TE/Prabhupada 0042 - ఈ ఉత్తర్వులో చాలా తీవ్రంగా దానిని తీసుకోండి



Initiation Lecture Excerpt -- Melbourne, April 23, 1976

చైతన్య చరితామృతంలో, శ్రీల రూప గోస్వామికి బోధన చేస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు,

ఎయ్ రూపే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ
గురు-కృష్ణ-కృపాయ పాయ భక్తి-లత-బీజ
( CC Madhya 19.151)

జీవులు అందరు ఒక రకమైన శరీరము నుండి మరొక శరీరములోనికి వెళ్ళుతున్నారు. మరియు ఒక లోకము నుండి మరొక లోకములోకి వెళ్ళుతున్నారు, కొన్నిసార్లు అధమ స్థాయి జీవితములోకి, కొన్నిసార్లు ఉన్నత స్థాయి జీవితములోనికి. ఇది జరుగుతోంది. దీనిని సంసార-చక్రం అంటారు నిన్నటి రాత్రి మేము వివరించాము మృత్యు-సంసార-చక్రమును ఈ పదమే మృత్యు-సంసార-చక్రం ఉపయోగించబడినది చాలా కష్టమైన మార్గాలలో జీవితము, చనిపోవడము. అందరూ మరణం గురించి భయపడతారు ఎందుకంటే మరణము తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎవరైతే మూర్ఖులో, వారు జంతువులు. ఉదాహరణకు జంతువు చంపబడుతుంది, అయితే దాని ప్రక్కన ఉన్న మరో జంతువు "నేను సురక్షితంగా ఉంటాను." అని ఆలోచిస్తుంది కావున కొంచము మేధస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా చనిపోయి మరొక శరీరం ఆమోదించడము ఇష్టపడడు మరియు మనము ఏ రకమైన శరీరమును పొందుతామో మనకు తెలియదు. కాబట్టి ఈ దీక్ష , గురువు మరియు కృష్ణుని దయవల్ల వచ్చినది, చాలా విలువ లేనిదిగా తీసుకోకండి చాలా తీవ్రంగా తీసుకోండి. ఇది ఒక గొప్ప అవకాశం. బీజ అంటే విత్తనము, భక్తి యొక్క విత్తనము

కావున మీరు భగవంతుని ముందు వాగ్దానం చేసినది ఏదైనా, మీ ఆధ్యాత్మిక గురువు ముందు, అగ్ని ముందు, వైష్ణవుల ముందు, ఈ వాగ్దానము నుండి వైదొలగ వద్దు అప్పుడు మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరముగా ఉంటారు: ఏ అక్రమ మైథున సుఖము వద్దు, ఏ మాంసం తిన వద్దు, ఏ జూదం వద్దు, ఏ మత్తు వద్దు - ఈ నాలుగు నిషేధములు - మరియు హరే కృష్ణ జపము చేయడము - ఒక అవును. నాలుగు నిషేధములు మరియు ఒక అవును. అది మీ జీవితమును విజయవంతము చేస్తుంది. ఇది చాలా సులభం. ఇది కష్టం కాదు. మయ చాలా బలంగా ఉంది, కొన్నిసార్లు మనల్ని మార్గము నుండి తప్పిస్తుంది. మాయ మనల్ను ఈ మార్గము నుండి తప్పించుటకు ప్రయత్నించినప్పుడు, కేవలం కృష్ణునికి ప్రార్థన చేయండి, నన్ను రక్షించండి. నేను శరణాగతి పొందినాను, పూర్తిగా శరణాగతి పొందినాను మరియు దయ చేసి నాకు రక్షణ ఇవ్వండి, మరియు కృష్ణుడు మీకు రక్షణ ఇస్తారు. కానీ ఈ అవకాశం వదులుకోవద్దు. ఇది నా అభ్యర్థన. నేను మీకు శుభము కలగాలి అని కోరుకుంటూ దీవెనలు ఇస్తున్నాను. కావున మనము ఈ భక్తి భక్తి, భక్తి-లతా-బీజ అవకాశం తీసుకుందాం. మాలీహన్నా సేయ్ బీజ కరే ఆరోపణ. కావున మీ దగ్గర ఒక చక్కని విత్తనము ఉంది, మేము భూమి లోపల అది నాటినాము పెట్టినాము. ఉదాహరణకు మీరు మొదటి తరగతి రోజా విత్తనమును కలిగి ఉన్నారు కాబట్టి మీరు దానిని భూమిలో నాటి మరియు కొంచము నీటిని పోస్తే. అది పెరగనుంది. కావున ఈ విత్తనమును నీళ్ళు పోయడము ద్వారా పెంచవచ్చు. ఆ నీళ్ళు ఏమిటి? శ్రవణ కీర్తన జలే కరయే సేవన ( CC Madhya 19.152) విత్తనమునకు నీరు పోయడము , భక్తి-లత, శ్రవణ కీర్తన, శ్రవణము చేయడము మరియు జపము చేయడము కావున మీరు సన్యాసుల నుండి మరియు వైష్ణవుల నుండి ఇంకా ఇంకా మరెంతో వింటారు కానీ ఈ అవకాశం వదులుకోవద్దు. అది నా అభ్యర్థన.

చాలా ధన్యవాదాలు. భక్తులు: జయ శ్రీల ప్రభుపాద!