TE/Prabhupada 0306 - మనము మన సందేహాస్పద ప్రశ్నలను ఆడగాలి



Lecture -- Seattle, October 2, 1968


ప్రభుపాద: ఏమైన ప్రశ్నలు ఉన్నాయా? మొదట ప్రేక్షకుల నుండి . ప్రశ్నలను మీరు ఆడగoడి, మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు, ప్రకటనల గురించి, మీరు విచారణ చేయవచ్చు. Tad viddhi praṇipātena paripraśnena sevayā ( BG 4.34) అంతా, మీరు అర్థం చేసుకునేందుకు తీవ్రముగా ఉంటే, మనము మన సందేహాస్పద ప్రశ్నలను ఆడగాలి, అర్థం చేసుకోవాలి. మీరు చూడoడి. అవును?

యువకుడు: మాటలకు అతీతమైన చైతన్యాన్ని పొందగలమా? లేదా, నేను చెప్పేది, ఏదైనా వర్తమానం అది మాటలు కాకుండా తరంగముల రుపములో ఉంటుందా, ఆది ధ్వని లేదా ధ్వని లాగానే ఉంటుందా? బహుశా ఓo కోసం చేరే దానికి. ఏదైనా వర్తమానము ఉంటుందా, మీకు నాకు మధ్య , నాతో నా సోదరుడు, ఇతరులు, మనము అoదరము? ఎక్కడైనా అనుభవము ఉoదా బహుశా మనము ఎక్కడైనా? ఇది "డాంగ్," "ఆంగ్" లాగా ధ్వనిస్తుందా. మాటలు కాకుండా ఏమైనా ఉంటుందా? మాటా?

ప్రభుపాద: అవును, ఈ హరే కృష్ణ మంత్రము.

యువకుడు: హరే కృష్ణ మంత్రము.

ప్రభుపాద: అవును.

యువకుడు: మీరు వివరిస్తారా? ఇది ఎలా ఉంటుందో మీరు నాకు చెప్పగలరా? ఎలా అన్ని సమయములలో ఉంటుంది? ఒక వ్యక్తిగా కాకుండా లేదా ఇతర భాషలను, ఆంగ్లంలో మాట్లాడటమే కాకుండా? ఆ ఒక భాషను మాట్లాడటం ఎలా?

ప్రభుపాద: బాగా, ధ్వనిని ఏ భాషలో నైనా చెప్పవచ్చు. హరే కృష్ణ మంత్రమును సంస్కృతంలో మాత్రమే పలుకమని కాదు. మీరు ఇంగ్లీష్ ధ్వనిలో కూడా శబ్దం చేయవచ్చు: "హరే కృష్ణ." ఏదైనా కష్టాము ఉన్నాదా? ఈ అబ్బాయిలు, వారు కూడా హరే కృష్ణ మంత్రమును జపము చేస్తున్నారు. ఇబ్బంది లేదు. ఇది ధ్వని. ఇది ఎవరు ధ్వని చేస్తున్నారు అని పట్టింపు లేదు. పియానోలో లాగానే మీరు పట్టుకుoటే, "టంగ్" ఆoటుoది. ఒక అమెరికన్ తాకిన్నాడా లేదా ఇండియన్ తాకిన్నాడా అని పట్టింపు లేదు లేదా ఒక హిందూ తాకిన్నాడా లేదా ముస్లిం తాకిన్నాడా అని, ధ్వని ధ్వనిగా ఉంటుంది. అదేవిధంగా, ఈ పియానో, హరే కృష్ణ, మీరు దానిని తాకితే అది ధ్వనిస్తుంది. అంతే. అవును?

యువకుడు (2): మీరు కూర్చుని ఒంటరిగా ధ్యానం చేస్తారా? మీ మనసు ఆలోచిస్తుంటే మీరు ఏమి చేస్తారు? మీరు దేని గురించి అయిన ఆలోచిస్తారా? మీరు దానిని దేని మీద అయిన ఉంచుతారా లేదా దానిని అదే ఆలోచించేటట్లు వదిలి వేస్తారా?

ప్రభుపాద: మొదట మీరు ధ్యానం అంటే అర్ధము చేసుకోండి?

యువకుడు (2): నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చుని ఉండటము.

ప్రభుపాద: ఏమిటి? తమలా కృష్ణ: నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చోని ఉండటము.

ప్రభుపాద: ఒంటరిగా కూర్చోవడం. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమని మీరు అనుకుంటున్నారా?

యువకుడు (2): మీరు మీ స్వంత మనస్సును విoటే.

ప్రభుపాద: అప్పుడు మనసు ఎల్లప్పుడూ ఆలోచన చేస్తోంది.

యువకుడు (2): ఆది ఆలోచిస్తూనే ఉంటుంది.

ప్రభుపాద: మీరు ఎలా కూర్చుంటారు, మౌనంగా ఉంటారు? మనస్సు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటుoది. మీరు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నప్పుడు మనస్సు ఆలోచన చేయకుండా ఉన్నా అనుభవం మీకు ఉన్నదా? మీరు నిద్రపోతున్నప్పుడు, మనస్సు ఆలోచన చేస్తుంది. మీరు కలలు కoటారు. ఇది మనస్సు యొక్క పని. మీ మనసు మౌనంగా ఉందని మీరు ఎప్పుడు కనుగొంటారు?

యువకుడు (2): ఇది నేను మిమ్మల్ని అడగడానికి ప్రయత్నిస్తున్నను.

ప్రభుపాద: అవును. మనస్సు ఎప్పుడూ మౌనంగా ఉoడదు. మీరు ఏదో ఒక్క దానిపై మీ మనస్సును నిమగ్నం చేయాలి. ఇది ధ్యానం.

యువకుడు (2): మీరు ఏమి నిమగ్నము చేస్తారు?

ప్రభుపాద: అవును. ఆది కృష్ణుడు. మన మనస్సును కృష్ణుడి మీద, భగవంతుడు , అందమైన దేవాదిదేవుడి మీద లగ్నము చేస్తాము ఉదాహరణకు మనస్సును లగ్నము చేయడమే కాదు, కానీ మనస్సును ఇంద్రియాలతో పని చేసేటట్లు ఉంచుతాము ఎందుకంటే మన మన ఇంద్రియాలతో మనస్సు పనిచేస్తోంది.