళలేరు." అప్పుడు కృష్ణుడు...చాలా దయ కలిగినవాడు, భక్త-వత్సల. ఆయన విచారించాడు, "మీకు ఏమి కావాలి?" అది.. వారు చెప్పారు "మీరు మమ్మల్ని అంగీకరించాలి. లేకపోతే మాకు ఎటువంటి దారి లేదు." వెంటనే కృష్ణుడు : "సరే, ఒప్పుకుంటున్నాను." ఇది కృష్ణ అంటే. మరియు ఆయన పదహారు వేల భార్యలు ఒకే శిబిరంలో నివసించారు అని కాదు. ఆయన వెంటనే పదహారు వేల రాజభవనాలు నిర్మించారు. ఆయన భార్యగా అంగీకరించాడు కాబట్టి, ఆమెను ఆయన భార్య వలె పోషించాలి, ఆయన రాణి వలె, వారు ఏ ఇతర మార్గము లేక నా దగ్గరికి వచ్చారు అని, నేను వారిని ఎలాగైన చూసుకోవచ్చు." కాదు. చాలా మర్యాదగా రాణిగా, కృష్ణుని యొక్క రాణిగా. మరియు మరలా ఆయన ఆలోచన చేసాడు "పదహారు వేల భార్యలు.... కాబట్టి నేను ఒక్కడిగా ఉంటే, ఒక వ్యక్తిగా, అప్పుడు నా భార్యలు నన్ను కలవలేరు. అందరూ భర్తను చూడటానికి పదహారు వేల రోజులు వేచి ఉండాలి. కాదు." ఆయన పదహారు వేల రూపాలలో కృష్ణుడిగా విస్తరించుకున్నాడు. ఇది కృష్ణుడు అంటే. ఆ జులాయిలు, కృష్ణుడిని స్త్రీ వేటగాడు అంటూ నిందిస్తారు. అది నీలాగా కాదు. నువ్వు ఒక్క భార్యను కూడా పోషించలేవు, కానీ అతను పదహారు వేల రాజభవనాలలో పదహారు వేల భార్యలను పోషించాడు మరియు పదహారు వేల రూపాలలో. ప్రతి ఒక్కరూ సంతోషించారు. అది కృష్ణుడు అంటే. మనము అర్థం చేసుకోవాలి కృష్ణుడు అంటే ఏమిటో. కృష్ణుని అనుకరించటానికి ప్రయత్నించకండి. మొదట కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.