TE/Prabhupada 0051 - ఏదో ఒకరోజు కృష్ణ చైతన్యము ప్రపంచములోని ప్రజలందరికీ వ్యాప్తి చెందుతుంది



Interview with Newsweek -- July 14, 1976, New York

విలేకరి: ఏదోఒకరోజు కృష్ణ చైతన్యము ప్రపంచములో ప్రజలు అందరికీ వ్యాప్తి చెందుతుంది అని మీరు అనుకుంటున్నారా?

ప్రభుపాద: అది సాధ్యము కాదు. ఈ కృష్ణ చైతన్యము కేవలము అత్యంత తెలివైన వారికి మాత్రమే ఈ ఉద్యమము కేవలము అత్యంత తెలివైన వారికి మాత్రమే

విలేకరి: అత్యంత తెలివైన వారిలో

ప్రభుపాద: తెలివైన వర్గమునకు చెందినవారు అయితే తప్ప ప్రతి ఒక్కరు తెలివైనవారు అని అనుకోలేము Kṛṣṇa ye bhaja se baḍa catura. అత్యంత తెలివైన వారైతే తప్ప అతను కృష్ణ చైతన్యలోనికి రాలేడు ఎందుకంటే కృష్ణచైతన్యము విభిన్న పాఠ్యాంశము ప్రజలు పూర్తిగా శరీర భావనలో నిమగ్నమైవున్నారు. కృష్ణ చైతన్యము దీనికి అతీతము కావున మందబుధ్ధి గలవారు దీనిని అర్ధము చేసుకొనలేరు కృష్ణ చైతన్యమును ప్రతి ఒక్కరు అర్థము చేసుకొంటారని అనుకోవద్దు అది సాధ్యము కాదు

విలేకరి: మనుషులలో జన్యు పరిపూర్ణత గురించి పరిశోధన చేస్తున్నట్లు వార్తలు వున్నాయి లేదా జన్యు పరిపూర్ణత ప్రయత్నము జరుగుచున్నది కదా

ప్రభుపాద: జన్యు అంటే ఏమిటి

విలేకరి: బాగుంది ....జన్యు పరిపూర్ణత అంటే ఏమిటి

బలిమర్దన: నిన్న మనము జన్యు శాస్త్రము గురించి సంభాషించుకున్నాము కదా వారు జన్యువుల లక్షణాలను అర్థము చేసుకొని , శరీరము మరియు మనస్సు ఎలా రూపొందింది తెలుసుకొని వాటిని మార్చటానికి ప్రయత్నము చేస్తారు

ప్రభుపాద: మనము దానిగురించి ఇప్పటికే వివరించాము ఆ పుస్తకము ఏది

రామేశ్వర : స్వరూప దామోదరుని పుస్తకము

ప్రభుపాద. అవును ఆ పుస్తకమును తీసుకురండి

రామేశ్వర : మీ ప్రశ్న ఏమిటి ?

విలేకరి : నా ప్రశ్న ఏమిటంటే ఇంతకు ముందు మీరు చెపుతున్నారు సాంకేతిక సాధనాలను వుపయోగించి మరియు ఒక సమాజము ఉండి అందులో కొంత

ప్రభుపాద: ఆ పుస్తకము ఇక్కడ లేదా ? ఎక్కడ కనబడుట లేదా ?

విలేకరి: సాంకేతికత ద్వారా మానవజాతి తమను తాము మెరుగు పరుచుకుంటే వేరే మాటలలో సగటు మనిషి తెలివి ఎక్కువగావున్నది. మీరు ఇప్పుడు తెలివైన వ్యక్తిగా దేనిని పరిగణిస్తారు .

ప్రభుపాద: తెలివైన మనిషి ....తను శరీరము కాదు . తను శరీరములో వున్నాడు ఉదాహరణకు నీ దగ్గర ఒక చొక్క వుంది. నీవు చొక్క కాదు ఎవరైనా అర్థము చేసుకొనగలరు . మీరు చొక్కాలో వున్నారు అదే విధముగా మనిషి తాను శరీరముకాదు తాను శరీరములో వున్నాను అని అర్థము చేసుకొన్నా మనిషి ఎవరైనా అర్థము చేసుకొనవచ్చును ఎందుకంటే శరీరము చనిపోతే , తేడా ఏమిటి శరీరములో వున్న జీవ చైతన్యము పోవుటవలన , మనము శరీరము చనిపోయింది అని చెపుతున్నాము

విలేకరి: కొంత మంది తెలివిగలవారు అత్యంత ఆధ్యాత్మిక జ్ఞానము లేని వారు బహుశా కొంతమంది శరీరమే అంత కాదు అని అర్థము చేసుకున్న శరీరము చనిపోయింది . ఇంకా ఏదో వున్నది ఈ పురుషులు ఆధ్యాత్మిక అవగాహన ఎందుకు కాదు

ప్రభుపాద: ఈ స్వల్ప విషయం అర్థం కాకపోతే, అతడు శరీరం కాదు, అప్పుడు అతను జంతువు కంటే ఉన్నతుడు కాదు ఇది ఆధ్యాత్మిక వేదికపై మొదటి అవగాహన అతను శరీరం అని అనుకుంటే, అతను జంతువుల వర్గమునకు చెందినవాడు

రామేశ్వర: ఆమె ప్రశ్న ... ఎవరైనా మరణం తరువాత జీవితం మీద కొంత విశ్వాసం ఉందని అనుకుందాం మరియు అతడు భౌతిక ప్రమాణాల ద్వారా తెలివైన వ్యక్తి అవవచ్చు తనకు తాను స్వయముగా

ప్రభుపాద: కాదు భౌతిక ప్రమాణము తెలివి కాదు భౌతిక ప్రమాణము అంటే "నేను శరీరము" నేను అమెరికన్ ని. నేను ఒక భారతీయుడు. నేను నక్క. నేను కుక్క. నేను మనిషి ఇది భౌతిక అవగాహన ఆధ్యాత్మిక అవగాహన దీనికి అతీతము నేను ఈ శరీరం కాదు మరియు అతను ఆధ్యాత్మిక గుర్తింపును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతను తెలివైనవాడు లేకపోతే అతను తెలివైనవాడు కాదు

విలేకరి: దీని అర్థము ..

ప్రభుపాద : వారిని మూఢులుగా వర్ణించారు. మూఢ అంటే గాడిదలు. కాబట్టి ఇది మొదటి అవగాహన, మనిషి తనను శరీరంతో గుర్తించరాదు

విలేకరి: తరువాత ఏమి అవగాహన వస్తుంది

ప్రభుపాద: కుక్క వలె కుక్క అర్థము చేసుకొంటుంది తాను శరీరము కాదని, ఒక మనిషి కూడా అలా అర్థం చేసుకొంటే - అతను శరీరం అని - అప్పుడు అతను కుక్క కంటే మెరుగైన వాడు కాదు

విలేకరి: దీని తరువాత ఏ ఇతర అవగాహన వస్తుంది

బలిమర్దన: మీరు శరీరం కాదని తెలుసుకున్న తరువాత, తరువాత ఏ అవగాహన వస్తుంది?

ప్రభుపాద: హ! ఇది తెలివైన ప్రశ్న అప్పుడు అతను తెలుసుకోవాలి. అప్పుడు జీవితమంతా ఈ శరీర భావనలో మాత్రమే నేను నిమగ్నమై ఉన్నాను ఇప్పుడు నా పనియేమిటి? ఇది సనాతన గోస్వామి యొక్క విచారణ నన్ను ఈ భౌతిక పని నుండి ఉపశమనం కలుగ చేసారు ఇప్పుడు నన్ను తెలుసుకొననివ్వండి నా బాధ్యత ఏమిటి లేదా ఆ కారణంగా ఆధ్యాత్మిక గురువుకు దగ్గరకు వెళ్లాలి తెలుసుకునేందుకు, ఇప్పుడు తన విధి ఏమిటి నేను శరీరం కాదు, నా బాధ్యత ఏమిటి? నేను ఈ శరీరం కోసం రోజు మరియు రాత్రి బిజీగా వున్నందువలన నేను తింటున్నాను , నేను మైథునం చేస్తున్నాను నిద్రపోతున్నాను, నేను రక్షించుకుంటున్నాను - ఇవన్నీ శరీర అవసరాలు నేను శరీరం కాదు, నా బాధ్యత ఏమిటి? ఇది మేధస్సు

రామేశ్వర: అయితే మీరు ఇలా అన్నారు , "మీరు ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకున్న తర్వాత ఏమిటి

ప్రభుపాద : మీరు ఏమి చేయాలో తెలుసుకోవడానికి తదుపరి విషయం చెప్పాలి మరియు దాని కోసం, మీరు ఒక ఆధ్యాత్మిక గురువు నుండి సమాచారం తీసుకొనవలెను

విలేకరి: తన పుస్తకాల రూపంలో ఆధ్యాత్మిక గురువును

బలిమర్దన: వ్యక్తిగతంగా లేదా ప్రభుపాదల వారు వివరిస్తున్నారు ఇప్పుడు శరీర భావనలో చాలా విధులు ఉన్నాయి మనము పని చేస్తున్నాము, మనము లైంగిక జీవితం కలిగి ఉన్నాము, మనం తింటున్నాము , నిద్రపోతున్నాం, మనల్ని మనము రక్షించుకుంటున్నాము - ఇలా చాలా విషయాలు వున్నాయి ఇవిఅన్నీ శరీర సంబంధముతో వున్నవి కానీ నేను ఈ శరీరాన్ని కాకుంటే, నా విధి ఏమిటి? నా బాధ్యత ఏమిటి? అందుచేత ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు, అతను ఆధ్యాత్మిక గురువు నుండి సూచనలు తీసుకోవాలి పురోగమించాలి నిజమైన విధి ఏమిటో అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనది.

ప్రభుపాద: తినడం కోసము కూడా , నిద్ర, మైథున జీవితం మరియు రక్షణ కోసం మనము ఒక గురువు నుండి కొంత జ్ఞానం తీసుకోవాలి ఉదాహరణకు తినడం కోసం , కాబట్టి మనము ఏ విధమైన తిండి తీసుకోవాలి అని నిపుణుడిని అడుగుతాము ఏ రకమైన విటమిన్, ఏ రకమైన ... దానికి కూడా విద్య అవసరం మరియు నిద్రకు కూడా విద్య అవసరం కావున శరీర భావనలో వున్నా ఇతరులనుండి జ్ఞానం తీసుకోవాలి ఎప్పుడైతే శరీర భావనకు అతీతముగా ఉంటామో అతను అర్థం చేసుకుంటాడు నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అదేవిధంగా అతను ఒక నిపుణుడి నుండి పాఠం మరియు విద్య తీసుకోవాలి