TE/Prabhupada 0163 - రిలీజియన్, ధర్మము అంటే భగవంతునిచే ఇవ్వబడిన చట్టాలు మరియు ఉపదేశాలు



Lecture on BG 4.3 -- Bombay, March 23, 1974

జీవితం యొక్క లక్ష్యం భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్ళటము అది జీవితం యొక్క లక్ష్యం. ఈ భౌతిక భద్ద జీవితంలో మనము పడిపోయాము. మనము బాధపడుతున్నాము. కానీ మానకు తెలియదు. మనము మూర్ఖంగా ఉన్నాము. కేవలము జంతువులు వలె . జీవితం యొక్క లక్ష్యమేమిటో మానకు తెలియదు. జీవిత ఉద్దేశ్యం, అది కూడా భగవద్గీతలో వర్ణించబడింది. janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam (BG 13.9). మనము "జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి పునరావృతమయే ఈ పద్ధతి, ఇది నాకు అవసరము లేదు ..." అని అర్ధము చేసుకొన్నప్పుడు ఎవరూ చనిపోవాలని కోరుకోరు, కానీ అయినకు మరణం వస్తుంది. అయిన "ఇది నా సమస్య, నేను చనిపోవాలని అనుకోవడం లేదు, కానీ మరణం మీగత వాటివలె ఖచ్చితంగా ఉంది." ఇది సమస్య. ఈ సమస్యను ఎలా జాగ్రత్తగా పరిష్కరించాలో ఎవరికి తెలియదు. వారు కేవలం తాత్కాలిక సమస్యలలో నిమగ్నమై ఉన్నారు. తాత్కాలిక సమస్యలు సమస్యలు కాదు. వాస్తవ సమస్య మరణమును ఆపడాము ఎలా , జన్మ ఆపడము ఎలా, వృద్ధాప్యం ఆపడము ఎలా, వ్యాధిని ఆపడము ఎలా. అది వాస్తవమైన సమస్య. మీరు ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తి పొందినప్పుడు ఇది చేయవచ్చు. ఇదిమనసమస్య.

మళ్ళీ కృష్ణుడు ఇక్కడకు వస్తాడు ... Yadā yadā hi dharmasya glānir bhavati bhārata (BG 4.7). Dharmasya glāniḥ. గ్లాని అంటే ధర్మము వక్రీకరించినప్పుడు. ప్రజలు, తయారు చేస్తున్నారు, ధర్మము అని పిల్లువబడే దాని యొక్క పేరుతో, ఇదిమనధర్మము. "ఇది హిందూ ధర్మము." "ఇది ముస్లిం ధర్మము." "ఇది క్రిస్టియన్ ధర్మము." లేదా "ఇది బుద్ధ ధర్మము." "ఇది సిక్కు ధర్మము." "ఇది ధర్మము, ధర్మము ..." వారు చాలా ధర్మములు, చాలా ధర్మములు తయారు చేశారు. కానీ వాస్తవమైన ధర్మము dharmaṁ tu sākṣād bhagavat-praṇītam (SB 6.3.19). ధర్మము అంటే దేవుడు ఇచ్చిన ఉపదేశములు మరియు అయిన ఇచ్చిన చట్టాలు అని, అర్థం. అది ధర్మము. ధర్మము యొక్క సరళమైన నిర్వచనం. dharmaṁ tu sākṣād bhagavat-praṇītam (SB 6.3.19). ప్రభుత్వం చేత చట్టం ఇవ్వబడుతుంది. మీరు చట్టాన్ని తయారు చేయలేరు. నేను పదేపదే చెప్పాను. చట్టం ప్రభుత్వం చేత చేయబడుతుంది. అదేవిధంగా, ధర్మము దేవుడి చేత చేయబడుతుంది. మీరు దేవుడి ధర్మన్ని అంగీకరిస్తే, అది ధర్మము. దేవుడి ధర్మము ఏమిటి? మీరు నిలబడి ఉంటే, మీరు ఇక్కడకు వచ్చి నిలబడoడి. ఇతర వ్యక్తులు చూస్తున్నారు. దేవుడు ధర్మము ఏమిటంటే ... మీరు భగవద్గీతలో చూస్తారు sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja (BG 18.66). ఇది దేవుడు ధర్మము. మీరు ఈ అసంపూర్ణ ధర్మములు అన్నిటినీ విడిచిపెట్టండి. మీరు ఒక భక్తుడు అవ్వండి, నాకు ఆశ్రయము పొందండి. అది ధర్మము.