TE/Prabhupada 0136 - గురు శిష్య పరంపర ద్వార జ్ఞానము భగవంతుని దగ్గర నుండి మన వరకు వచ్చినది



Lecture with Translator -- Sanand, December 25, 1975

భగవన్ అంటే దేవాదిదేవుడు అని అర్ధం. సంపూర్ణ సత్యము మూడు దశల్లో గుర్తించబడుతుంది. brahmeti paramātmeti bhagavān iti śabdyate (SB 1.2.11). సంపూర్ణమైన సత్యాన్ని మొదట నిరాకర బ్రాహ్మణ్ నుండి గ్రహించవచ్చు, ఇది జ్ఞానుల లక్ష్యము. తరువాత, పరామత్మా , యోగుల యొక్క లక్ష్యం, చివరిగా, భగవంతుని అర్ధము చేసుకొనేది అయిన ఒక వ్యక్తి, దేవాదిదేవుడు అని చివరిగా భగవంతుడు దేవాదిదేవుడు మనము అర్థం చేసుకుంటాము సూర్యుని భూగోళంలో అక్కడ ఒక మహోన్నతమైన వ్యక్తి సుర్యనారయనుడు ఉన్నాడు లేదా సూర్య గ్రహంలో ఉన్న ముఖ్య వ్యక్తి. అయిన పేరు కూడా భగవద్గీతలో ఇవ్వబడింది. వివాశ్వన్ భగవంతుడు నాల్గవ అధ్యాయంలో చెప్పుతున్నారు , imaṁ vivasvate yogaṁ proktavān aham avyay: (BG 4.1) నేను మొదట ఈ శాస్త్రాన్ని వివరించాను, భగవద్గీత యొక్క ఈ యోగ పద్ధతిని, సూర్య-దేవుడుకి, వివాస్వాన్కు. Vivasvān manave prāhur manur ikṣvākave 'bravīt. సూర్యదేవుడైన వివాశ్వన్ మనుకు వివరించాడు, మను తన కుమారునికి వివరించాడు. ఈ విధంగా, గురు శిష్య పరంపర ద్వార జ్ఞానము మన వరకు వచ్చింది. జ్ఞానము గురించి మాట్లాడినప్పుడు, అది ఒక వ్యక్తి నుండి నేర్చుకోవాలి. భగవన్, పరిపుర్ణమైన సత్యము యొక్క అవగాహనలో చివరి పదం, భగవద్గీతలో అయిన చెప్పారు.

వ్యాసదేవుడు ప్రత్యేకంగా ఇక్కడ వివరిస్తున్నారు. bhagavān uvāca. అయిన కృష్ణడు uvāca అని చెప్పలేదు, ఎందుకంటే కొన్నిసార్లు కృష్ణుడుని ముర్ఖులు తప్పుగా అర్థం చేసుకుంటారు. భగవన్ ఉవాచా, ఈ పదము అనగా, అయిన చెప్పినదానిలో, లోపములు లేక అంతకు మించి చెప్పవలసినవి లేవు. మనలాంటి సాధారణ వ్యక్తికి నాలుగు లోపాలు ఉన్నాయి bhrama pramāda vipralipsā kara-ṇāpāṭava. భగవంతుడు దేవాదిదేవుడు, కృష్ణుడికి ఆత్మ సాక్షాత్కారము కలిగిన వ్యక్తికి కృష్ణుని సేవకులకు, కృష్ణుని అర్థం చేసుకున్నవారికి, వారికి లోపాలు లేవు. వారు ఖచ్చితంగా ఉన్నారు. ఈ కారణంగానే కృష్ణుడు ఆదేశాన్నిఇచ్చారు

tad viddhi praṇipātena
paripraśnena sevayā
upadekṣyanti tad jñānaṁ
jñāninas tattva-darśinaḥ
(BG 4.34)

వాస్తవాము చుసిన వ్యక్తినుండి లేదా వాస్తవాము తెలుసుకున్న వ్యక్తి నుండి, మీరు జ్ఞానము తీసుకోవాలి. మనము అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. లేకపోతే, మనము కల్పన చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళితే, మనము వాస్తవ జ్ఞానమును పొందలేము. కల్పనలు చేసేవారు వారు, దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. అందువల్ల వారు దేవుడు ఈ విధంగా ఉంటాడు, దేవుడు ఆలాంటి వాడు, అని తప్పులు చేస్తారు దేవుడు లేడు, "ఆయినకు రూపం లేదు." ఈ అసంపూర్ణ విషయాలన్నీ ప్రతిపాదించబడ్డాయి ఎందుకంటే వారు అసంపూర్ణమైనవారు. అందువల్ల భగవoతుడు చెప్పుతారు avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritāḥ (BG 9.11). అయిన మానవ రూపంలో మన ప్రయోజనం కోసం వస్తున్నారు కనుక ముర్ఖులు అయినని సాధారణ వ్యక్తిగా భావిస్తారు. భగవoతుడు చెప్పుతారు. ahaṁ bīja-pradaḥ pitā (BG 14.4), నేను విత్తనాన్ని ఇచ్చే తండ్రిని మనం, మనలో ప్రతి ఒక్కరికి తెలుసు, నా తండ్రి వ్యక్తి అని, మన తండ్రికి తెలుసు, అయిన తండ్రి వ్యక్తి అని, అయిన తండ్రికి తెలుసు, అయిన తండ్రి వ్యక్తి అని ఎందుకు మహోన్నతమైన వ్యక్తి , మహోన్నతమైన తండ్రి ఎందుకు వ్యక్తి కాకుడదు? ఎందుకు? అందువలన మనము భగవన్, దేవదిదేవుడి నుండి, పూర్తి జ్ఞానమును నేర్చుకోవాలి. ఈ భగవద్గీత భగవంతుని యొక్క పూర్తి జ్ఞానము, పూర్తిగా దేవాదిదేవుడి దగ్గరనుండి ఈ భగవద్గీతలో ఒక పదాన్ని కూడా మార్చలేము. మార్చడము మూర్ఖత్వము కావున మన ఈ కృష్ణ చైతన్యము ఈ సూత్రాన్ని అనుసరిస్తుంది. మనము ఏ కల్పిత విషయాలు తయారు చేయము. మనము కేవలం భగవంతుని దేవాది దేవుడు ఇచ్చిన సందేశాన్ని ప్రచారము చేస్తాము. ఇది ప్రభావవంతముగా ఆచరణాత్మకముగా మారుతోంది.