TE/Prabhupada 0053 - మొదట మనము శ్రవణము చేయాలి



Lecture on SB 2.1.5 -- Delhi, November 8, 1973

కనుక మనం కూడా ప్రకృతి . మనము కూడా భగవంతుని శక్తి. మరియు మనము భౌతిక వనరులను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నందువల్ల, భౌతిక వస్తువులు విలువలు కలిగి ఉన్నాయి. లేకపోతే, దానికి విలువ లేదు, సున్నా విలువ. కానీ మన పనియేమిటంటే ఇక్కడ చెప్పబడింది, ఎందుకంటే ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రకృతిలో చిక్కుకున్నాము . భౌతిక ప్రకృతిలో వుండటము మన పని కాదు. మన ఏకైక పని ఈ భౌతిక ప్రకృతి నుండి ఎలా బయటపడాలి మీరు ఆ సేవను కోరుకుంటే, అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది అది ఏమిటి?? శ్రోతవ్య కీర్తితవ్యస్ చ ( SB 1.2.14) మీరు శ్రవణము చేయకపోతే , మీరు మీ స్థానాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? కృష్ణుడు భగవంతుడు అని మీరు తెలుసుకున్నప్పుడు, మీరు భగవంతుని లేదా కృష్ణుడు యొక్క భాగం మరియు అంశ అని అర్థము చేసుకుంటారు, అప్పుడు మీరు మీ స్థానమును అర్థము చేసుకోవచ్చు: "ఓహ్, మేము భగవంతునిలో భాగం మరియు అంశలు అని అర్థము చేసుకొంటారు కృష్ణుడు దేవాదిదేవుడు, షడైశ్వర్యపూర్ణ, అన్ని ఐశ్వర్యములు కలిగి వున్నాడు. ఒక పిచ్చి పట్టిన కుమారుడు వీధిలో తిరగటములాగా అతను మంచి మనస్సుతో అర్థం చేసుకున్నపుడు "నా తండ్రి చాలా గొప్పవాడు, ధనవంతుడు మరి ఎందుకు నేను పిచ్చివాడిలా వీధిలో తిరుగుతున్నాను నాకు ఆహారం లేదు, ఆశ్రయం లేదు. నేను ప్రతి ఇంటికి వెళ్లి అడుక్కుంటున్నాను అప్పుడు అతనికి స్పృహ వస్తుంది. దీనిని బ్రహ్మ-భూత (BG 18.54) స్థితి అని అంటాము ఓహ్, నేను భౌతిక పదార్థము కాదు, నేను ఆత్మను, భగవంతునిలో భాగం మరియు అంశ ఇది చైతన్యము.

ఈ చైతన్యమును మేలుకోల్పుటకు ప్రయత్నిస్తున్నాము ఇది ప్రజలకు ఉత్తమ సంక్షేమ సేవ, తన కోల్పోయిన కృష్ణ చైతన్యాన్ని మేల్కొలపడము. అతను మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు "నేను భౌతిక వస్తువునని" మరియు భౌతిక ప్రపంచములో నా పరిస్తితులను నేనే సరిదిద్దుకోవాలి." ఇది మూర్ఖత్వం వాస్తవిక మేధస్సు అంటే బ్రహ్మ-భూత, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నేను భగవంతునిలో భాగము, భగవంతుడు సర్వశక్తిమంతుడు నేను దేవునిలో భాగం... బంగారం, బంగారు గని వలె ఇది చిన్న చెవి దిద్దు అయినా సరే, అది కూడా బంగారమే అదేవిధంగా, సముద్రపు నీటి చిన్న రేణువు కూడా అదే నాణ్యత, ఉప్పగా వుంటుంది అదేవిధంగా, మనం భగవంతునిలో భాగంగా ఉండడంలో, మనకు భగవంతుని లక్షణములు ఉన్నాయి గుణాత్మకంగా, మనము ఒకటి ఎందుకు మనము ప్రేమ కొరకు కాంక్షతో ఉంటాము? ఎందుకంటే కృష్ణునిలో ప్రేమ ఉంది మేము ఇక్కడ రాధా కృష్ణుడిని పూజిస్తున్నాం. నిజానికి ప్రేమ అనేది ఉంది మనము భగవంతునిలో భాగం, మనము కూడా ప్రేమించటానికి ప్రయత్నిస్తున్నాము. ఒక వ్యక్తి మరొక స్త్రీని ప్రేమిస్తున్నాడు, స్త్రీ మరొక వ్యక్తిని ప్రేమించాలని ప్రయత్నిస్తుంది. ఇది సహజమైనది. ఇది కృత్రిమం కాదు. కానీ అది భౌతికముచే కప్పబడినది. అది లోపము. మనము ఈ భౌతిక స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు, మనము గుణాత్మకంగా ఆనందమాయోఽభ్యాస (వేదాంత-సూత్ర 1.1.12), ఆనందంగా ... కృష్ణుడు ఎల్లప్పుడూ నృత్యం చేస్తున్నాడు... కృష్ణ నీకు ఎప్పటికీ కనిపించడు. మీరు కృష్ణుని చిత్రాన్ని చూసారు. అతను కాళీయ సర్పముతో పోరాడుతున్నాడు . కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు . మీరు చూశారు. అతను పాముకు భయపడలేదు. అతను నృత్యం చేస్తున్నాడు అతను రాసలీలలో గోపికలతో నృత్యం చేస్తున్నట్లు, అదేవిధంగా, అతను పాముతో నృత్యం చేస్తున్నాడు ఎందుకంటే అతను ఆనందమాయోఽభ్యాస అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు, ఎల్లప్పుడూ మీరు కృష్ణుని చూస్తారు... కృష్ణుడు... కురుక్షేత్రంలో ఆ మాదిరిగా పోరాటం జరుగుతోంది కృష్ణుడు ఆనందముగా వున్నాడు. అర్జునుడు విచారముగా వున్నాడు ఎందుకంటే అతను జీవుడు, కానీ కృష్ణుడు విచారముగా లేడు అతను ఆనందముగా ఉన్నాడు. ఇది భగవంతుని స్వభావం. ఆనందమాయోఽభ్యాస. ఇది బ్రహ్మ-సూత్రలో సూత్రం, " భగవంతుడు ఎల్లప్పుడు ఆనందమయ ఆహ్లాదకరమైనవాడు, ఎల్లప్పుడు సంతోషంగా ఉంటాడు మీరు భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళినప్పుడు మీరు కూడా సంతోషంగా వుంటారు అది మన సమస్య.

అందువల్ల మనము అక్కడికి ఎలా వెళ్లవచ్చు? మొదటి విషయం మనము శ్రవణము చేయవలెను శ్రోత్యవ్య. కేవలం వినడానికి ప్రయత్నించండి, భగవంతుడు అంటే ఎవరు అతని రాజ్యం ఎలా వుంటుంది అతను ఎలా పని చేస్తాడు, అతను ఎలా సంతోషంగా వుంటాడు. ఈ విషయాలు వినవలసినవి. శ్రవణం. మీరు అంగీకరించిన వెంటనే, "ఓహ్, భగవంతుడు చాలా మంచివాడు అప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తను ప్రచారం చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. ఇది కీర్తన. ఇది కీర్తన