TE/Prabhupada 0216 - కృష్ణుడు మొదటి-తరగతి వాడు, అతని భక్తులు కూడా మొదటి-తరగతి వారే



Lecture on SB 1.7.47-48 -- Vrndavana, October 6, 1976


ఇది వైష్ణవుని వైఖరి. Para-duḥkha-duḥkhī. Vaiṣṇava is para-duḥkha-duḥkhī. ఇది వైష్ణవుని యొక్క అర్హత. అతను తన వ్యక్తిగత దుస్తితి మీద శ్రద్ధ చూపడు. కానీ ఇతరులు దుఖిస్తున్నప్పుడు వైష్ణవుడు బాధపడతాడు. అది వైష్ణవుడు. ప్రహ్లాద మహారాజు అన్నాడు,

naivodvije para duratyaya-vaitaraṇyās
tvad-vīrya-gāyana-mahāmrta-magna-cittaḥ
śoce tato vimukha-cetasa indriyārtha-
māyā-sukhāya bharam udvahato vimūḍhān
( SB 7.9.43)

ప్రహ్లాద మహారాజు తన తండ్రిచే చాలా హింసింప పడ్డాడు, మరియూ అతని తండ్రి చంపబడ్డాడు. అయినా, తనకు భగవంతుని ద్వారా వరాలు ఇవ్వబడినప్పుడు, అతను అంగీకరించలేదు. అతను చెప్పాడు, sa vai vaṇik. నా స్వామీ, మేము రాజో- గుణ, తమో-గుణముల యొక్క కుటుంబములో పుట్టాము. రజో-గుణ, తమో-గుణ. అసురులు, వారు రెండు తక్కువ లక్షణాలైన రజో-గుణము తామో-గుణముల చేత ప్రభావితమవుతారు. మరియూ ఎవరైతే దేవతలో, వారు సత్వ గుణముచే ప్రభావితమవుతారు.

భౌతిక ప్రపంచంలో మూడు గుణములు, లక్షణములు ఉన్నాయి. Sattva-guṇa... Tri-guṇamayī. Daivī hy eṣā guṇamayī ( BG 7.14) Guṇamayī, triguṇamayī. ఈ భౌతిక ప్రపంచంలో, సత్వ గుణము, రజో గుణము, తమో గుణము. కాబట్టి సత్వ-గుణముచే ఎవరైతే ప్రభావితం అవుతారో, వారు మొదటి తరగతి వారు. మొదటి-తరగతి అంటే ఈ భౌతిక ప్రపంచంలో మొదటి-తరగతి. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాదు. ఆధ్యాత్మిక ప్రపంచం భిన్నమైనది. అది గుణము లేనిది, భౌతిక లక్షణాలు వుండవు. మొదటి-తరగతి, రెండవ-తరగతి, మూడవ-తరగతి వుండవు. అందరూ మొదటి-తరగతి వారే. అది సంపూర్ణమైనది. కృష్ణుడు మొదటి-తరగతి వాడు, అతని భక్తులు కూడా మొదటి-తరగతి వారే. చెట్లు మొదటి-తరగతివి, పక్షులు మొదటి-తరగతివి, ఆవులు మొదటి-తరగతివి, దూడలు మొదటి-తరగతివి. అందువలన అది సంపూర్ణమని పిలువబడుతుంది. ద్వంద్వాత్మకము, రెండవ-తరగతి, మూడవ-తరగతి, నాల్గవ తరగతి అనే భావన వుండదు. వుండదు. అంతా మొదటి-తరగతే. Ānanda-cinmaya-rasa-pratibhāvitābhiḥ (Bs. 5.37). అంతా ānanda-cinmaya-rasa యొక్క మేళనము. వర్గీకరణ లేదు. ప్రతి వారు దాస్య-రసములో వుంటారు లేదా సాఖ్య-రసములో వుంటారు, లేదా వాత్సల్య-రసము లేదా మాధుర్య-రసము , అవి అన్ని ఒక్కటే, అటువంటి వ్యత్యాసం లేదు. కానీ వివిధ రకములు ఉంటవి. మీరు ఈ భావనని ఇష్టపడతారు, నేను ఈ భావనని ఇష్టపడతాను, అది అనుమతింప బడుతుంది.

ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, వారు మూడు రసముల చేత ప్రభావింప బడుతున్నారు. ప్రహ్లాద మహారాజు, హిరణ్యకశిపుని కుమారుడు అవుట చేత అతను "నేను రజో-గుణము మరియూ తమో-గుణముల చేత ప్రభావితం చేయబడ్డాను" అని భావించాడు. అతడు వైష్ణవుడు, అతను అన్ని గుణాలకు అతీతముగా ఉంటాడు, కానీ వైష్ణవుడుు తన గుణాల్ని గురించి ఎన్నడూ గర్వించడు. వాస్తవమునకు, అతను అలాంటి అనుభూతి పొందడు, అనగా నేను చాలా అధునాతనమైనవాడిని, నేను చాలా జ్ఞానోదయం కలిగి ఉన్నాను అని. అతను ఎప్పుడూ అనుకుంటాడు, "నేను అత్యంత అల్పుడను" అని.

Tṛṇād api sunīcena taror api sahiṣṇunā
amāninā mānadena
kīrtanīyaḥ sadā hariḥ
( CC ఆది 17.31)

ఇది వైష్ణవుడు.