TE/Prabhupada 0064 - సిద్ధి అంటే జీవిత పరిపూర్ణత అని అర్థం



Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975


కేచిత్ అంటే "కొంత మంది." చాలా అరుదుగా "కొందరు" అంటే "కొంత మంది." వాసుదేవ పరాయణః. అవటము సులభమైన విషయము కాదు. నిన్న నేను భగవాన్ కృష్ణుడు ఈ విధముగా వివరిస్తూన్నాడు అని చెప్పాను: యతతామపి సిద్ధానామ్ కశ్చిద్ వేత్తి మామ్ తత్వతః , మనుష్యానామ్ సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే ( BG 7.3) సిద్ధి అంటే జీవిత పరిపూర్ణము అని అర్థం. సాధారణంగా వారు ఎనిమిది సిద్దులను యోగ సాధన అని అనుకుంటున్నాను - అణిమా, లఘిమా, మహిమ, ప్రాప్తి, సిద్ధి, ఇసిత్వా, వాసిత్వ, ప్రాకామ్య వీటిని యోగ సిద్ధులు అని అంటారు యోగ-సిద్ధి అంటే మీరు చిన్నదాని కంటే చిన్నది కావడము అని అర్థం. మనము వాస్తవమునకు ఆకారం పరిమాణములో చాలా, చాలా చిన్నగా ఉంటాము కాబట్టి యోగా సాఫల్యం అంటే, భౌతిక శరీరం ఉన్నప్పటికీ, ఒక యోగి పరిమాణంలో చిన్నవాడిగా అవ్వవచ్చును ఎక్కడైనా మీరు ఆయనని దేనిలోనైన మూసి ఉంచితే, ఆయన బయటకు వస్తాడు. దానిని అణిమా సిద్ధి అంటారు. అదే విధముగా, మహిమ-సిద్ధి, లఘిమ సిద్ధి. ఆయన ఒక శుభ్రపరిచిన పత్తి కంటే తేలికైగా వాడిగా తయారవుతాడు. యోగులు చాలా బరువు తక్కువ వారిగా కాగలరు. ఇప్పటికీ భారతదేశంలో యోగులు ఉన్నారు. వాస్తవానికి, మా బాల్యంలో, ఒక యోగి మా తండ్రిని చూడటానికి వచ్చేవారు. ఆయన సెకన్లలో ఎక్కడికైనా వెళ్ళగలనని చెప్పేవాడు కొన్నిసార్లు వారు ఉదయం, హరిద్వార్, జగన్నాథ్ పూరి, రామేశ్వరం వెళ్ళేవారు వారు వివిధ గంగాజలాలలో ఇతర నదులలో స్నానం చేసేవారు. దీనిని లఘిమా సిద్ధి అంటారు. మీరు చాలా తేలికగా మారతారు. ఆయన తన గురువు దగ్గర కూర్చొని తాకుతున్నాను అని చెప్పేవాడు మనము ఇక్కడ కూర్చున్నాము, కొన్ని క్షణాల తరువాత వేరే చోట కూర్చుని వుంటాము దీనిని లఘిమా సిద్ధి అంటారు.

కాబట్టి అనేక యోగ-సిద్ధులు ఉన్నాయి. ఈ యోగ- సిద్ధులని చూసి ప్రజలు చాలా ఆశ్చర్య పోతారు. కానీ కృష్ణుడు చెప్తారు యతతామపి సిద్ధానామ్ ( BG 7.3) ఇటువంటి పలువురు యోగ సిద్ధులలో ఎవరికి యోగ-సిద్ధి ఉన్నదో, యతతామపి సిద్ధానామ్ కశ్చిద్ వేత్తి మామ్ తత్వతః ( BG 7.3) బహుశా కొందరు మాత్రమే నన్ను అర్థము చేసుకుంటారు కాబట్టి మనము కొన్ని యోగ-సిద్ధులు పొందవచ్చు; అయినను కృష్ణుడిని అర్థం చేసుకొనుట అప్పటికీ సాధ్యం కాదు. అది సాధ్యం కాదు ఎవరు కృష్ణుడికి ప్రతిదీ అంకితం చేస్తారో. వారు మాత్రమే అటువంటి వ్యక్తులకు మాత్రమే కృష్ణుడు అర్థం అవుతాడు. కృష్ణుడు మనల్ని అజ్ఞాపిస్తున్నాడు సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకమ్ శరణం వ్రజ ( BG 18.66) కృష్ణుడు తన పవిత్రమైన భక్తుని ద్వారా మాత్రమే అర్థమవుతాడు ఎవరికీ అర్థము కారు