TE/Prabhupada 0122 - ఈ మూర్ఖులు అనుకుంటున్నారు నేను ఈ శరీరము అని



Morning Walk At Cheviot Hills Golf Course -- May 17, 1973, Los Angeles


ప్రభుపాద: "మీరు పూర్తిగా ఆశ్రయము తీసుకోండి, నేను మీకు పూర్తిగా రక్షణ ఇస్తాను" అని కృష్ణడు చెప్పుతున్నారు. Ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi (BG 18.66). అతను మీకు పూర్తి మేధస్సు ఇస్తాడు. శాస్త్రీయ ప్రపంచము ఆమోదించినప్పుడు అది మనకు గొప్ప విజయము. వారిని అంగీకరించనివ్వండి. అప్పుడు మన కృష్ణ చైతన్య ఉద్యమం గొప్ప విజయం సాధించినట్లు. మీరు అంగీకరించండి"అవును, దేవుడు ఉన్నాడు. ఆధ్యాత్మిక శక్తి ఉన్నాది." అప్పుడు మన ఉద్యమం చాలా విజయవంతమవుతుంది. అది వాస్తవము. కేవలం అర్ధంలేని వాటి మధ్య ఒక అర్ధంలేని వాటిని మాట్లాడుట, ఇది గొప్ప అర్హత కాదు. Andhā yathāndhair upanīyamānāḥ (SB 7.5.31). ఒక కళ్ళు లేని మనిషి ఇతర కళ్ళు లేనివారికి దారిని చుపుటము. అటువంటి దానికి విలువ ఏమిటి? వారు అందరు కళ్ళు లేని వారే. గ్రుడ్డిగా మరియు మూర్ఖుడిగా ఉన్నంతవరకు ఆతను దేవుణ్ణి స్వీకరి౦చడు. ఇది పరీక్ష. మనము వెంటనే చూడవచ్చు, ఎవరైతే దేవుడిని అంగీకరించారో అతను గ్రుడ్డివాడు, ముర్ఖుడు, మీరు ఏమైనా అనవచ్చును ఏది ఏమైనప్పటికీ, అతను ఎవరైనప్పటికీ అతను ఒక మూర్ఖుడు. దీనిని మీరు అంగీకరించవచ్చును ఈ సూత్రంపై మనము చాలా పెద్ద, పెద్ద రసాయన శాస్త్రవేత్తలను, తత్వవేత్తలను మన దగ్గరకు ఎవరు వచ్చిన సవాలు చేయవచ్చు. "మీరు రాక్షసులు" అని చెప్పవచ్చును మరో రసాయనవాది వచ్చాడు, మీరు అతన్ని తీసుకువచ్చారు, ఆ భారతీయుడు?

స్వరాప దమోదరా: చౌరీ (?)

ప్రభుపాద: నేను "నీవు రాక్షసుడివి" అని చెప్పాను. కానీ ఆయనకు కోపంగా రాలేదు. అతను ఒప్పుకున్నాడు. అతని వాదనలు అన్నింటినీ తిరస్కరించాము. బహుశా మీకు గుర్తు ఉండవచ్చు.

స్వరూప దమోదరా: అవును, వాస్తవానికి, "కృష్ణుడు నాకు అన్ని విధానాలు, అడుగులు, ఇవ్వలేదు ప్రయోగం చేయటానికి అది ... అతను ఆలా అన్నాడు.

ప్రభుపాద: అవును. నేను నీకు ఎందుకు ఇవ్వాలి? మీరు ఒక ముర్ఖులు, మీరు కృష్ణుడికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు, కృష్ణుడు ఎందుకు మీకు సదుపాయం కల్పిస్తాడు? మీరు కృష్ణుడికి వ్యతిరేకంగా ఉండి కృష్ణుడు లేకుండా మీకు అర్హత కావాలనుకుంటే, అది సాధ్యం కాదు. మీరు ముందు వినమ్రత కలిగి ఉండాలి. అప్పుడు కృష్ణుడు మీకు అన్ని సౌకర్యాలను ఇస్తాడు. మనము ఏ రసాయన శాస్త్రవేత్తైనైనా, ఏ శాస్త్రవేత్తైనైనా, ఏ తత్వవేత్తైనైనా దైర్యముగా ఎదురుకుంటున్నాము. ఎందుకు? కృష్ణుని శక్తీ మీద, కృష్ణుడు ఉన్నాడని మనము నమ్ముతున్నాము. నేను కృష్ణుడితో మాట్లాడినప్పుడు, కృష్ణుడు నాకు తెలివి ఇస్తాడు. ఇది మూలము లేకపోతే, అర్హత, ప్రామాణికము మీద, వారు చాలా అర్హత కలిగి ఉన్నారు. మనము వారి ముందు సామాన్యులము. కానీ ఎలా మనము వారిని సవాలు చేస్తున్నాము? మానకు తెలుసు ఎందుకంటే. ఒక చిన్న పిల్లవాడు, అతను చాలా పెద్ద మనిషిని సవాలు చేస్తాడు, ఎందుకంటే అతనికి తెలుసు, "నా తండ్రి ఇక్కడ ఉన్నాడు." అతను తండ్రి చేతిని పట్టుకోని ఉన్నాడు, అతను నమ్ముతాడు "తనని ఎవరూ ఏమి చేయలేరని"

స్వరూప దామోదరా: శ్రీల ప్రభుపాద, నేను Tad apy aphalatāṁ jātaṁ. యొక్క అర్ధము తెలుసుకోవాలనుకుంటున్నాను.

ప్రభుపాద: Tad apy aphalatāṁ jātaṁ.

స్వరూప దామోదరా: Teṣām ātmābhimāninām, bālakānām anāśritya Teṣām ātmābhimān..., bālakānām anāśritya govinda-caraṇa-dvayam.

స్వరూప దామోదరా: Svarupa దామోదర: "మానవ జీవితం వారికీ వృధావుతుంది

ప్రభుపాద: అవును. "ఎవరు కృష్ణ చైతన్యమును అర్థముచేసుకోవడానికి ప్రయత్నించరో" అతను జంతువువలె మరణిస్తాడు. అంతే. కేవలము పిల్లులు కుక్కలు వలె, అవి కూడా జన్మిస్తాయి, అవి తింటాయి, నిద్రపోతాయి, పిల్లలను కంటాయి, చనిపోతాయి. మానవ జీవితం కుడా ఇలానే ఉంటుంది.

స్వరాప్ దమోదరా: Jāta అంటే జాతులు అని అర్ధమా? Jāta?

ప్రభుపాద: Jāta. Jāta అంటే జన్మించటము. Aphalatām Jātam. Jāta అంటే వ్యర్థం అవుతుంది. ఫలించదు. అతను గోవింద-చరణాలను స్వీకరించకపోతే మానవ జీవితం వృధా అవుతుంది. Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. అతను నమ్మలేక పోతే "నేను పుజిస్తున్నాను,ఆది పురుషుడైన భగవంతుడిని గోవిందుడిని . ఆతను నాశనమయ్యాడు. అంతే. అతని జీవితం నాశనమైనది.

స్వరూప దామోదరా Aatmabhimaninam అంటే.. ప్రభుపాద ఆత్మ Dehatma-māninām.

స్వరూప దామోదరా, అంతా మాకే కావాలనుకునేవారు ...

ప్రభుపాద: "నేను ఈ శరీరముని." ఆత్మ. ఆత్మ గురించి సమాచారము వారి వద్ద లేదు. ఈ ముర్ఖులు, వారు అనుకుంటున్నారు నేను ఈ శరీరమును అని ఆత్మ అంటే శరీరము ఆత్మ అంటే నాది. ఆత్మ అంటే మనస్సు. కావున ātmābhimānī అంటే శరీర భావన అని అర్థము. బాలకా. బాలకా అంటే అవివేకి, పిల్లవాడు అని అర్ధము. Ātmābhāānināṁ bālakānām. శారీరక భావనలో జీవిస్తున్నవారు, వారు పిల్లలు, మూర్ఖులు లేదా జంతువుల వలె వుంటారు.

స్వరూప దామోదరా: ఈ శ్లోకము ద్వారా ఆత్మ మరొక దేహమునకు పోవు సిద్ధాంతాన్ని వివరించడానికి నేను ప్రణాళిక చేస్తున్నాను.

ప్రభుపాద: అవును. మరొక దేహమునకు పోవు పద్ధతిని. Bhramadbhih. Bhramadbhih అంటే ఒక శరీరం నుండి మరొక శరీరమునకు తిరుగుతూ నేను ఇక్కడ ఉన్నాను. నేను ఈ శరీరమును కలిగి వున్నాను, దుస్తులతో కప్పబడి వున్నాను నేను భారతదేశం వెళ్ళినప్పుడు, ఇది అవసరం లేదు. వారు శరీరం ఈ విధముగా ఉద్భవించి౦ది అని భావిస్తారు. కానీ కాదు. ఇక్కడ, ఇక్కడి పరిస్థితుల ప్రకారము, నేను ఈ దుస్తులను ధరించాను. మరొక చోట, అక్కడి పరిస్థితుల ప్రకారము, నేను వేరే దుస్తులను ధరిస్తాను. నేను ముఖ్యము, దుస్తులు ముఖ్యము కాదు. కానీ ఈ ముర్ఖులు దుస్తులను మాత్రమే చదువుతున్నారు దీనిని అత్తమాభిమానమ్ అని అంటారు, దుస్తులు, శరీరాన్ని మాత్రమే పరిగానలోనికి తీసుకుంటారు. Bālakānām.