TE/Prabhupada 0307 - మనస్సు కృష్ణుడి మీద ఆలోచించడమే కాకుండా, కృష్ణుడి కోసం అనుభూతి చెందాలి, పని చేయాలి



Lecture -- Seattle, October 2, 1968

ప్రభుపాద: మీ మనసు, "మనము నూతనంగా ప్రారంభించిన ISKCON సొసైటీకి వెళ్దాము" మీ కాళ్ళు ఇక్కడకు తీసుకువచ్చాయి. కావునా మనస్సు ... ఆలోచించడం, అనుభూతి చెందడము, కోరిక కలిగి ఉండటము, ఇవి మనస్సు యొక్క విధులు. మనస్సు ఆలోచిస్తుంది, అనుభవిస్తుంది, అది పనిచేస్తుంది. మీరు మీ మనస్సును కృష్ణుడిని గురించి మాత్రమే ఆలోచిoచటమే కాకుండా, కానీ కృష్ణుడి కోసం అనుభూతి పొందటానికి, కృష్ణుడికి కృషి చేయడానికి. ఇది పూర్తి ధ్యానం. అది సమాధి అని పిలుస్తారు. మీ మనస్సు బయటకు పోరాదు. మీ మనస్సును కృష్ణుడి గురించి ఆలోచించేటట్లు మీరు నిమగ్నము చేయాలి, కృష్ణుడి కోసము అనుభూతి చెందండి, కృష్ణుడి కోసం పని చేయండి. ఇది పూర్తి ధ్యానం.

యువకుడు: మీ కళ్ళతో ఏం చేస్తారు? కళ్లు మూసుకోవటామా?

ప్రభుపాద: అవును, కళ్ళు ఇంద్రియాలలో ఒకటి. మనసు సాదారణమైన ఇంద్రియము, గవర్నర్ జనరల్ క్రింద, ప్రత్యేక కమిషనర్లు లేదా సేవక అధికారులు ఉన్నారు. కళ్ళు, చేయి, కాలు, నాలుక, పది ఇంద్రియాలు, వారు మనస్సు యొక్క ఆధీనములో పని చేస్తున్నారు. మనస్సు వ్యక్తం చేస్తుంది, ఇంద్రియాలా ద్వారా వ్యక్తం చేస్తుంది. మీ మనసు ఆలోచిస్తున్నట్లు, అనుభూతి చెందుతున్నట్లు, మీరు ఇంద్రియాలను లగ్నము చేస్తే తప్ప పరిపూర్ణత లేదు. కలతలు ఉంటాయి. మీ మనస్సు కృష్ణుడిని గురించి ఆలోచిస్తే మీ కళ్ళు వేరొకటి చూస్తుంటే, అంతరాయం లేదా విరుద్ధము ఉంటుంది. అందువల్ల ... మీరు మొదట కృష్ణుడిని మీద మీ మనసును ఉంచాలి, అన్ని ఇతర ఇంద్రియాలు కృష్ణుడి సేవలో వినియోగించ బడుతాయి. అది భక్తి.

sarvopādhi-vinirmuktaṁ
tat-paratvena nirmalam
hṛṣīkeṇa hṛṣīkeśa-
sevanaṁ bhaktir ucyate
(CC Madhya 19.170)

హృషిక, హృషిక అంటే ఇంద్రియాలు. మీరు ఇంద్రియలా గురువు యొక్క సేవలో మీ ఇంద్రియాలను నిమగ్నం చేసినప్పుడు ... కృష్ణుడు హ్రుషికేసా అని పిలుస్తారు, లేదా ఇంద్రియాల యజమాని ఇంద్రియాలకు యజమాని అని అర్థం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఈ చేయి. చేయి చాలా చక్కగా పనిచేస్తుంది, కానీ చేతికి పక్షవాతం వస్తే లేదా కృష్ణుడు శక్తిని ఉపసంహరించుకుంటే, అప్పుడు నీ చేయి నిరుపయోగం. మీరు దీన్ని పునరుద్ధరించలేరు. నీవు నీ చేతి యొక్క యజమాని కాదు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు "నేను నా చేతి యొక్క యజమాని అని ." కానీ నిజానికి, మీరు యజమాని కాదు. యజమాని కృష్ణుడు. అందువల్ల మీ ఇంద్రియాలను ఇంద్రియాల యజమాని సేవలో వినియోగించినప్పుడు, భక్తి, భక్తియుక్త సేవ అని పిలుస్తారు. ఇప్పుడు ఇంద్రియాలు నా ద్వారా నిమగ్నమవ్వుతాయి. నేను ఆలోచిస్తున్నాను "ఈ శరీరము నా భార్య యొక్క సంతృప్తి కోసం లేదా నా ఇది లేదా అది" చాలా విషయాలు, "నా దేశం, నా సమాజం." ఇది హోదా. కానీ మీరు ఆధ్యాత్మిక స్థితికి వచ్చినప్పుడు, "నేను దేవాదిదేవునిలో భాగము; నా కర్మలు దేవాదిదేవుని సంతృప్తి పరచాలి. "ఇది భక్తి. Sarvopādhi-vinirmuktam ( CC Madhya 19.170) అన్ని హోదాల నుండి విముక్తి పొందాటము. మీ ఇంద్రియాలు పవిత్రము అయినప్పుడు, ఆ ఇంద్రియాలను ఇంద్రియాల యజమాని యొక్క సేవలో వినియోగించినప్పుడు , ఇది కృష్ణ చైతన్యములో పని చేయాడము. మీ ప్రశ్న ఏమిటి? ధ్యానం, మనస్సును నిమగ్నము చేయుట, ఆ విధంగా ఉండాలి. అప్పుడు అది పరిపూర్ణంగా ఉంటుంది. లేకపోతే, మనస్సు పలువిధాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక నిర్దిష్ట విషయము మీద మీరు దానిని ఉoచకపోతే ... ఉoచటము అంటే ... మనస్సు ఏదో చేయాలనుకుంటుoది,ఎందుకంటే మనస్సు యొక్క లక్షణం ఆలోచిoచటము, అనుభూతి చెందటము, కోరికలు కలిగి ఉండటము, . మీరు కృష్ణుడిని గురిoచి ఆలోచిoచే విధoగా మీ మనసుకు శిక్షణ ఇవ్వాలి, మీరు కృష్ణుడిని అనుభూతి చేoదాలి, మీరు కృష్ణుడి కోసం పని చేయాలి. అప్పుడు అది సమాధి. అది పరిపుర్ణమైన ధ్యానం.