TE/Prabhupada 0100 - మనము శాశ్వతముగా కృష్ణుడితో సంబంధము కలిగి వున్నాము



Lecture on SB 6.1.8 -- New York, July 22, 1971

మనం కృష్ణుడితో శాశ్వత సంబంధం కలిగి ఉన్నాము ప్రస్తుత క్షణం అది మర్చిపోయము లేదా, అణచివేయబడినది. అందువలన మనము కృష్ణడుతో ఎటువంటి సంబంధం కలిగి లేము అని ఆలోచిస్తున్నాము. కానీ ఇది వాస్తవం కాదు. మనము కృష్ణుని అంతర్భాగమైనoదువలన ఈ సంబంధం శాశ్వతము. కేవలం మనము అది పునరుద్ధరించాలి. ఆది కృష్ణ చైతన్యము. కృష్ణడు చైతన్యము అంటే ... మనము వేరే చైతన్యములో ఉన్నాము. నేను భారతీయుడిని అని ఆలోచిస్తున్నాను. కొంతమంది ఆలోచిస్తున్నారు, "నేను అమెరికన్." కొంతమంది అలోచిస్తుస్తున్నారు నేను ఇది నేను అది అని కానీ అసలు ఆలోచన "నేను కృష్ణుడి సేవకుడిని." ఇది కృష్ణా చైతన్యము. "నేను కృష్ణుడి సేవకుడిని." అక్కడ కృష్ణడు చైతన్య సంబంధములో కృష్ణడు అందరికీ ఉన్నాడు. అందువలన నేను అందరికీ సేవకుడిని. దయచేసి అర్థం చేసుకొనటానికి ప్రయత్నించండి. భారతదేశంలో, వ్యవస్థ ఒక అమ్మాయికి ఒక అబ్బాయితో వివాహం అయినప్పుడు మీ దేశంలో కూడా, ప్రతిచోటా, అదే వ్యవస్థ. భర్త మేనల్లుడు భార్యని "అత్త" అని పిలుస్తాడు. ఇప్పుడు, ఆమె అత్త ఎలా అవుతుంది ? ఎందుకంటే, ఆమె భర్తతో సంబంధం కలిగి వున్నది. వివాహానికి ముందు, ఆమె అత్త కాదు కాని ఆమె తన భర్తతో సంబంధం కలిగిన వెంటనే భర్త యొక్క మేనల్లుడు ఆమెకు మేనల్లుడు అవుతాడు. దయచేసి ఉదాహరణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా, మనము కృష్ణుడితో సంబంధం ఏర్పర్చుకుంటే లేదా కృష్ణడుతో మన అసలు సంబంధమును ఏర్పర్చుకుంటే కృష్ణడు అందరికీ ఉన్నాడు. అందువలన నేను అందరికి సేవకుడిని ఇది నిజమైన ప్రపంచ ప్రేమ. విశ్వవ్యాప్తమైన ప్రేమ అని పిలవబడేది ఏర్పాటు చేయలేము ఎందుకంటే అది కృత్రిమము. మీరు కృష్ణుడితో మీ సంబంధాన్ని ఏర్పర్చుకుంటే తప్ప అది సాధ్యం కాదు. మీరు అమెరికన్లు.ఎందుకు? ఎందుకంటే మీరు ఈ దేశంలో జన్మించారు. మరొక అమెరికన్, మీ దేశం యొక్క సభ్యుడు కానీ మీరు మరో విధముగా మారితే, అప్పుడు మీరు మరొక అమెరికన్తో ఎటువంటి సంబంధం కలిగి ఉండరు. మనము కృష్ణడుతో మన సంబంధం పునరుద్ధరించుకోవడము అవసరం. అప్పుడు విశ్వ సోదర బావము, న్యాయం, శాంతి ప్రశ్న, శ్రేయస్సు వస్తాయి. లేకపోతే, ఎటువంటి అవకాశం లేదు. కేంద్ర బిందువు తప్పిపోయింది. న్యాయం శాంతిని ఎలా సాధ్యమవుతుంది ? అది సాధ్యం కాదు.


అందువలన, భగవద్గీతలో, శాంతి సూత్రం ఇవ్వబడింది. శాంతి సూత్రం ఏమిటంటే కృష్ణడు మాత్రమే భోక్త అని మనం అర్ధము చేసుకోవాలి ఈ ఆలయంలో మా ప్రధాన విషయము కృష్ణుడు. మనము వంట చేస్తుంటే కృష్ణడు కోసం చేస్తున్నాము, దాన్ని మనము మన ప్రయోజనం కోసం వంట చేయటములేదు, చివరకు, మనము ప్రసాదము తిన్న, మనము వంట చేసేటప్పుడు మనము మన కోసం వంట చేస్తున్నాము అని భావించడం లేదు. మనము కృష్ణుడి కోసం వంట చేస్తున్నాం. మీరు కొన్ని నిధులు సేకరించడానికి బయట వెళ్ళినప్పుడు, కీర్తన పార్టీలో వున్నా వ్యక్తులు ఎవరు, వారి వ్యక్తిగత అవసరాల కోసము వెళ్లారు అని కాదు లేదు, వారు సేకరిస్తున్న, లేదా వారు సాహిత్యం పంపిణీ చేస్తున్న కృష్ణుడి కోసము. ప్రజలను కృష్ణ చైతన్యవంతులు చేయడము కోసము సేకరించిన ధనమునంత, కృష్ణడు కోసం ఖర్చు చేస్తున్నారు. ఆ విధంగా, మనము జీవితంలో ఈ జీవిత విధానమును పాటిస్తాము ప్రతిదీ కృష్ణుడి కోసము, అది కృష్ణ చైతన్యము. అదే విషయం, మనము ఇప్పుడు ఏమి చేస్తున్నమో ఎప్పుడు అదే చేయాలి. మనము కేవలం మన చైతన్యమును మార్చుకోవాలి. "నేను కృష్ణుడి కోసము చేస్తున్నాను, నా వ్యక్తిగత ఆసక్తి కోసము కాదు. ఇ విధంగా, మనము కృష్ణడు చైతన్యము అభివృద్ధి చేసుకుంటే , అప్పుడు మనము మన అసలు చైతన్యమునకు వస్తాము. అప్పుడు మనము సంతోషంగా వుంటాము.


మనము అసలు చైతన్యమునకు రాకపోతే మనము వివిధ స్థాయిలలో వెర్రి కలిగి వుంటాము. కృష్ణ చైతన్యము లేని వ్యక్తులు ఎవరైనా, వారు వెర్రి అని పరిగణనలోనికి తీసుకోవాలి ఎందుకంటే అతను తాత్కాలిక, మారిపోయే వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాడు. అది ముగుస్తుంది. కానీ మనము, జీవరాశులుగా, మనము శాశ్వతము ఈ తాత్కాలిక పనులు మన పని కాదు. మన పని శాశ్వతమైనది ఎందుకంటే మనము శాశ్వతము మన శాశ్వత కర్తవ్యము కృష్ణుడికి ఎలా సేవ చేయాలి ఈ వేలు నా శరీరము యొక్క అంతర్భాగము. కానీ వేలు యొక్క శాశ్వతమైన కర్తవ్యము ఈ శరీరమునకు సేవ చేయడము, అంతే. ఇక్కడ దానికి వేరే పని లేదు ఇది వేలు యొక్క ఆరోగ్యమైన స్థితి. మొత్తం శరీరానికి సేవ చేయక పోతే అది ఒక రోగలక్షణము. అదేవిధంగా, కృష్ణడు శాశ్వతమైన ఉన్నాడు. మనము కూడా శాశ్వతమైన ఉన్నాము. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఇవి వేద సూచనలు. శాశ్వతమైన దేవాదిదేవుడు శ్రీ కృష్ణుడు మనము కూడా శాశ్వతము. మనము దేవుడిమీ కాదు. మనం సేవకులము. Nityo nityānāṁ cetanaś cetanānām. కృష్ణడు సర్వశక్తిమంతుడు. మనము అయిన సేవకులము. Eko bahūnāṁ yo vidadhāti kāmān. శాశ్వతమైన వాడు ఒకే జీవుడు, అతను శాశ్వతమైన మీగత జీవరాసుల జీవితము యొక్క అన్ని అవసరాలు సరఫరా చేస్తూ ఉన్నాడు. Eko bahūnām లెక్క పెట్టలేనన్ని జీవులు, మీరు లెక్కించలేరు. Bahūnām. ఇది మన సంబంధము. కృష్నుడిలో అంతర్భాగము కనుక మనము సేవ చేయాలి. మనము సేవకులము అతను మన అవసరాలను సరఫరా చేస్తున్నాడు. ఆయన మన మహోన్నతమైన తండ్రి. ఇ జీవితం అసలైన జీవితం విముక్తి పొందిన జీవితం. కృష్ణడు చైతన్యము లేకుండా ఏదైనా ఇతర జీవితం పాపాత్మకమైన జీవితం.