TE/Prabhupada 0268 - కృష్ణుడికి పవిత్రమైన భక్తుడు కాకుండా కృష్ణుడిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు



Lecture on BG 2.10 -- London, August 16, 1973


ఇది కొంచము కష్టము. కృష్ణుడికి పవిత్రమైన భక్తుడు కాకుండా కృష్ణుడిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కృష్ణుడు చెప్పుతాడు, bhaktyā mām abhijānāti yāvān yas cāsmi tattvataḥ ( BG 18.55) తత్వాతా, నిజం. తత్వాతా అంటే నిజం. ఎవరు అయిన కృష్ణుడిని అర్థం చేసుకోవాలనుకుంటే, అయిన భక్తియుక్త సేవ పద్దతిని తీసుకోవాలి, భక్తా భక్తి. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170) హృషికేశుని యొక్క సేవకునిగా పనిచేస్తునప్పుడు, ఇంద్రియాల యొక్క గురువు. గురువు, హ్రుషికేసేన, మీ ఇంద్రియాలను కూడా ఇంద్రియాల గురువు సేవలో వినియోగించినప్పుడు, అప్పుడు మీరు ఇంద్రియాలకు గురువు అవ్వుతారు. మీరు కూడా. ఎందుకంటే మీ ఇంద్రియాలను హృషికేశుని యొక్క సేవలో వినియోగించినప్పుడు , ఇంద్రియాలకు ఎటువంటి అవకాశాము లేదు. ముసివేయ బడతాయి. Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ ( SB 9.4.18) ఇది భక్తియుక్త సేవా పద్ధతి. మీరు ఇంద్రియాలకు గురువు అవ్వాలంటే, గోస్వామి, స్వామి, అప్పుడు మీరు ఎల్లప్పుడూ మీ ఇంద్రియాలను హృషికేశుని సేవలో నిమగ్నము చెయ్యాలి. అది మాత్రమే మార్గం. లేకపోతే ఇది సాధ్యం కాదు. మీరు మీ ఇంద్రియాలను, ఇంద్రియాల గురువు యొక్క సేవ లో నిమగ్నం చేయుటలో కొద్దిగా సడలింపు ఇస్తే వెంటనే మాయ ఉంది, దయచేసి రండి." ఇది పద్ధతి. Kṛṣṇa bhuliyā jīva bhoga vāñchā kare, pāsate māyā tāre jāpaṭiyā dhare. మీరు కృష్ణుడిని మరచిపోయిన వెంటనే, ఒక క్షణం కూడా, వెంటనే మాయా ఉంది: దయచేసి, నా ప్రియమైన స్నేహితుడా, ఇక్కడికి రండి. మనము చాలా జాగ్రత్త వహించాలి. ఒక క్షణాము కూడ కృష్ణుడిని మనము మరచిపోకూడదు. అందుచేత జపము,కీర్తన కార్యక్రమం, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామా, హరే రామా, రమా ... ఎల్లప్పుడూ కృష్ణుడిని గుర్తుంచుకోవాలి. అప్పుడు మాయ మీమ్మల్ని తాకదు Mām eva ye prapadyante māyām etān taranti. మాయ తాకలేదు. హరిదాసా ఠాకురా లాగానే. అయిన హృషికేశుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాడు. మాయ పూర్తి స్థాయి బలముతో వచ్చింది. అయినప్పటికీ, ఆమె ఓడిపోయింది; హరిదాసా ఠాకురా ఓడిపోలేదు.