TE/Prabhupada 0118 - ప్రచారము చేయుట చాల కష్టమైన పని కాదు



Lecture on SB 1.5.8-9 -- New Vrindaban, May 24, 1969

కృష్ణుడికి లేదా దేవుడుకి ఆశ్రయము పొందువాడు చాలా అదృష్టవంతుడు. Bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate (BG 7.19). ఆశ్రయము పొందు వ్యక్తి, అతను సాధారణ వ్యక్తి కాదు. అతను విద్వాంసులు అందరికన్న, తత్వవేత్తలు అందరికన్న, యోగులు అందరికన్న, కర్మిలు అందరికన్న గొప్పవాడు. ఆశ్రయము తీసుకున్న వాడు అందరికన్న ఉన్నతుడు. అందువలన ఇది చాలా రహస్యము. మన కృష్ణ చైతన్య ఉద్యమము భగవద్గీతను యధాతదముగా భోదిస్తుంది కృష్ణునికి లేదా దేవుడుకి ఎలా ఆశ్రయము పొందాలో ప్రజలకు బోధించే పద్ధతి. అంతే. అందువల్ల కృష్ణుడు చెప్పుతాడు ఇది రహస్యము ... ఎవరూ అంగీకరించరు. కానీ ఎవరైతే ప్రమాదం తీసుకుoటారో, "దయచేసి, శరణాగతిని పొందండి ..." మీరు ప్రచారము చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రచారకులును కొన్నిసార్లు దాడి చేస్తారని మీకు తెలుసు. ఎలాగైతే నిత్యానంద ప్రభువును జగాయ్-మాదాయా దాడి చేసారో. ప్రభువైన యేసు క్రీస్తుకు శిలువ వేసి, హత్య చేసినారు ... ప్రచారకుడు ప్రమాదంలో ఉ౦టాడు. అందుచేత కృష్ణుడు ఇలా చెప్పారు, ఈ భగవద్గీత ప్రచారములో నిమగ్నమై ఉన్న భక్తులు నాకు చాలా ప్రియమైనవారు. చాలా, చాలా ప్రియమైన వారు. Na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ(BG 18.69). ప్రజలకు ఈ రహస్యమైన సత్యాన్ని ప్రచారము చేయుచున్న భక్తుని కన్నా ఎవరు ప్రియమైన వారు నాకు లేరు.


అందువల్ల కృష్ణుడిని తృప్తి పరచాలని కోరుకుంటే, మనము ఈ ప్రమాదమును తీసుకోనవలెను కృష్ణుడు, గురువు. నా ఆధ్యాత్మిక గురువు ప్రచారము చేయుటవలన వచ్చే ప్రమాదాన్ని తీసుకున్నారు ప్రచారము చేయుటకు ప్రోత్సాహము ఇచ్చారు మిమ్మల్ని కుడా ప్రచారము చేయమని అర్ధిస్తున్నాము నేను చెప్పుతున్నాను ఈ ప్రచారమును చాల అధ్వాన్నంగా చేస్తున్నాము అధ్వాన్నంగా - ఇది అధ్వాన్నంగా కాదు, నేను చాలా విద్యావంతుడిని కాకపోతే. ఈ అబ్బాయి వలె. నేను అతణ్ణి ప్రచారమునకు పంపినట్లయితే, అతను చదువుకోలేదు. అతను ఒక తత్వవేత్త కాదు. అతను ఒక పండితుడు కాదు. కానీ అతను కూడా ప్రచారము చేయవచ్చు. అతను కూడా ప్రచారము చేయవచ్చు. మన ప్రచారము చేయుట చాలా కష్టమైన పని కాదు. మనము ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కోరవలెను, "నా ప్రియమైన సార్, మీరు హరే కృష్ణ మంత్రమును జపము చేయండి" అతను కొద్దిగా భక్తిలో ఉన్నతుడు అయితే చైతన్య మహాప్రభు బోధనలను చదవడానికి ప్రయత్నించండి, ఇది మంచిది, మీరు ప్రయోజనం పొందుతారు. ఈ మూడు నాలుగు పదాలు మీమ్మల్ని ప్రచారకుడిగా చేస్తాయి. చాలా కష్టమైన పనినా? మీరు బాగా చదువుకున్న వారు కాకా పోవచ్చు. గొప్ప పండితులు, గొప్ప తత్వవేత్తలు కాకపోవచ్చు. మీరు కేవలము చెప్పండి ... ఇంటి ఇంటికి వెళ్ళి నా ప్రియమైన సార్, మీరు చాలా చదువుకున్న వారు ప్రస్తుతానికి, మీరు మీ నేర్చుకోవటమును ఆపండి. కేవలం హారే కృష్ణ మంత్రమును జపము చేయండి.