TE/Prabhupada 0083 - హరే కృష్ణ జపము చేయండి.అప్పుడు ప్రతిదీ వస్తుంది



Lecture on SB 7.9.11-13 -- Hawaii, March 24, 1969

ప్రహ్లాద మహారాజు చెప్పారు మనము ఇప్పటికే ఈ విషయమును చర్చించాము ఎటువంటి అర్హత అవసరం లేదు. భగవంతుని సంతోష పరిచేందుకు, తృప్తి పరిచేందుకు, మీకు ఏ ముందస్తు అర్హత అవసరం లేదు మీరు విశ్వవిద్యాలయంలో మీ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి లేదా మీరు రాక్ఫెల్లర్ లేదా ఫోర్డ్ వలె ఒక గొప్ప ధనవంతుడు కావలెను ఎటువంటి షరతు లేదు. అహైతుకీ అప్రతిహతా. మీరు కృష్ణుడిని ప్రేమించాలంటే ఎటువంటి షరతు లేదు మార్గము తెరిచి ఉంది. మీరు నిజాయితీగా ఉండాలి. అంతే. అప్పుడు కృష్ణుడు మార్గం సుగమం చేస్తాడు. విధేయత లేకపోతే అప్పుడు కృష్ణుని మాయ ఉంది. ఆమె ఎప్పుడూ కొన్ని కష్టాలను మన జీవితములో ఉంచుతుంది. ఇది కాదు ఇది కాదు. ఇది కాదు ప్రహ్లాద మహా రాజు నిర్ణయించుకున్నారు "నేను బాలుడిని అయినప్పటికీ, నేను ఏ విద్య కలిగిలేను, నేను వేదాలు అధ్యయనం చేయలేదు నేను నాస్తిక తండ్రి వలన జన్మించాను, తక్కువ వంశములో జన్మించాను అన్నీ చెడు అర్హతలు, భగవంతుడు పవిత్రమైన, తెలివైన వ్యక్తులచే, పూజింపబడుతాడు వేదముల మంత్రాలు చదువుతూ, బ్రాహ్మణులు, అత్యంత సంస్కారవంతమైన వారిచే. నాకు అలాంటి అర్హతలు లేవు. అత్యున్నత స్థాయిలో వున్న దేవతలందరు నన్ను అభ్యర్థించిరి. ఆ భగవంతుడుని నేను కూడా శాంత పరుచవచ్చును. లేకపోతే వారు ఎలా సిఫార్సు చేస్తారు? నాకు ఎటువంటి అర్హత, తెలివి వున్నా నేను వాటిని కృష్ణుడికి అర్పిస్తాను అందువల్ల మన కృష్ణ చైతన్య ఉద్యమము ఇలా వుంది మీకు ఏ అర్హత వున్నా, అది సరిపోతుంది. మీరు ఆ అర్హతలతో మొదలుపెడుతారు. మీరు మీ అర్హతల ప్రకారం కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నించండి వాస్తవమైన యోగ్యత ఏమిటంటే - సేవ చేయవలెననే భావము. ఇది వాస్తవమైన యోగ్యత. మీరు ఈ సేవా భావమును పెంపొందించుకోండి. మీ బాహ్య అర్హత, అందం, సంపద, జ్ఞానం ఉపయోగపడవు ఈ విషయాలు ఏ విలువ కలిగి లేవు. కృష్ణునికి సేవలో ఉపయోగించవచ్చు అంటేనే వాటికి విలువ. మీరు ధనవంతులైతే, మీ సంపదను కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే అది సరే. కృష్ణుడికి సేవచేయటానికి మీరు ధనవంతులు కావలసిన అవసరము లేదు.

ప్రహ్లాద మహా రాజు చెప్పారు, nīco ajayā guṇa-visargam anupraviṣṭaḥ pūyeta yena pumān anuvarṇitena. కొందరు ప్రశ్నించవచ్చు, ప్రహ్లాదుడు అపవిత్రమైన తండ్రి నుంచి జన్మించాడు అని ఈ వాదన ఉంది. ప్రహ్లాదుడు అపవిత్రుడు కాదు, అది ఒక వాదన కోసము చైతన్యములో తక్కువ స్థాయి తండ్రి నుండి, లేదా తక్కువ స్థాయి కుటుంబం నుండి, లేదా వారు చాలా విషయాలు చెబుతారు. కానీ ప్రహ్లాద మహా రాజు అంటాడు "నేను ప్రారంభం చేస్తే, నేను భగవంతుని కీర్తిస్తే, నేను పవిత్రుడను అవుతాను నేను పవిత్రమవ్వుటకు జపము చేస్తే... ఈ హరే కృష్ణ మంత్రం జపము చేయుట, పవిత్రమవ్వుటకు పద్ధతి నేను వేరే పద్ధతుల ద్వారా పవిత్రుడు అయిన తరువాత, ఈ హరే కృష్ణ మంత్రమును జపించడము మొదలు పెడతాను. అది పద్ధతి కాదు మీరు జపము చేయుట మొదలు పెట్టండి. మీరు పవిత్రులు అవుతారు జపము చేయుట ప్రారంభము చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, దానికి పట్టింపు లేదు. నిజానికి, నేను ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును మొదలు పెట్టినప్పుడు వచ్చిన వారందరూ పవిత్ర స్థితిలో వచ్చారని కాదు మీరు ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చినప్పుడు. వారు తమ చిన్ననాటి..... శిక్షణ పొంది ఉన్నారు భారత ప్రామాణికత ప్రకారం, వారికి పరిశుభ్రతా సూత్రాలు తెలియవు. పవిత్రత అంటే ఏమిటి? మీరు చూడండి. భారతదేశంలో పద్ధతి, చిన్ననాటి నుండి వస్తుంది, పిల్లలు ఉదయమునే పళ్ళు కడుగుకోవటము, స్నానము చేయుట నేర్చుకుంటారు. నా రెండవ కుమారుడు నాలుగు సంవత్సరాల వయసులో వున్నప్పుడు నాకు గుర్తుంది, అల్పాహారం తినే ముందు, నేను వాడిని అడిగేవాణ్ణి "నాకు నీ పళ్ళు చూపించు." అప్పుడు వాడు నాకు చూపిస్తాడు... " అవును వాడు తన పళ్ళను శుభ్రము చేసుకున్నాడు. అప్పుడు వాడిని అల్పాహారం తీసుకొనుటకు అనుమతించేవారము" ఈ శిక్షణ ఉంది. కానీ ఇక్కడ, ఈ దేశంలో, శిక్షణ వాస్తవానికి, ఎక్కడో ఉంది, కానీ పరిపూర్ణంగా పాటించుట లేదు. అది పట్టింపు లేదు. హరే కృష్ణ జపము చేయండి. హరే కృష్ణ జపము ప్రారంభించండి. అప్పుడు ప్రతిదీ వస్తుంది. ప్రతిదీ వస్తుంది.