TE/Prabhupada 0161 - వైష్ణవుడిగా మారి బాధపడుచున్న మానవుల బాధలను అర్థము చేసుకోండి



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Disappearance Day, Lecture -- Los Angeles, December 9, 1968

ఆధ్యాత్మిక గురువుని కృతనిశ్చయంతో ఎవరు సేవిస్తారో వారికీ, కృష్ణుడు అన్ని సౌకర్యాలను ఇస్తాడు. అది రహస్యము. ఎటువంటి అవకాశం లేనప్పటికీ, నేను ఎన్నడూ ఆనుకోలేదు, కానీ నేను దానిని తీవ్రంగా తీసుకున్నాను, భగవద్గీత మీద విశ్వనాధ చక్రవర్తి ఠాకురా యొక్క వ్యాఖ్యానం చదువుతూ. భగవద్గీతలో శ్లోకమును vyavasāyātmikā-buddhir ekeha kuru-nandana (BG 2.41), ఆ శ్లోకముతో సంబంధించి, విశ్వనాధ చక్రవర్తి ఠాకురా తన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు మన ఆధ్యాత్మిక గురువు ఆదేశాలను మన జీవిత లక్ష్యముగా తీసుకోవాలి ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనను ప్రత్యేక సూచన తప్పకుండ పాటించాలి మన వ్యక్తిగత ప్రయోజనం లేదా నష్టం కోసం చూసుకోకుండా. నేను ఆ స్పుర్తిలో కొంచెం ప్రయత్నించాను. ఆయన నాకు సేవ చేయటానికి అన్ని సౌకర్యాలను ఇచ్చారు. పరిస్థితులు ఈ దశకు వచ్చాయి, ఈ వృద్ధాప్యంలో నేను మీ దేశానికి వచ్చాను, మీరు ఈ ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకుంటున్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మన వద్ద కొన్ని పుస్తకాలు వున్నాయి. ఈ ఉద్యమం ఒక్క స్థాయికి వచ్చినది. నా ఆధ్యాత్మిక గురువు పరమపదించిన ఈ సందర్భంగా, నేను తన సంకల్పం అమలు చేయుటకు ప్రయత్నిస్తున్నను, అదేవిధంగా, నేను కూడా మీరు నా సంకల్పము ద్వారా అదే ఆదేశమును అమలు చేయండి అని అభ్యర్థిస్తున్నాను నేను ఒక వృద్ధుడను, ఏ సమయంలో అయినా కూడా నేను మరణించవచ్చు. ఇది ప్రకృతి చట్టము. ఎవరూ దానిని మార్చలేరు . ఇది చాలా ఆశ్చర్యకరం కాదు, కానీ నా గురు మహారాజ యొక్క పరమపదించినఈ పవిత్ర రోజున మీకు నా విజ్ఞప్తిని ఏమిటి అనగా, కనీసం కొంత వరకు మీరు కృష్ణ చైతన్యఉద్యమ సారాన్ని అర్థం చేసుకున్నారు. మీరు దాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. ప్రజలు ఈ చైతన్యం కోసమే బాధపడుతున్నారు. మనము ప్రతి రోజు భక్తుల గురించి ప్రార్ధన చేస్తూన్నాము,

vāñchā-kalpatarubhyaś ca
kṛpā-sindhubhya eva ca
patitānāṁ pāvanebhyo
vaiṣṇavebhyo namo namaḥ

భగవంతుడు యొక్క భక్తుడు, వైష్ణవుడు, అయిన జీవితం ప్రజల ప్రయోజనం కోసం అంకితం చేయబడుతుంది. నీకు తెలుసు - మీలో చాలామంది క్రైస్తవ సంఘానికి చెందుతారు - ఎలా ప్రభువైన యేసు క్రీస్తు, అయిన మీ పాపములకు తాను త్యాగం చేశానని చెప్పాడు. ఇది భగవంతుడు యొక్క భక్తుడి స్థిర నిర్ణయము. వారు వ్యక్తిగత సుఖాలను పట్టించుకోరు. ఎందుకంటే వారు కృష్ణుడు లేదా దేవుణ్ణి ప్రేమిస్తారు, అందువల్ల వారు జీవులందరినీ ప్రేమిస్తారు ఎందుకంటే ప్రాణులన్నీ కృష్ణితో సంబంధం కలిగి ఉంటాయి. అదేవిధంగా మీరు నేర్చుకోవాలి. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే వైష్ణవుడు ఆవ్వాలి, మానవుల బాధలను అనుభూతి చెందాలి. మానవుల బాధలను అనుభూతి చెందాడము కోసము, వివిధ కోణాల ఆలోచనలు ఉన్నాయి. మానవుల యొక్క బాధల గురించి దేహాత్మ భావనతో కొంతమంది ఆలోచిస్తున్నారు. రోగములు ఉన్న వారికీ ఉపశమనం ఇవ్వడానికి ఆసుపత్రిని తెరవడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. పేదరికం కలిగిన దేశాలలో లేదా ప్రదేశాలలో ఆహార పదార్థాలను పంపిణి చేయటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాలు ఖచ్చితంగా చాలా బాగున్నాయి, కానీ మానవత్వం యొక్క అసలు బాధ కృష్ణ చైతన్యము లేకపోవటము వలన. ఈ శరీర బాధలు, తాత్కాలికమైనవి; అవి ప్రకృతి చట్టాలచే అవి మార్పు చెందవు. పేదరికం కలిగిన దేశానికి మీరు ఆహారము పంపిణి చేశారు అని అనుకోండి, ఈ సహాయం సమస్య పరిష్కారం చేస్తుంది అని కాదు. ప్రతి వ్యక్తిలో కృష్ణ చైతన్యమును పెంపొందిoచటమే వాస్తవమైన ప్రయోజనకరమైన పని.