TE/Prabhupada 0247 - వాస్తవ ధర్మము అంటే దేవుడిని ప్రేమించటము



Lecture on BG 2.9 -- London, August 15, 1973


భగవద్గీత ముగుస్తుంది: sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఆక్కడ నుండి భాగావతము మొదలవుతుంది. అందువల్ల భగవద్గీత శ్రీమద్-భాగావతం యొక్క ప్రాథమిక అధ్యయనం. భాగావతము మొదలవుతుంది, dharmaḥ projjhita-kaitavaḥ atra: ఇప్పుడు, ఈ శ్రీమద్-భాగావతం లో, అన్ని మోసపూరితమైన ధర్మాలు తిరస్కరించబడ్డాయి projjhita. సంబంధము ఉంది. వాస్తవమైన ధర్మము అంటే దేవుణ్ణి ప్రేమిoచటము. అది వాస్తవమైన ధర్మము. అందువల్ల భాగావతము చెప్పుతున్నది, sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje: ( SB 1.2.6) ఆది మొదటి-తరగతి ధర్మము." ఇది మీరు ఈ ధర్మము లేదా ఆ ధర్మమును అనుసరించమని అర్ధము కాదు. మీరు ఏ మతాన్ని అనుసరిస్తారో, అది పట్టింపు లేదు, హిందూ ధర్మము లేదా క్రిస్టియన్ ధర్మము లేదా మొహమ్మదియన్ ధర్మము, మీకు ఏది ఇష్టం. కానీ మనము పరీక్షించవలసి ఉంటుంది. M.A పరీక్ష ఉతిర్నుడైన అయిన విద్యార్ధి వలె. ఎవరూ విచారించరు, "ఏ కళాశాల నుండి మీరు మీ పరీక్షను ఉతిర్నులయ్యారు? మీరు ఎమ్.ఎ పరీక్ష ఉతీర్నులు అయ్యరా? పర్వాలేదు." మీరు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అని, ఆలోచిస్తున్నాను. అంతే. ఎవరూ విచారిoచరు, "ఏ కళాశాల నుండి, ఏ దేశం నుండి, ఎ ధర్మము నుండి, మీరు మీ M.A పరీక్ష ఉతిర్నులయ్యారు?" కాదు అదేవిధంగా, ఎవరూ విచారణ చేయారు, "మీరు ఏ ధర్మమునకు చెందినవారు? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారో, ఈ కళను నేర్చుకున్నారా అనే విషయాన్ని తప్పక చూడాలి. అంతే. అది ధర్మము. ఎందుకంటే ధర్మము ఇక్కడ ఉంది: sarva-dharmān parityajya māṁ ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) . ఇది ధర్మము. భాగవతము చెప్పుతుంది. Dharmaḥ projjhita-kaitavaḥ atra: "అన్ని మోసపూరితమైన ధర్మములను ఈ భాగవతము తరిమేస్తుంది." కేవలం nirmatsarāṇām, దేవుడు అంటే అసూయపడని వారు ... నేను ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తాను? నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తాను? నేను ఎందుకు దేవుణ్ణి అంగీకరించాలి? వారు ఆoదరు రాక్షసులు. వారి కోసం మాత్రమే, శ్రీమద్-భాగావతం, వారికి మాత్రమే ఎవరైతే వాస్తవాన్ని తీవ్రముగా ప్రేమిస్తారో వారికీ మాత్రమే. Ahaitukī apratihatā yenātmā samprasīdati.

జీవితము యొక్క వాస్తవ విజయము ఏమిటంటే మీరు దేవుడిని ఎలా ప్రేమించాలో తెలుసుకున్నప్పుడు? అప్పుడు మీ హృదయం సంతృప్తి చెందుతుంది. Yaṁ labdhvā cāparaṁ lābhaṁ manyate nādhikaṁ tataḥ. మీరు కృష్ణుడు లేదా దేవుడిని కలిగి ఉంటే ... కృష్ణుడు అంటే దేవుడు. మీరు వేరే దేవుడి పేరును కలిగి ఉంటే, అది కూడా అంగీకరించబడుతుంది. కాని దేవుడు, దేవాదిదేవుడు, మహోన్నతమైన వ్యక్తి మీ దగ్గర ఇది ఉనప్పుడు ... మనం ఎవరినైన ప్రేమిoచినప్పుడు. ప్రేమపూర్వక ప్రవృత్తి ఉంది. అందరిలో. కానీ అది తప్పు దారిలో ఉన్నది. అందువల్ల కృష్ణుడు ఇలా అంటాడు, "ఈ ప్రేమoచే వస్తువులను తొలగించoడి, నన్ను ప్రేమించుటకు ప్రయత్నించండి." Sarva-dharmān parityajya mām ekam ( BG 18.66) ఈ విధంగా మీ ప్రేమ ఎన్నటికీ మీకు సంతృప్తిని ఇవ్వదు Yenātmā samprasīdati. మీకు వాస్తవమైన సంతృప్తి కావాలంటే, మీరు కృష్ణుడు లేదా దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొత్తం తత్వము ..., వేదముల తత్వము. లేదా ఏ తత్వాన్ని అయిన మీరు తీసుకోండి. అయితే, మీకు సంతృప్తి కావాలి, మీ మనస్సుకు పూర్తి సంతృప్తి కావాలి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రమే అది సాధించవచ్చు. అందువల్ల ఆ ధర్మము మొదటి తరగతిది ఏదైతే బోధిస్తుందో, దేవుడుని ప్రేమిoచటానికి వ్యక్తికి శిక్షణ ఇస్తుంది. ఇది మొదటి తరగతి ధర్మము.

Sa vai puṁsāṁ paro dharmo yato bhaktiḥ... ( SB 1.2.6) ఆ ప్రేమలో ఎటువంటి ఉద్దేశ్యం ఉండకుడదు. ఈ భౌతిక ప్రపంచంలో, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు." నేపధ్యం ఎదో ఒక ఉద్దేశ్యం. Ahaituky apratihatā. Ahaitukī, no motive. Anyābhīlāṣitā-śūnyam [Bhakti-rasāmṛta-sindhu 1.1.11]. అన్ని ఇతర కోరికలు సున్నా చేస్తారు. సున్నా. ఇది భగవద్గీతలో బోధించబడుతుంది.