TE/Prabhupada 0130 - కృష్ణుడు చాల అవతారములలో వస్తున్నారు



Lecture on BG 4.5 -- Bombay, March 25, 1974

కృష్ణుడు చాలా అవతారాలలో కనిపిస్తున్నాడు. కేవలం కృష్ణుని యొక్క స్థానం ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయిన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మాగా ఉన్నరు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati (BG 18.61). అయిన ప్రతి ఒక్కరికి దిశను ఇస్తారు. అపరిమిత, అసంఖ్యాక జీవ రాశులు ఉన్నాయి. అందువల్ల అతడు అనేక జీవులకు వివిధ మార్గాల్లో సూచనలను ఇస్తున్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నారు, ఊహించుకోవటానికి ప్రయత్నిoచండి. ఇప్పటికీ, అయిన స్థానం అదే. Goloka eva nivasaty akhilātma-bhūtaḥ (Bs. 5.37). Goloka eva nivasati. కృష్ణుడు తన సొంత ధామములో ఇప్పటికీ ఉన్నారు, గోలోక వృందావనములో, అయిన శ్రీమతి రాధారాణి యొక్క సాంగత్యములో ఆనందిస్తున్నాడు అది పట్టింపు లేదు. . ఇది మాయావాద తత్వశాస్త్రం కాదు. అయిన చాలా జీవుల హృదయాలలో, తనను తాను విస్తరించి ఉన్నాడు కనుక, దాని అర్ధము అయిన తన సొంత ధామములో లేరు అని కాదు అయిన ఇప్పటికి అక్కడ ఉన్నాడు. అది కృష్ణుడు. Pūrṇasya pūrṇam ādāya pūrṇam evāvaśiṣyate (Īśo Invocation).

ఇది వేద సమాచారం. ఇక్కడ మనకు భౌతిక అనుభవం వున్నది. మీరు ఒక రూపాయి కలిగి ఉంటే, మీరు ఒక అణా తీసుకుంటే. అప్పుడు అది పదిహేను అణాలు అవుతుంది లేదా రెండు అణాలు, తీసుకుంటే. అది పద్నాలుగు అణాలు అవుతుంది మీరు పదహారు అణాలు తీసుకుంటే, అది సున్నా అవుతుంది. కానీ కృష్ణుడు అలా కాదు. అయిన తనకు తాను అపరిమితమైన రూపాలలో విస్తరించవచ్చు; ఇప్పటికీ, అసలు కృష్ణుడు అక్కడ ఉన్నాడు. అది కృష్ణుడు. మనకు అనుభవం ఉంది. ఒకటి మైనస్ ఒకటి సున్నా అవుతుంది. కానీ అక్కడ, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆది సంపూర్ణము అంటారు. ఒకటి మైనస్, మిలియన్ సార్లు ఒకటి మైనస్, ఇప్పటికీ, అసలు ఒకటి ఒకటిగానే వున్నది. అది కృష్ణుడు. Advaitam acyutam anādim ananta-rūpam (Bs. 5.33).

అందువల్ల కృష్ణుడిని మీరు వేద సాహిత్యాన్ని ద్వార అర్థం చేసుకోలేరు, కేవలం వేద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా. వేదాల అర్ధం అయినప్పటికీ, వేదాంత అర్థం, కృష్ణుడిని అర్థం చేసుకోవటము. Vedaiś ca sarvair aham eva vedyaḥ (BG 15.15). కానీ దురదృష్టవశాత్తు, మనము కృష్ణుడి లేదా అయిన భక్తుడి ఆశ్రయము తీసుకోము, వేదాల ప్రయోజనము ఏమిటో మనకు అర్థం కాదు. అది ఏడవ అధ్యాయంలో వివరించబడుతుంది. Mayy āsakta-manāḥ pārtha.... Mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ. Mad-āśrayaḥ. Asaṁśayaṁ samagraṁ māṁ yathā jñāsyasi tac chṛṇu (BG 7.1) . మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే, asaṁśayam ఎటువంటి సందేహం లేకుండా, సమగ్రం, పూర్తి గా, అప్పుడు మీరు ఈ యోగ పద్ధతిని సాధన చేయాలి.

యోగా అంటే ఏమిటి? Man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru (BG 18.65). Mad-āśrayaḥ yogaṁ yuñj... Yogaṁ yuñjan, mad-āśrayaḥ. Mad-āśrayaḥ ఈ పదం చాలా ముఖ్యమైనది మత్ అంటే "మీరు నేరుగా తీసుకోవడం" ఇది చాలా సులభం కాదు. ... నా ఆశ్రయం, లేదా నా ఆశ్రయం తీసుకున్న వ్యక్తి, మీరు అతన్ని ఆశ్రయం తీసుకోండి. ఉదాహరణకు విద్యుత్ పవర్హౌస్ ఉంది, ఒక ప్లగ్ ఉంది. ఆ ప్లగ్ ఎలక్ట్రిక్ పవర్హౌస్తో అనుసంధానించబడి ఉంది మీరు మీ వైర్ను ప్లగ్లో ఉంచినట్లయితే, మీరు కూడా విద్యుత్ పొందుతారు. అదేవిధంగా, ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్పినట్లుగా, evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ (BG 4.2). మీరు పరంపరా పద్ధతి యొక్క ఆశ్రయం తీసుకుంటే .... ఆదే ఉదాహరణ. మీరు పవర్హౌస్తో అనుసంధానించిన ప్లగ్ యొక్క ఆశ్రయం తీసుకుంటే, మీకు వెంటనే విద్యుత్ వస్తుంది. అదేవిధంగా, పరంపర వ్యవస్థలో వస్తున్న వ్యక్తి యొక్క ఆశ్రయం తీసుకుంటే ...

ఒక పరంపర వ్యవస్థ ఉంది. కృష్ణుడు, అయిన బ్రహ్మదేవుడికి ఆదేశించాడు. బ్రహ్మ దేవుడు నారాదుడికి ఆదేశించాడు. నారాదుడు వ్యాసదేవునకు ఆదేశించాడు. వ్యాసదేవుడు మధ్వాచార్యునకు ఆదేశించారు. మధ్వాచార్యులు చాలా విధాలుగా ప్రచారమ చేశారు. తరువాత మాధవేంద్ర పురి మాధవేంద్ర పురి నుండి ఇశ్వరపురికి, ఇశ్వరపురి నుండి చైతన్య మహాప్రభువుకి ఈ విధంగా, ఒక పరంపర వ్యవస్థ ఉంది. నాలుగు వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి. రుద్ర-సాంప్రదాయ, బ్రహ్మ-సాంప్రదాయ, కుమార-సాంప్రదాయ,మరియు లక్ష్మీ-సాంప్రదాయ, శ్రీ-సాంప్రదాయ. కావున sampradāya-vihīnā ye mantrās te niṣphalā matāḥ. మీరు కృష్ణుడి ఉపదేశములను సాంప్రదాయము నుండి పొందకపోతే అప్పుడు niṣphalā matāḥ అప్పుడు మీరు నేర్చుకున్నది మొత్తము నిష్ఫలము. ఇది నిరుపయోగం. అది లోపము. చాలామంది భగవద్గీతను చదువుతున్నారు, కాని వారు కృష్ణునిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు ఎవరు evaṁ paramparā-prāptam (BG 4.2). ద్వారా అందుకోలేదు. Paramparā, మీరు paramparā ద్వార రాకపోతే ... అదే ఉదాహరణ. మీరు పవర్హౌస్తో అనుసంధానించబడిన ప్లగ్ నుండి విద్యుత్తు తీసుకోకపోతే, మీ బల్బ్ మరియు వైర్ యొక్క ఉపయోగము ఏమిటి? దానికి ఉపయోగం లేదు.

అందువల్ల కృష్ణుడు ఎలా విస్తరిస్తున్నాడో, అది వేదశు దర్లాభా. మీరు కేవలం బౌతిక విద్యా పరిజ్ఞానాన్ని కలిగిట్లయితే, అది సాధ్యం కాదు. Vedeṣu durlabham adurlabham ātma-bhaktau (Bs. 5.33). ఇది బ్రహ్మ-సాహితి యొక్క ప్రతిపాదన.