TE/Prabhupada 0056 - ప్రహ్లాద మహారాజు కృష్ణ చైతన్యములో ప్రామాణికుడు



Lecture on SB 7.6.1 -- Madras, January 2, 1976

శ్రీ ప్రహ్లాద ఉవాచ:-

కౌమారాచరేత్ ప్రాజ్ఞో
ధర్మాన్ భాగవతాన్
ఇహ దుర్లభ మానుష జన్మ
తదపై అధృవం అర్థదం
( SB 7.6.1)

ఇది ప్రహ్లాద మహారాజంటే కృష్ణ చైతన్యములో ఆయన ఒక ప్రామాణికుడు శాస్త్రములలో పన్నెండు మంది మహాజనులను వివరించారు

స్వయంభుర్ నారదః శంభుః

"కుమారః కపిలో మునః

ప్రహ్లాదో జనకో భీష్మో
బలిర్ వైయాసకిర్వ్యాం
( SB 6.3.20)

ధర్మాధికారులను గురించి యమరాజు పలికిన శ్లోకములు ధర్మం అంటే భాగవత ధర్మం నిన్నరాత్రి వివరించాను ధర్మ అంటే భాగవత అని ధర్మం తు సాక్షాత్ భగవత్ -ప్రణీతం ( SB 6.3.19) ఎలాగైతే ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానములో ధర్మమును అనుసరించి తీర్పు ఇస్తారో ధర్మమును సామాన్య మానవుడు లేక వ్యాపారవేత్త తయారుచేయలేరు. సాధ్యపడదు ధర్మమును తయారు చేసేది పాలించుచున్న ప్రభుత్వము మాత్రమే ఎవరూ తయారు చేయలేరు. అది కుదరదు హై కోర్ట్ లో కొందరు ఈ విధముగా వేడుకుంటే, నా సొంత ధర్మము నాకున్నది అంటే న్యాయ మూర్తి ఒప్పుకోడు అదేవిధముగా, ధర్మాన్ని నీవు తయారు చేయలేవు నీవు గొప్పవాడివి కావచ్చు నీవు ప్రధాన న్యాయమూర్తివి అయినా కూడా ధర్మాన్ని తయారుచేయలేవు. ఎందుకంటే ధర్మాన్ని ప్రభుత్వము ఇస్తుంది అదేవిధముగా ధర్మం అంటే భాగవత ధర్మం మిగతా ధర్మాలు ధర్మాలు కావు. వారిని అంగీకరించలేము సరిగ్గా అదే విధముగా, మీ ఇంటి వద్ద తయారు చేయబడిన ధర్మం ఆమోదించబడదు. అందువలన ధర్మం తు సాక్షాత్ భగవత్ -ప్రణీతం ( SB 6.3.19)

అయితే భగవత్ -ప్రణీతం ధర్మం అంటే ఏమిటి? భగవద్గీతలో చెప్పబడినది, మనకు ప్రతి ఒక్కరికీ తెలుసు. కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడి రాకకు ఉద్దేశ్యము ధర్మ -సంస్థాపనార్థాయ, ధర్మ సిద్ధాంతాలను స్థాపించడానికి, లేదా పునఃస్థాపన కోసం. ధర్మస్య గ్లానిర్ భవతి భారత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత ( BG 4.7) కాబట్టి కొన్నిసార్లు గ్లాని, ధర్మ సూత్రాలను పాటించే విషయంలో హాని జరుగుతుంది అప్పుడు కృష్ణుడు వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కుతాం ( BG 4.8) సంభవామి యుగే యుగే. కాబట్టి ఈ ధర్మం, కృష్ణుడు ధర్మాలను అని పిలవబడే వాటిని పునఃస్థాపించుట కోసం రాలేదు: హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం, బుద్ధుడి ధర్మం కాదు శ్రీమద్భాగవతము ప్రకారము ధర్మః ప్రోజ్జ్హిత -కైటవ ( SB 1.1.2) ఏ ధర్మం అయితే మోసము చేస్తుందో ఆ ధర్మమును ప్రోజ్జ్హిత అంటారు ప్రకృష్ఠ- రూపేన ఉజ్జ్హితః, అది విసిరివేయబడింది లేదా తరిమివేయబడిందని అర్థం. నిజమైన ధర్మము ఏమిటంటే భాగవత- ధర్మం, నిజమైన ధర్మము అందువలన ప్రహ్లాద్ మహాారాజు చెపుతారు కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ ( SB 7.6.1) వాస్తవమునకు ధర్మం అంటే భగవంతుడు, భగవంతునితో మనకున్న సంబంధము ఆ సంబంధానికి అనుగుణంగా వ్యవహరిస్తూ, తద్వారా మన జీవిత అంతిమ లక్ష్యమును సాధించవచ్చును ఇది ధర్మము