TE/Prabhupada 0172 - వాస్తవ ధర్మము కృష్ణుడికి శరణాగతి పొందుట



Lecture on SB 1.5.30 -- Vrndavana, August 11, 1974

ఇది ధర్మము, కృష్ణుడికి ఆశ్రయము పొందటానికి. లేకపోతే, శ్రీమద్-భగవతములో చెప్పబడినట్లుగా dharmah projjhita-kaitavo 'tra (SB 1.1.2) భగవద్, శ్రీమద్-భగవతం అన్ని రకాల మోసపూరితమైన మత పద్ధతులను తరిమేసింది. తరిమేసింది, projjhita. దేవాదిదేవుడులోకి విలీనము అవ్వడము, దేవుడిగా మారటము, దేవుడి అవతారం అవ్వటము- ఈ రకమైన మత పద్ధతులను శ్రీమాద్-భగవతం నుండి చాలా కఠినంగా తరిమి వేయబడ్డాయి ఎందుకంటే అవి ధర్మము కాదు. నిజమైన ధర్మము కృష్ణుడికి ఆశ్రయము పొందుట.

అందువల్లన చెప్పబడినది, yat tat saksad bhagavata uditam. మీరు భగవంతుని చేరుకోవాలనుకుంటే, మీరు భగవంతుని యొక్క అదేశమునకు కట్టుబడి ఉండాలి. కానీ మీకు భగవంతుడు అంటే ఎవరో తెలియదు, అయిన ఆదేశము ఏమిటి, ఆయనతో మనకున్న సంబంధం ఏమిటి ... ఈ విషయాలు తెలియవు. ఇది కేవలం భక్తులకు మాత్రమే తెలుసు ఎందుకు భక్తులకు మాత్రమే తెలియజేయబడినది? దానికి కూడా భగవద్గీతాలో సమాధానమివ బడినది. bhaktya mam abhijanati yavan yas casmi tattvatah (BG 18.55). మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే, కృష్ణుడు అంటే ఏమిటి, అప్పుడు మీరు ఈ భక్తి-మార్గాము, లేదా భక్తి ద్వారా వెళ్ళాలి ... ఏ ఇతర మార్గం ద్వార వెళ్లడానికి లేదు. కల్పిత జ్ఞానం, లేదా కల్పిత జ్ఞానము పెంపొందించుకోవటము ద్వారా అయినను తెలుసుకోగలమని కృష్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడు అయిన "జ్ఞానం ద్వారా నన్ను అర్థం చేసుకోవచ్చు." అని చెప్పి వుoడవచ్చు కర్మ ద్వార అర్థం చేసుకోలేరు. లేదా యోగా ద్వార అర్ధము చేసుకోలేరు ఇది శాస్త్రంలో వివిధ ప్రదేశాలలో వివరించబడింది. కేవలం భక్తి. కేవలం భక్తి. ఆధ్యాత్మిక గురువు, లేదా మహాత్ముల బాధ్యత , భక్తి మార్గమును వ్యాప్తి చేయుట . అది చాలా రహస్యమైనది ... ఇది చాలా కరుణ గల మానవతా కార్యక్రమము.

ఎందుకంటే ఈ జ్ఞానం కోసమే ప్రజలు బాధపడుతున్నారు. అందువలన కృష్ణ చైతన్యము ఉద్యమం మాత్రమే - నేను చాలా గర్వంగా ప్రకటిస్తున్నాను- ఇది నిజానికి మానవ సమాజానికి కొంత ప్రయోజనం చేకూరుస్తుంది. ఇ ఉద్యమము మాత్రమే . మిగతావి అన్ని, బోగస్ ఉద్యమములు, నేను ప్రకటిస్తున్నాను. వారిని వచ్చి, శాస్త్రాలను అధ్యయనం చేసి, తమకు తామే నిర్ణయించుకోనివ్వండి. వారు అoదరు మోసం చేస్తున్నారు. ఈ భగవద్-భక్తి మాత్రమే. ఎందుకంటే భగవానుడుని మీరు అర్థం చేసుకోలేరు భగవoతునికి సేవ చేయకుండా . Bhaktya mam abhijanati yavan yas casmi tattvatah (BG 18.55). మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటే, tattvatah ... ప్రతి ఒక్కరు తనని అర్థం చేసుకోవాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు. కృష్ణుడిని పైపైన తీసుకోవడముకాదు, "అయినకు గోపికలంటే చాలా ఇష్టం, మనము శ్రీ కృష్ణుడి లీలను విoద్దాము." ఎందుకు కృష్ణుడి గోపికలతో లీలా? ఎందుకు కృష్ణుడు రాక్షసులను చంపే లీల ఎందుకు వినకుడదు? ప్రజలకు ఆసక్తి లేదు, కృష్ణుడు రాక్షసులను చంపడం గురించి వినడానికి. ఎందుకంటే గోపీకలలీల, అది యువతీ యువకుల మధ్య వ్యవహారముగా కనిపిస్తుంది, ఇది చాలా త్వరగా నచ్చుతుంది. కానీ కృష్ణుడి యొక్క ఇతర కార్యక్రమము ఉంది. Paritranaya sadhunam vinasaya ca duskrtam (BG 4.8). ఇది కూడా కృష్ణుడి యొక్క లీలా. అది కుడా కృష్ణుడి యొక్క లిలా. భగవంతుడు రామచంద్రుడు రావణుడిన్ని చంపినట్లు. ఇది కూడా కృష్ణుడి యొక్క లీలా. భగవంతుడు రామచంద్రుడు యొక్క లీలా కృష్ణుడి లీలా, ఇక్కడ ఉంది ...

మనం కృష్ణుడి యొక్క ఏ లీలనైన మహోన్నతమైనధిగా తీసుకోవాలి. కేవలం చాలా రహస్యమైనది కాదు ... గోపికలతో ఉన్న కృష్ణుడి లీలా, వృందావన-లీలా, అత్యంత రహస్యమైన లీలా. మనము స్వేచ్చను పొందకపోతే మనం ఈ రహస్యమైన లీలను ప్రోత్సహించాకుడదు. ఇది చాలా కష్టమైన విషయము. వారికి కృష్ణుడి యొక్క లీలా అంటే ఏమిటో తెలుసుకొకపోవటము వలన, వారు అనుకరిస్తారు, వారు పతనమవ్వుతారు. చాలా విషయాలు ఉన్నాయి. మనము చర్చించడానికి ఇష్టపడము. కానీ మనము . మనము కృష్ణ-లీలాలో సీరియస్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనము మొదట కృష్ణుడిని తెలుసుకోవాలి, అయిన ఏమి కోరుకుoటున్నారు, మనము ఎలా ప్రవర్తించాలి తెలుసుకోవాలి. అప్పుడు మనము కృష్ణుడి యొక్క రహస్యమైన లీలలోకి ప్రవేశించవచ్చు. లేకపోతే మనము తప్పుగా అర్థం చేసుకుంటాము పతనము అవుతాము.