TE/Prabhupada 0077 - మీరు శాస్త్రీయంగా మరియు తత్వపరంగా అధ్యయనం చేయవచ్చు



Ratha-yatra -- San Francisco, June 27, 1971

కృష్ణుడు చెప్తారు, ఎవరైతే నిరంతరము కృష్ణుని సేవలో ఇరవై నాలుగు గంటలు నిమగ్నమై వుంటారో ఈ విద్యార్ధులవలె, కృష్ణ చైతన్య సంఘం సభ్యుల వలె మీరు వారిని కృష్ణుడి సేవలో ఇరవై నాలుగు గంటలు నిమగ్నమై ఉన్నట్లు చూస్తారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, కృష్ణ చైతన్యం ప్రాముఖ్యత ఏమిటంటే వారు ఎప్పుడూ సేవలో నిమగ్నమై వుంటారు ఈ రథయాత్ర వేడుక ఒక ఉదాహరణగా చెప్పవచ్చు, కనీసం ఒక రోజు మీరందరు కృష్ణ చైతన్య సేవలో నిమగ్నమై వుంటారు. ఇది ఒక్కటే పద్ధతి, మీరు మీ జీవితాంతం సాధన చేస్తే అప్పుడు మరణ సమయంలో, మీరు అదృష్టవశాత్తూ కృష్ణుని గుర్తుంచుకోగలిగితే, మీ జీవితం విజయవంతమవ్వుతుంది. ఆ అభ్యాసం అవసరం. యం యం వాపి స్మరన్ భావం త్యజతంతే కలేవరమ్ ( BG 8.6) మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, అది ఖచ్చితము. కానీ మరణ సమయంలో, మనము కృష్ణుని గుర్తుంచుకుంటే, వెంటనే మీరు కృష్ణుని ధామమునకు బదిలీ చేయబడతారు. కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు, కానీ ఇప్పటికీ కృష్ణునికి ప్రత్యేక నివాసం ఉంది, దీనిని గోలోక బృందావనము అని పిలుస్తారు. మీరు అవగాహన చేసుకోవచ్చు మన శరీరము, శరీరం అంటే ఇంద్రియాలు అని అర్థము. ఇంద్రియాల పైన మనస్సు ఉంది, ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఇది ఇంద్రియాలను నియంత్రిస్తుంది, మనస్సు పైన బుద్ధి ఉంది, బుద్ధి పైన ఆత్మ ఉంది. మనకు సమాచారం లేదు, కానీ మనము ఈ భక్తి-యోగ పద్దతిని పాటిస్తే, క్రమంగా నేను అర్థం చేసుకుంటాను. నేను ఈ శరీరం కాదు. ఇది, సాధారణంగా గొప్ప, గొప్ప పండితులు, గొప్ప, గొప్ప తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు వారు కూడా ఈ శరీర భావనలో ఉన్నారు. అందరూ ఆలోచిస్తున్నారు, "నేను శరీరం," కానీ అది తప్పు. మనము ఈ శరీరం కాదు. నేను వివరించాను. శరీరము అంటే ఇంద్రియాలు కానీ ఇంద్రియాలు మనస్సుచే నియంత్రించబడతాయి మనస్సు బుద్ధి ద్వారా నియంత్రించబడుతుంది, బుద్ధి, ఆత్మ ద్వారా నియంత్రించబడుతుంది. ఇది మీకు తెలియదు. ఆత్మ యొక్క ఉనికిని ఎలా అర్థం చేసుకోవాలి అనుటకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విద్యా పద్ధతి లేదు, ఇది మానవుల అవగాహనకు ప్రధాన అవసరము. ఒక మానవుడు జంతువు వలె తన సమయం వృధా చేసుకోరాదు, కేవలం తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, రక్షించుకోవటము. ఇది జంతు జీవితం. మనుషులు తమ అదనపు బుద్ధిను వుపయోగించి అర్థం చేసుకోవాలి నేను... నేను ఎవరిని? నేను ఆత్మను. మనము "ఆత్మ" అని అర్థం చేసుకుంటే, జీవితం యొక్క ఈ శరీర భావన, ఈ ప్రపంచమును వినాశనము చేసినది శారీరక భావనలో నేను "నేను భారతీయుడిని" అని ఆలోచిస్తున్నాను, ఆయన "అమెరికన్," అని ఆయన ఏదో, ఏదో అని ఆలోచిస్తున్నాడు. కానీ మనమందరము ఒకటే. మనము ఒక ఆధ్యాత్మిక ఆత్మలము. మనము కృష్ణుడి, జగన్నాధుడి యొక్క శాశ్వత సేవకులము.

కాబట్టి నేడు చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజు భగవానుడు కృష్ణుడు, ఆయన ఈ భూమిపై ఉన్నప్పుడు, ఆయన కురుక్షేత్రములో ఒక సూర్య గ్రహణం వేడుకలో పాల్గొన్నాడు, కృష్ణుడు, ఆయన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర కురుక్షేత్ర క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చారు. కురుక్షేత్ర భూమి ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది. ఏదో ఒక రోజు మీరు భారతదేశమునకు వెళ్ళితే, మీరు కురుక్షేత్ర భూమిని అక్కడ ఉన్నట్లు చూస్తారు. కాబట్టి ఈ రథ-యాత్ర వేడుకను దానికి గుర్తుగా జరుపుకుంటాము కృష్ణుడు తన సోదరుడు సోదరితో కురుక్షేత్రమునకు వచ్చిన సందర్బాన్ని. జగన్నాథుడు, చైతన్య మహాప్రభు పారవశ్యంతో ఉన్నారు రాధారాణి కృష్ణుని ప్రేమించే భావనలో చైతన్య మహాప్రభు ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచిస్తున్నారు, "కృష్ణా, దయచేసి తిరిగి బృందావనమునకు తిరిగి రండి." వారు రథయాత్ర ముందు నృత్యం చేశారు మీరు అర్థము చేసుకోవచ్చు మీరు మేము ప్రచురించిన పుస్తకాలు కొన్ని చదివితే...,మన సంస్థ ప్రచురించినవి. చైతన్య మహాప్రభు యొక్క భోధనలు అనే పుస్తకము. ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. మీరు కృష్ణ చైతన్య ఉద్యమం గురించి తెలుసుకోవాలంటే, మా వద్ద తగినన్ని పుస్తకాలు వున్నాయి. మీరు శాస్త్రీయంగా తత్వపరంగా అధ్యయనం చేయవచ్చు. కానీ మీకు పుస్తకాలు చదవడము మీద ఆసక్తి లేకుంటే మీరు హరే కృష్ణ మంత్రం జపము చేయడము ప్రారంభిస్తే క్రమంగా ప్రతిదీ మీకు వెల్లడి అవుతుంది, మీరు కృష్ణుడితో మీ సంబంధాన్ని అర్థం చేసుకుంటారు.

ఈ వేడుకలో పాల్గొనడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మనము హరే కృష్ణ కీర్తన చేస్తూ జగన్నాథ స్వామితో ముందుకు వెళ్దాము. హరే కృష్ణ.