TE/Prabhupada 0047 - శ్రీకృష్ణుడు సంపూర్ణుడు ద్వందరహితుడు



Lecture on BG 7.1 -- Upsala University Stockholm, September 8, 1973

వివిధ రకములైన యోగ పద్ధతులు వున్నాయి భక్తి యోగ , జ్ఞాన యోగ , కర్మ యోగ , హఠ యోగ, ధ్యాన యోగ చాలా యోగ విధానములు వున్నాయి కానీ భక్తి యోగ అన్నిటిలో ఉత్తమమైనది అది క్రిందటి అధ్యాయములో వివరించబడినది. నేను ఏడవ అధ్యాయము చదువుతున్నాను ఆరవ అధ్యాయము చివరలో కృష్ణుడు వివరిస్తున్నాడు

yoginām api sarveṣāṁ
mad-gatenāntar-ātmanā
śraddhāvān bhajate yo māṁ
sa me yuktatamo mataḥ
(BG 6.47)


Yoginām api sarveṣām. ఎవరైతే ఈ యోగ పద్ధతిని పాటిస్తారో వారు యోగులు కావున కృష్ణుడు చెబుతున్నాడు. yoginām api sarveṣām . యోగులు అందరిలో... నేను ఇప్పటికే వివరించాను . వివిధ రకములైన యోగ పద్ధతులు వున్నాయి యోగులు అందరిలో Yoginām api sarveṣām. sarveṣām అనగా యోగులు అందరిలో Mad-gatenāntar-ātmanā:, నా గురించి తనలోతాను స్మరించు వాడు మనము కృష్ణుని స్మరించవచ్చును . కృష్ణునికి రూపము వున్నది కృష్ణుని అర్చామూర్తిని మనము పూజిస్తాము మనము కృష్ణుని యొక్క అర్చా మూర్తిని పూజిస్తే కృష్ణుని పూజించుట మరియు అర్చా మూర్తిని పూజించుటకు తేడా లేదు . అర్చా మూర్తి లేకుంటే కృష్ణనామమును జపము చేస్తే అది కూడా కృష్ణుడే Abhinnatvān nāma-nāminoḥ (CC Madhya 17.133). కృష్ణుడు సంపూర్ణుడు ఆయనకు ఆయన నామమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన రూపమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన చిత్రమునకు వ్యత్యాసము లేదు ఆయనకు ఆయన గురించి మాటలాడుటకు వ్యత్యాసము లేదు కృష్ణుని గురించి ఏదైనా అది కృష్ణుడే . ఇది సంపూర్ణ జ్ఞానము కావున మీరు కృష్ణ నామమును జపించిన లేదా కృష్ణుని పూజించిన , అది కృష్ణుడే వివిధ రకములైన భక్తియుక్త సేవలు వున్నాయి

śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
smaraṇaṁ pāda-sevanam
arcanaṁ vandanaṁ dāsyaṁ
sakhyam ātma-nivedanam
(SB 7.5.23)

కేవలము కృష్ణుని గురించి వినండి . ఆ వినటం కుడా కృష్ణుడే ఇపుడు మనము కృష్ణుడి గురించి వింటున్నాము ఆ వినటం కుడా కృష్ణుడే ఈ అబ్బాయిలు మరియు అమ్మాయిలు జపము చేయుచున్నారు . ఆ జపము కూడా కృష్ణుడే శ్రవణం కూడా కీర్తనం తరువాత స్మరణం కృష్ణుని గురించి జపము చేస్తే , కృష్ణుని యొక్క చిత్రమును గుర్తు తెచ్చుకుంటే , అదికూడా కృష్ణుడే. కృష్ణుని చిత్రాన్ని చూడండి అదికూడా కృష్ణుడే కృష్ణుని అర్చామూర్తిని చూడండి . అదికూడా కృష్ణుడే కృష్ణుని గురించి కొంత తెలుసుకొనండి . అదికూడా కృష్ణుడే ఎలాగైతేనేమి

śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
smaraṇaṁ pāda-sevanam
arcanaṁ vandanaṁ dāsyaṁ
sakhyam ātma-nivedanam
(SB 7.5.23)

తొమ్మిది అంశాలలో ఏదోఒకటి మీరు స్వీకరిస్తే , వెంటనే కృష్ణుని కలుస్తారు మీరు తొమ్మిదింటిని కానీ,ఎనిమిదింటినికాని , ఏడు కానీ ఆరు కానీ అంగీకరిస్తే అయిదు లేదా ఆరు లేదా నాలుగు లేదా మూడు లేదా రెండింటిని లేదా కనీసము ఒక్క దానిని దృఢముగా తీసుకుంటే ఈ జపము , ఖర్చు ఏమీకాదు మేము ప్రపంచము మొత్తము జపము చేస్తున్నాము . ఎవరైనా మమ్మల్ని విని జపము చేయవచ్చును ఇది మీకు ఖర్చు కాదు . మీరు జపము చేస్తే , మీరు నష్టపోయేది ఏమి లేదు కానీ మీరు జపము చేస్తే వెనువెంటనే కృష్ణునితో సంబంధము ఏర్పర్చుకుంటారు మీకు వచ్చే ప్రయోజనము ఇదే. వెంటనే ఎందుకంటే కృష్ణుని నామము Abhinnatvān nāma-nāminoḥ (CC Madhya 17.133). ఇవన్నీ వైదిక గ్రంధములలో వివరించబడియున్నాయి Abhinnatvān nāma-nāminoḥ. Nāma cintāmaṇiḥ kṛṣṇaḥ. కృష్ణుని నామము చింతామణి . చింతామణి అనగా ఆధ్యాత్మికము Cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu (Bs. 5.29).. ఇవిఅన్నీ వైదిక వివరణలు కృష్ణుడు వుండే స్థలము కూడా వివరించబడినది cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu surabhīr abhipālayantam (Bs. 5.29) కావున నామము , కృష్ణుని పవిత్ర నామము కూడా చింతామణి , ఆధ్యాత్మికమే Nāma cintāmaṇiḥ kṛṣṇa. ఇతడు కృష్ణుడే , వ్యక్తి āma cintāmaṇiḥ kṛṣṇaś caitanya (CC Madhya 17.133). చైతన్య అనగా చనిపోలేదు . కానీ జీవుడు కృష్ణుని నామము చేస్తే వచ్చు ఉపయోగము కృష్ణునితో స్వయముగా మాట్లాడిన దానితో సమానము అదికూడా సాధ్యమే. ఇది నెమ్మదిగా అవగతమవుతుంది Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ. Rasa-vigraha అనగా ఆనందము. అన్ని ఆనందములకు నిధి మీరు హరే కృష్ణ నామమును జపముచేస్తే నెమ్మదిగా మీరు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతారు ఈ అమ్మాయిలు అబ్బాయిలు వలె, జపము చేస్తూ ఆనందముతో నృత్యము చేస్తున్నారు ఎవరు వారిని అర్ధము చేసుకొనలేరు. వారు ఇలా జపము చేయుటకు పిచ్చి వారుకాదు వాస్తవమునకు వారు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతున్నారు అందువలన వారు నాట్యము చేయుచున్నారు . ఇది కుక్క నాట్యము చేసేదికాదు ఇది ఆధ్యాత్మిక నాట్యము . ఆత్మ యొక్క నృత్యము కావున అందువలన ఆయనను రస విగ్రహ అని అంటారు . ఆనందము యొక్క నిధి Nāma cintāmaṇiḥ kṛṣṇaś caitanya-rasa-vigrahaḥ pūrṇaḥ (CC Madhya 17.133) పూర్ణము.. ఒక్క శాతము కూడా కృష్ణునికంటే తక్కువ కాకుండా . కాదు వంద శాతముకు వంద శాతము . Pūrṇa అంటే సంపూర్ణము Pūrṇaḥ śuddhaḥ. Śuddha అనగా శుద్ధి చెందినది భౌతిక ప్రపంచములో కాలుష్యము లేదు భౌతికముగా మీరు ఏ నామమునైన జపము చేయండి , అది కలుషితమైనది కనుక మీరు ఎక్కువ కాలము జపము చేయలేరు . ఇది వేరొక అనుభవము కానీ ఈ హరే కృష్ణ మహామంత్రము జపము ఇరవై నాలుగు గంటలు జపము చేసినా అలసిపోరు అదియే పరీక్ష . మీరు జపము చేస్తూనే వుంటారు ఈ అబ్బాయిలు ఇరవై నాలుగు గంటలు జపము చేయగలరు ఆహారము తీసుకొనకుండా త్రాగే నీరు తీసుకొనకుండా ఇది చాల మంచిది . ఎందుకంటే ఇది సంపూర్ణము . ఆధ్యాత్మికము, శుద్ధము. శుద్ధ అనగా స్వచ్ఛమైనది . భౌతిక కాలుష్యము లేనిది భౌతిక ఆనందము ఎటువంటి ఆనందమైనా... భౌతిక ప్రపంచములో ఉన్నతమైన ఆనందము మైథున సుఖము దానిని ఇరవై నాలుగు గంటలు ఆనందించలేము . ఇది సాధ్యము కాదు కొన్ని క్షణములు మాత్రమే ఆనందించగలరు . అంతే మిమ్మల్ని బలవంతముగా ఆనందించేటట్లు చేసినా మీరు తిరస్కరిస్తారు . వద్దు ఇక వద్దనేవద్దు అది భౌతికము . కానీ ఆధ్యాత్మికము అనగా అంతు లేదు చిరకాలము ఇరవై నాలుగు గంటలు ఆనందించవచ్చును. అది ఆధ్యాత్మిక ఆనందము Brahma-saukhyam anantam (SB 5.5.1). Anantam. Anantam means అంతు లేనిది