TE/Prabhupada 0291 - నేను సేవకునిగా ఉండాలని కోరుకోవటములేదు,సేవకుడిని అనుకోవడము లేదు. ఇది మీ వ్యాధి



Lecture -- Seattle, September 30, 1968


ప్రభుపాద: చెప్పండి?

యువకుడు: మీరు మళ్ళీ సేవాతత్వము గురించి వివరించగలరా?

తమాల కృష్ణ : మళ్ళీ సేవాతత్వమును వివరించండి.

ప్రభుపాద: సేవాతత్వము, ఇది చాలా సులభం. మీరు సేవకులుగా ఉన్నారు. మీరు సేవకులు ఆని అర్థం చేసుకోలేరా? ఇది చాలా కష్టమా? మీరు ఒకరికి సేవకులు కాదా?

యువకుడు: సరే, అవ్వును నేను అనుకున్నాను మీరు చెప్పుతారు అవ్వును అని.

ప్రభుపాద: చెప్పండి నువ్వు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ. ప్రతి ఒక్కరూ సేవకులుగా ఉన్నారు.

యువకుడు: అంటే, ఒక ఆధ్యాత్మిక భావనలో, నేను సేవకుడు అని భావించడము లేదు ...

ప్రభుపాద: ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో మొదటగా అర్థం చేసుకోండి ... ఆధ్యాత్మిక భావంలో కూడ మీరు సేవకులుగా ఉంటారు. ఎందుకంటే మీ స్వభావం సేవకుడు ఆధ్యాత్మికం, మీరు ఆధ్యాత్మికం బౌతికము అంటే ఏమిటి?

యువకుడు: నా శరీరం ఒక ప్రత్యేక ప్రదేశములో సమయం లో ఉంది ఇవి అన్ని నాకు ఉద్యోగం ఉంటే అప్పుడు నేను నా యజమానికి సేవకుడిగా ఉన్నాను, కానీ వాస్తవముగా నేను నా యజమానికి నేను సేవకునిగా ఉన్నానని నేను అనుకోను. నేను అయిన ఎంతోకొంత సమానంగా ఉన్నాము. తాత్కాలిక భావనలో ...

ప్రభుపాద: చెప్పండి ఈ చైతన్యము చాలా బాగుంది, మీరు మీ యజమానికి సేవకునిగా ఉండటానికి మీరు అసంతృప్తిగా ఉన్నారు. అవునా కాదా?

యువకుడు: లేదు, ఇది సరైనది కాదు.

ప్రభుపాద: అప్పుడు?

యువకుడు: నేను ప్రత్యేకముగా కాదు ...

ప్రభుపాద: ఎవరైనా.

యువకుడు: నేను భావించడం లేదు ... ఈ ప్రత్యేకమైన సంఘటన గురించి చెప్పుతాను, ఈ వ్యక్తి నా పై అధికారిగా ఉన్నాడని నేను అసూయను చెందటము వాస్తావము కాకపోవచ్చు. కానీ మనం మనుష్యులందరము కొంచము తేడాతో సమానంగా ఉన్నాము. నా ఉద్దేశ్యం, మీకు తెలుసు, ఇది ఒక్క రకమైన తత్వము నా దగ్గర ఉన్నది. నేను ఎవరికి సేవకునిగా ఉండాలని నేను భావిoచడము లేదు. నాకు ఎవరు సేవకులుగా ఉండాలని నేను భావిoచడము లేదు.

ప్రభుపాద: ఎందుకు? ఎందుకు? ఎందుకు సేవకులుగా ఉండకుడదు? ఎందుకు?

యువకుడు: నేను అయినకి ఏదైనా రుణపడి ఉన్నానని లేదా అయిన నాకు ఏదైనా రుణపడి ఉన్నాడు అని నేను అనుకోవడం లేదు.

ప్రభుపాద: అది వ్యాధి. మనము బలవంతముగా సేవకునిగా ఉండ వలసి ఉంటుంది "నాకు సేవకునిగా ఉండటము ఇష్టం లేదు" అని అనుకుంటున్నాను. ఇది వ్యాధి.

యువకుడు: అయిన సేవకునిగా ఉండమని బలవంతము చేయలేదు.

ప్రభుపాద: అవ్వును.

యువకుడు: అయిన నన్ను ఏమైన సేవ చేయడానికి బలవంతం చేయలేదు. నేను అక్కడ ఉన్నాను. అతడు అక్కడ ఉన్నాడు.

ప్రభుపాద: లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచి ప్రశ్న. మీరు చెప్తారు "నాకు సేవకునిగా ఉండటము ఇష్టము లేదు" అని . అవునా కాదా?

యువకుడు: ఇది ప్రాథమికంగా నిజం, అవ్వును

ప్రభుపాద: అవ్వును ఎందుకు?

యువకుడు: నేను తక్కువగా ఉన్నాను అని నేను అనుకోవడము లేదు....

ప్రభుపాద: ఇది వ్యాధి. మీరు మీ సోంత వ్యాధిని నిర్ధారణ చేసుకున్నారు. ఇది భౌతికవాదం యొక్క వ్యాధి. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు "నేను యజమాని కావాలని కోరుకుంటున్నాను, నేను సేవకునిగా ఉండాలని అనుకోవడము లేదు." ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు మీరే మాత్రమే కాదు. కేవలము ప్రయత్నించండి, నన్ను పూర్తి చెయ్యనివ్వండి. ఇది వ్యాధి, బౌతిక వ్యాధి. మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ వ్యాధి లేదా నా వ్యాధి కాదు. ఇది ప్రతి ఒక్కరి వ్యాధి ఈ విధంగా ఉంది, "నేను ఎందుకు సేవకునిగా ఉండాలి? నేను ఎందుకు సేవకునిగా ఉండాలి? " కానీ ప్రకృతి నన్ను సేవకునిగా ఉండడానికి బలవంతము చేస్తుంది. ఇప్పుడు ఎవరు మరణమును కలవాలనుకుంటున్నారు? ఎందుకు ప్రజలు మరణిస్తున్నారు? మీరు దీనికి సమాధానమివ్వాగలరా?

యువకుడు: ఎందుకు మరణిస్తున్నారు?

ప్రభుపాద: చెప్పండి ఎవరూ చనిపోవాలని కోరుకోరు.

యువకుడు: నేను ఒక జీవశాస్త్ర పరముగా భావించాను ...

ప్రభుపాద: అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఎవరు ఉన్నారు ... అంటే జీవ శక్తి ఉన్నది. మీరు జీవశాస్త్రానికి సేవకునిగా ఉన్నారు. అప్పుడు మీరు స్వతంత్రులు అని ఎందుకు చెప్తారు?

యువకుడు: సరే, నేను భావిస్తున్నాను నేను ఉన్నాను ...

ప్రభుపాద: మీరు తప్పుగా భావిస్తున్నారు. అది నా అభిప్రాయం. అది మీ వ్యాధి.

యువకుడు: నేను ఒంటరిగా ఉన్నానని భావిస్తున్నానా?.

ప్రభుపాద: చెప్పండి తప్పుగా.

యువకుడు: తప్పుగా?

ప్రభుపాద: అవ్వును. మీరు సేవకునిగా ఉన్నారు. మీరు తప్పకుండా సేవకునిగా ఉండాలి. మరణం ఉన్నప్పుడు, మీరు చెప్పలేరు, ", నేను నీ మాటను వినను." అందువలన మీరు సేవకులు.

యువకుడు: నేను దేవుడుకి సేవకునిగా ఉన్నాను, అవ్వును

ప్రభుపాద: లేదు, లేదు, ... దేవుణ్ణి మర్చిపోవద్దు. ఇప్పుడే మనం లోక జ్ఞానముతో మాట్లాడుతున్నాము.

యువకుడు: కృష్ణుడు ... నేను పోను ...

ప్రభుపాద: లేదు కృష్ణుడిని గురించి మాట్లాడ వద్దు. అది చాలా దూరంలో ఉంది. మీరు చనిపోవాలని కోరుకోవద్దు, మీరు బలవంతముగా ఎందుకు మరణిస్తారు? అర్ధము చేసుకోవడానికి ప్రయత్నించండి

యువకుడు: నేను ఎందుకు బలవంతముగా మరణిస్తాను?

ప్రభుపాద: చెప్పండి మీరు సేవకులుగా ఉoడటము వలన.

యువకుడు, చెప్పండి

ప్రభుపాద: చెప్పండి అప్పుడు మీరు మీ స్థానాన్ని అర్థం చేసుకోండి, మీరు సేవకులుగా ఉన్నారు. నేను స్వేచ్ఛగా ఉన్నాను నేను సేవకుడిని కాదు అని మీరు ప్రకటించలేరు. మీరు ఆశిస్తున్నట్లయితే "నేను సేవకునిగా ఉండాలని కోరుకోవటములేదు, సేవకుడిని అనుకోవడము లేదు", ఇది మీ వ్యాధి.

యువకుడు: మీరు నన్ను ఏమి చేయాలని కోరుకుంటున్నారు ... ఏమిచేయాలని ...

ప్రభుపాద: లేదు, మొదట మీ వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మేము నీకు ఔషధం నిర్థారణ చేస్తాము.

యువకుడు: నేను తప్పుగా భావిస్తున్నాను , సరే, కానీ నేను ఎవరికీ లేదా దేనికైనా ... సరిగ్గా దేనికి నేను సేవకునిగా ఉండాలి, నా ఉద్దేశ్యం ...

ప్రభుపాద: మీరు ప్రతి ఒక్కరికి సేవకునిగా ఉన్నారు . మీరు చనిపోతున్నారు, మీరు వ్యాధికి గురి అవ్వుతున్నారు. , మీరు ముసలివారు అవ్వుతున్నారు. మీరు ఎన్నో విషయాలకు సేవకునిగా ఉన్నారు. మీరు బలవంతంగా. ఇప్పటికీ మీరు ఆలోచిస్తున్నారు "నేను సేవకునిగా ఉండను. నాకు ఇష్టం లేదు" . ఎందుకంటే మీరు "నాకు ఇష్టం లేదు" అని చెప్తున్నారు, అందువల్ల మీరు బలవంతం చెయ్యబడుతున్నారు. మీరు సేవకునిగా ఉండాలి. ఎందుకు మీరు మీ స్థానాన్ని మర్చిపోయారు? ఇది మన వ్యాధి. తదుపరి పద్ధతి "నేను బలవంతంగా సేవకునిగా ఉండవలసి ఉన్నది ." ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్నాము? "నేను సంతోషంగా ఎక్కడ ఉంటాను సేవకునిగా ఉండటము ద్వార?" ఇది కృష్ణుడు. మీరు సేవకునిగా ఉండటము నిలిపివేయబడదు ఎందుకంటే మీరు దాని కోసం ఉద్దేశించ బడినవారు. కృష్ణుడు, కృష్ణుడి ప్రతినిధికి మీరు సేవకునిగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. దీనిని పరీక్షించండి. మీరుసేవకునిగా ఉండాలి. మీరు కృష్ణుడికి అయిన ప్రతినిధికి సేవకునిగా ఉండకపోతే, అప్పుడు మీరు బలవంతముగా , వేరే దానికి , మాయకు సేవకులుగా ఉంటారు. ఇది మీ పరిస్థితి. మీరు ఎప్పుడు స్వేచ్చగా ఉండలేరు. కానీ మీరు ఆనుకుంటారు ... ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు ఇరవై నాలుగు గంటలు సేవకుడిగా ఉంటాడు. వాడు సంతోషంగా ఉoటాడు. అయిన సంతోషంగా ఉoటాడు. తల్లి చెప్తూoది, "నా ప్రియమైన పుత్రుడా, దయచేసి ఇక్కడకు రా. క్రింద కూర్చో. " అయిన సంతోషంగా ఉoటాడు. ఇది స్వభావం. కేవలము మీరు ఎక్కడ సేవకునిగా ఉండాలో తెలుసుకోoడి. అంతే, ఆది కృష్ణుడు. మీరు సేవకునిగా ఉండటాన్ని ఆపలేరు, కానీ మీరు ఎక్కడ సేవకుడిగా ఉండాలో తెలుసుకోవలసి ఉంటుంది మీరు కృతిమముగా "నేను ఎవరికీ సేవకునిగా ఉండను, నేను స్వతంత్రుడను" అని అనుకుంటే, మీరు బాధపడతారు. కేవలము మీరు సరియిన స్థానమును తెలుసుకోవాలి మీరు ఎక్కడ సేవకునిగా ఉండాలో. అoతే సరే. జపము చేయండి.