TE/Prabhupada 0058 - ఆధ్యాత్మిక శరీరము అంటే ఆనందము మరియు జ్ఞానముతో కూడిన శాశ్వత జీవనము



Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975


వాస్తవమునకు ఆధ్యాత్మిక శరీరము అంటే ఆనందము జ్ఞానముతో కూడిన శాశ్వత జీవనము మనకు ప్రస్తుతము వున్న శరీరము భౌతిక శరీరము ఇది శాశ్వతము కాదు, ఆనందము లేదు, పూర్తి జ్ఞానము కూడా లేదు మనకు ప్రతి ఒక్కరికీ తెలుసు ఈ భౌతిక శరీరము అంతమవుతుంది అని ఇది పూర్తిగా అజ్ఞానముతో వున్నది ఈ గోడకు వెనుక ఏముందో మనము చెప్పలేము మనకు ఇంద్రియాలు వున్నాయి. అవి అసంపుర్ణమైనవి, పరిమితమైనవి మనము కనబడుతుంది అనే గర్వముతో సవాలు చేస్తాము. భగవంతుడిని చూపెట్టగలరా అని కానీ మనము మరచి పోతున్నాము, కరెంటు పోతే మన చూసే శక్తి పోతుంది అందువలన మన శరీరము అసంపూర్ణమైనది పూర్తిగా అజ్ఞానముతో వున్నది ఆధ్యాత్మిక శరీరము పూర్తి జ్ఞానముతో వుంటుంది. పూర్తిగా వ్యతిరేకము తరువాతి జన్మలో మనకి అది వస్తుంది. మనము దానిని తెచ్చుకోవటానికి ప్రయత్నము చేయాలి మనము తదుపరి శరీరమును ఊర్ధ్వ లోకములలో పొందవచ్చును లేదా మనము పిల్లులు కుక్కల వలె తదుపరి శరీరమును తెచ్చుకోవచ్చును, అటు వంటి శాశ్వతమైన, ఆనందకరమైన జ్ఞానంతో కూడిన శరీరాన్ని పెంపొందించుకోవచ్చు. అందువల్ల మంచి తెలివైన వ్యక్తి తదుపరి శరీరమును ఆనందం, జ్ఞానం, శాశ్వతమైనది పొందుటకు ప్రయత్నిస్తాడు. ఇది భగవద్గీతలో చెప్పబడినది. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ ( BG 15.6) ఆ ధామము, ఆ లోకము, ఆ ఆకాశం, మీరు ఎక్కడికి వెళ్లినా ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాలేరు. భౌతిక ప్రపంచంలో, మీరు ఊర్ధ్వ లోకములోనికి వెళ్ళినప్పటికీ, బ్రహ్మలోకం, అయినప్పటికీ మీరు తిరిగి ఈ భౌతిక ప్రపంచమునకు రావాలి మీరు ఆధ్యాత్మిక ప్రపంచమునకు, మీ ఇంటికి, భగవంతుని దగ్గరకు వెళ్ళటానికి బాగా ప్రయత్నము చేస్తే మరల ఈ భౌతిక శరీరమును తీసుకోరు