TE/Prabhupada 0230 - వేద నాగరికత ప్రకారము సమాజములో నాలుగు విభాగాలు ఉన్నాయి



Lecture on BG 2.1-5 -- Germany, June 16, 1974

ఇది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కృష్ణుడి మధ్య జరిగిన చర్చ. చర్చవిషయము ఏమిటంటే, యుద్ధం ప్రకటించినప్పటికీ, అర్జునుడు, " ఎదుటి పక్షమున నా బంధువులు ఉన్నారు," అయిన వారిని ఎలా చంపుతాడు? కృష్ణుడు సలహా ఇచ్చాడు: "ప్రతి ఒక్కరూ తనకు ఇవ్వబడిన విధిని అమలు చేయాలి వ్యక్తిగత నష్టం లేదా లాభం పరిశీలన లేకుండా. " వేద నాగరికత ప్రకారం, సమాజంలోని నాలుగు విభాగాలు ఉన్నాయి. అన్ని చోట్లా అవే విభాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇది చాలా సహజమైనది. మన శరీరo నుoడి మనo అధ్యయనo చేస్తుoడగా, తల ఉoది, చేయి ఉoది, కడుపు ఉoది, మరియు కాలు ఉంది అదేవిధంగా, సమాజంలో మెదడుగా భావించబడే వ్యక్తుల తరగతి ఉండాలి, సమాజమును ప్రమాదము నుండి కాపాడుకునే వారికి మరొక తరగతి ఉండాలి. మరొక తరగతి వ్యక్తులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి నిపుణులు ఉండాలి ఆవులకు రక్షణ ఇవ్వాలి వాణిజ్యం చేయాలి. ... మిగిలిన తరగతి వ్యక్తులు , వారు మెదడుగా పని చేయలేరు, ప్రమాదంలో నుండి రక్షించే వానిగా పని చేయలేరు, లేదా వారు ఆహార ధాన్యాలు ఉత్పత్తి లేదా ఆవులకు రక్షణ ఇవ్వాడము చేయలేరు, వారిని శూద్రులు అని పిలుస్తారు: మీరు ఆపలేరు, మీ శరీరాన్ని పూర్తి చేయడానికి, మెదడు విభాగం, ఆయుధ విభాగం, కడుపు విభాగం నడిచే లేదా పని చేసే విభాగం. అందువల్ల అర్జునుడు సమాజానికి రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన వ్యక్తుల సమూహానికి చెందినవాడు. అందువల్ల అయిన పోరాడటానికి తిరస్కరించినప్పుడు, అర్జునుడు, అయిన పోరాడటానికి తిరస్కరించినప్పుడు, ఆ సమయంలో కృష్ణుడు అయినకి సలహా ఇచ్చాడు, "పోరాడటాము మీ బాధ్యత." సాధారణంగా చంపడం మంచి పని కాదు, కానీ శత్రువు ఉన్నప్పుడు, దుండగుడు, అప్పుడు దుర్మార్గులను చంపడము పాపం కాదు. కురుక్షేత్ర యుద్ధంలో ఇతర పక్షము, వారు అర్జునుడి పక్షమునకు దుర్మార్గులుగా ఉన్నారు ఇప్పుడు, ఇది భగవద్గీతా యొక్క ఏర్పాటు. ఆధ్యాత్మిక అవగాహన గురించి అర్జునుడికి ఆదేశించుట వాస్తవ ఉద్దేశ్యం. ఆధ్యాత్మిక అవగాహనా అంటే మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడము అని అర్థం. మీకు ఆత్మ అంటే ఏమిటో తెలియకపోతే ఆధ్యాత్మిక అవగాహనా ఎక్కడ ఉంది? ప్రజలు శరీరాము మీద బాగా ప్రేమ కలిగి ఉన్నారు. ఇది భౌతికము. కానీ మీరు ఆత్మను అర్థం చేసుకున్నప్పుడు మీరు దానికి అనుగుణంగా పని చేస్తే, అది ఆధ్యాత్మికం అంటారు. అర్జునుడు ఇతర పక్షముతో పోరాడటానికి సంశయించాడు, ఎందుకంటే అయిన వారితో శారీరక సంబంధం కలిగి ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడికి మధ్య చర్చలు జరిగాయి, కానీ అది స్నేహపూర్వక చర్చ. అందువల్ల ఎప్పుడైతే స్నేహపూర్వక చర్చ కేవలం సమస్యను పరిష్కరించలేదని అర్జునుడు అర్థం చేసుకున్నడో, అయిన శిష్యుడయ్యాడు. అర్జునుడు కృష్ణుడి ఆశ్రయము పొందాడు, śiṣyas te 'ham śādhi māṁ prapannam: (BG 2.7) నా ప్రియమైన కృష్ణ, చాల సేపు మనం స్నేహితుడుగా మాట్లాడు కొంటున్నాము ఇప్పుడు నేను మీ నిత్య శిష్యుడిని అవుతాను. దయచేసి నాకు ఉపదేశము చేసి కాపాడండి. నేను ఏమి చేయాలి? అందువలన, ఈ దశకు వచ్చినప్పుడు, కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా సలహా ఇచ్చాడు: śrī-bhagavān uvāca. ఇప్పుడు, ఇక్కడ చెప్పబడింది ... అర్జునుడుకి ఎవరు చెప్పుతున్నారు? భగవద్గీత రచయిత లేదా చెప్పుతుండంగ వ్రాసిన వ్యక్తా... భగవద్గీత కృష్ణుడిచే చెప్పబడినది. ఇది కృష్ణుడు అర్జునుల మధ్య జరిగిన ఒక చర్చ. ఇది వ్యాసాదేవుడు చేత వ్రాయబడినది, తరువాత అది ఒక పుస్తకం అయ్యింది. మనం మాట్లాడేటప్పుడు అది రికార్డ్ చేయబడుతుంది, తర్వాత అది ఒక పుస్తకంగా ప్రచురించబడుతుంది. అందువలన ఈ పుస్తకంలో ఇది భగవన్ ఉవాచా అని చెప్పబడింది. వ్యాసాదేవుడు రచయిత. అయిన చెప్పడు, "నేను మాట్లాడు చున్నాను." అని అయిన చెప్పాడు, భగవన్ ఉవాచా - దేవాదిదేవుడు చెప్పారు."