TE/Prabhupada 0317 - మనము కృష్ణుడికి శరణాగతి పొందుట లేదు. ఇది వ్యాధి



Lecture on BG 4.7 -- Bombay, March 27, 1974


ధర్మము అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు ఒకడు. దేవుడు ఎక్కడా చెప్పలేదు "ఇది ధర్మము ఇది ధర్మము కాదు." దేవుడు చెప్పుతాడు, భగవద్గీతలో భగవన్ కృష్ణుడి అంటాడు. ఇక్కడ చెప్పబడినది, yadā yadā hi dharmasya glānir bhavati ( BG 4.7) paritrāṇāya sādhū... తరువాతి వచనంలో అయిన చెప్పుతారు,

paritrāṇāya sādhūnāṁ
vināśāya ca duṣkṛtām
dharma-saṁsthāpanārthāya
sambhavāmi yuge yuge
(BG 4.8)

రెండు పనులు, కృష్ణుడివి. అయిన ఇప్పటికే వివరించారు, bhūtānām īśvaraḥ. నేను అన్ని జీవుల నియంత్రికుడిని. అందువలన ధర్మము అమలులో వ్యత్యాసాలు ఉన్నప్పుడు, అప్పుడు అయిన శిక్షించటం ప్రతిఫలమివ్వడము చేస్తారు. Paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām. రెండు విషయాలు.

ప్రభుత్వం యొక్క కర్తవ్యము రక్షణ కల్పించడము చట్టాన్ని గౌరవించే పౌరుడికి మరియు చట్టవ్యతిరేకమైన వారిని శిక్షించటము. ఇవి ప్రభుత్వం యొక్క రెండు విధులు. దేవాదిదేవుని ప్రభుత్వం, కృష్ణుడు ... ఎందుకంటే ఈ ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది? ప్రభుత్వం చట్టాన్ని గౌరవించే వ్యక్తికి ప్రతిఫలము ఇస్తుంది, లేదా రక్షణను ఇస్తుంది, చట్టబద్ధమైన వారు కాని వారికీ , రక్షణ కూడా ఉంటుoది కానీ శిక్షతో ఉంటుంది. ధర్మము అనగా, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఇది ధర్మము . ఇది ధర్మము . మన ధర్మము,మన లక్షణం కూడా అదే.

ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరము, మనము ఎవరికో ఒక్కరికి శరణాగతి పొందాము. ప్రతి ఒక్కరిని విశ్లేషించండి. అయిన తన కన్నా గొప్పవాడిగా ఉన్నావారికీ, శరణాగతి పొందాడు. ఇది అయిన కుటుంబం, భార్య లేదా అయిన ప్రభుత్వం, అయిన వర్గము, అయిన సమాజం, అయిన రాజకీయ పక్షము కావచ్చు. ఎక్కడికైనా వెళ్ళాoడి, లక్షణం శరణాగతి పొందుట. మీరు నివారించలేరు. ఆ మాస్కోలో ప్రొఫెసర్ కోటోవ్స్కీతో చర్చ జరిగింది. నేను అయినని అడిగాను, "ఇప్పుడు, మీ దగ్గర మీ కమ్యూనిస్టు తత్వము ఉన్నది. మా దగ్గర కృష్ణుడి తత్వము ఉన్నది. తత్వములో తేడా ఏమిటి? మీరు లెనిన్కి శరణాగతి పొందారు, మేము కృష్ణుడికి శరణాగతి పొందాము. తేడా ఏమిటి? " అందరూ శరణాగతి పొందాలి. అయిన శరణాగతి ఎక్కడ పొందాడు అనే దానికి పట్టింపు లేదు. శరణాగతి పొందుట సరైనది అయితే, అప్పుడు విషయాలు సరిగ్గా ఉంటాయి. శరణాగతి పొందుట సరైనది కాకపోతే, అప్పుడు విషయాలు సరిగ్గా ఉండవు. ఇది తత్వము. మనము శరణాగతి పొందుతున్నాము.

శ్రీ చైతన్య మహాప్రభు ఇది వివరించారు. Jīvera svarūpa haya nitya-kṛṣṇa-dāsa ( CC Madhya 20.108-109) మనము శరణాగతి పొందుతున్నాము, కానీ మనము కృష్ణుడికి శరణాగతి పొందుట లేదు. ఇది వ్యాధి. ఇది వ్యాధి. కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఈ వ్యాధిని నయం చేయడము అని అర్థం. ఈ వ్యాధిని నయము చేసుకోండి. కృష్ణుడు కూడ వస్తాడు. అయిన చెప్పాడు, yadā yadā hi dharmasya ( BG 4.7) dharmasya glāniḥ, తేడాలు ధర్మము పాటించుటలో వ్యత్యాసాలు, తేడాలు ఉన్నప్పుడు, కృష్ణుడు చెప్పుతాడు, tadātmānaṁ sṛjāmy aham అని . మరియు abhyutthānam adharmasya రెండు విషయాలు ఉన్నాయి. ప్రజలు కృష్ణుడికి శరణాగతి పొందకుండా ఉంటే, వారు చాలా మంది కృష్ణులను తయారు చేస్తారు. చాలామంది ముర్ఖులు ఉన్నారు అక్కడ శరణాగతి పొందాటానికి. అది అధర్మస్యా. ధర్మ అంటే కృష్ణుడికి శరణాగతి పొందుటమే కాకుండా, కృష్ణుడికి శరణాగతి పొందే బదులు, వారు పిల్లులు, కుక్కలు, ఇవి, ఆవి, అనేక విషయాలకు శరణాగతి పొందాలి అనుకుంటున్నారు. అది ఆధర్మము .

కృష్ణుడు హిందూ ధర్మము లేదా ముస్లిం ధర్మము లేదా క్రిస్టియన్ ధర్మము అని పిలవబడే వాటి స్థాపనకు రాలేదు. రాలేదు అయిన వాస్తవమైన మతాన్ని స్థాపించడానికి వచ్చాడు. వాస్తవ ధర్మము అంటే మనం వాస్తవమైన వ్యక్తికి శరణాగతి పొందాలి. అది వాస్తవమైన ధర్మము. మనము శరణాగతి పొందుతున్నాము. ప్రతిఒక్కరు కొంత ఆలోచన కలిగి ఉన్నారు. అయిన అక్కడ శరణాగతి పొందాడు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, ఏదైనా. ప్రతిఒక్కరూ కొంత ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆదర్శమునకు నాయకుడు కూడా అక్కడే ఉన్నాడు. మన పని శరణాగతి పొందుట. అది సత్యము. కానీ మనం ఎక్కడ శరణాగతి పొందాలో మనకు తెలియదు. ఇదే కష్టం. శరణాగతిలో తప్పు చేయటము వలన లేదా తప్పుడి ప్రదేశములో శరణాగతి ఉన్నందున, ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది.

మనము శరణాగతి ఇక్కడ నుండి అక్కడకి మారుస్తున్నాము ఇక కాంగ్రెస్ పక్షము వద్దు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పక్షమున ఉoద్దాము. " మళ్ళీ, "ఇక కమ్యూనిస్ట్ పక్షము కాదు ... ఈ పక్షము, ఆ పక్షము." పక్షము మార్చాటము వలన ఉపయోగం ఏమిటి? ఈ పక్షము లేదా ఆ పక్షము అయిన, వారు కృష్ణుడికి శరణాగతి పొందలేదు. మీరు కృష్ణుడికి శరణాగతి పొందే స్థానమునకు రాకుండా ఉంటే, ఏ శాంతి ఉండదు. ఆది విషయము. కేవలము వేయించే పెనము నుండి మంటలోకి మారడము ద్వారా మీరు మిమ్మల్ని రక్షించుకోలేరు.